CM Revanth Reddy :ప్రజా దీవెన హైదరాబాద్: తారాస్థాయి వివాదాలకు తెరలేపిన కంచ గచ్చిబౌలి భూముల విష యంలో ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చింది అని చెప్పవచ్చు. సుప్రీం కోర్టు చొరవ చూపి చివాట్లు పెట్టిన నేపథ్యంలో ప్రభుత్వం దిద్దు బాటు చర్యలకు ఉపక్ర మించింది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచర ణపై మంత్రుల బృందంతో ఒక క మిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు నిర్ణ యించిందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ కమిటీలో సభ్యులుగా ఉం టారని తెలిపారు.
కంచ గచ్చిబౌలి భూ సమస్యల పరిష్కారం దిశగా ఈ కమిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివ ర్సిటీ కార్యనిర్వాహక కమిటీతో, జేఏసీ మరియు పౌర సమాజ స మూహాలతో, విద్యార్థుల ప్రతినిధి బృందంతో, అలాగే సంబంధిత స్టేక్ హోల్డర్లు అందరితోనూ సంప్రదింపు లు జరుపుతుందని ముఖ్యమంత్రి X లో పేర్కొన్నారు.