CM Revanth Reddy : ప్రజా దీవెన చెన్నై: లోక్‌సభ నియో జకవర్గాల పునర్విభజన విషయం లో దక్షిణాది రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు విభేదాలను పక్కనపెట్టి త మ వాటా దక్కించుకునేందుకు ఐ క్యంగా పోరాడాల్సిన అవసరం ఉం దని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. పునర్విభజన ప్రక్రియపై రాష్ట్ర శాసనసభలో త్వ రలోనే తీర్మానం ఆమోదిస్తామని, అదే తరహాలో మిగతా రాష్ట్రాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. నియోజ కవర్గాల పునర్విభజనపై తమిళనా డు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చె న్నైలో నిర్వహించిన Fair Delim itation (న్యాయమైన పునర్విభ జన) జాయింట్ యాక్షన్ కమిటీ తొలి సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. దక్షిణాది రాష్ట్రాల కు నష్టం కలిగించే పునర్విభజనపై ఐక్యంగా పోరాడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.పునర్విభజన అం శంలో సమావేశంలో అనేక కీలక అంశాలను ప్రస్తావించిన ముఖ్య మంత్రి, దీనిపై ఐక్య కార్యాచరణ కో సం త్వరలో హైదరాబాద్‌లో తదు పరి సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ పోరాటంలో ప్రజల ను భాగస్వామ్యం చేయడానికి భా రీ బహిరంగ సభను నిర్వహిస్తామ ని చెప్పారు. దక్షిణ భారతదేశ పౌ రుల గళాన్ని బలంగా, ఐక్యంగా మొత్తం భారత దేశానికి వినిపిద్దా మని పిలుపునిచ్చారు. “నియో జకవర్గాల పునర్విభజనపై మనం దరిని ఏకతాటిపై తెచ్చిన తమిళ నాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ప్రత్యేక అభినందనలు. ఈ విష యంలో దక్షిణాది రాష్ట్రాలు ఐక్యం గా పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నా. 1971లో జనాభా నియంత్రణ పా టించాలని దేశం నిర్ణయం తీసుకు న్నప్పటి నుంచి దక్షిణాది రాష్ట్రాలు దాన్ని అమలు చేశాయి. ఉత్తరాది పెద్ద రాష్ట్రాలు జనాభా నియంత్రణ లో విఫలమయ్యాయి. దక్షిణాది రా ష్ట్రాలన్నీ వేగంగా ఆర్థిక వృద్దిని సా ధించాయి. జీడీపీ, తలసరి ఆదా యం, వేగంగా ఉద్యోగాల కల్పన, మెరుగైన మౌలిక వసతుల కల్పన, సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమా ల నిర్వహణలో మంచి ప్రగతి సా ధించాయి.
కేంద్ర ఖజానాకు పెద్ద మొత్తంలో నిధులు ఇస్తూ, తిరిగి తక్కువ మొ త్తాన్ని పొందుతున్నాం. తమి ళనా డు పన్నుల రూపంలో కేంద్రా నికి రూపాయి చెల్లిస్తే తిరిగి 29 పైసలే వెనక్కి వస్తుంది. ఉత్తర ప్రదేశ్‌కు 2.73 రూపాయలు వెనక్కి వెళు తున్నాయి. బీహార్ రూపాయి చెల్లి స్తే 6.06 రూపాయలు వెనక్కి వెళు తున్నాయి. కర్ణాటకకు కేవలం 14 పైసలు, తెలంగాణకు 41 పైసలు, కేరళకు 62 పైసలు మాత్రమే వెన క్కి వస్తున్నాయి. అదే సమయంలో మధ్య ప్రదేశ్ రూపాయి పన్ను రూ పంలో కేంద్రానికి ఇస్తే వెనక్కి రూ.1 .73 పైసలు వెళుతున్నాయి. దక్షి ణాది రాష్ట్రాలకు కేంద్రం కేటాయిం పులు, పన్ను చెల్లింపులు క్రమంగా తగ్గిస్తోంది. చివరకు జాతీయ ఆరో గ్య మిషన్ కేటాయింపుల్లోనూ ఉ త్తరాది రాష్ట్రాలకు 60 నుంచి 65 శాతం నిధులు దక్కుతున్నాయి.
మనది ఒకే దేశం. మనం దానిని గౌరవిస్తాం. కానీ ఈ నియోజకవ ర్గాల పునర్విభజనను అంగీ కరిం చం. ఎందుకంటే రాజకీయంగా దక్షి ణాది రాష్ట్రాలను కుదించడమే. మంచి ప్రగతి సాధిస్తున్న రాష్ట్రా ల ను ఈ ప్రక్రియ ద్వారా శిక్షిస్తోంది. ఈ అసమగ్రమైన పునర్విభజన ప్రక్రియ చేపట్టకుండా అడ్డుకోవల సిన అవసరం ఉంది.
ప్రస్తావనలో ప్రధానమైనవి…
— సీట్లు పెంచొద్దు. ఉన్న సీట్లతోనే పునర్విభజన ప్రక్రియ చేపట్టాలి. 1976లో ఇందిరా గాంధీ నేతృ త్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆ రకం గానే పునర్విభజన చేపట్టారు. లేదంటే రాష్ట్రాల మధ్య రాజకీయ అసమానతలు ఏర్పడేవి. 2001లో ప్రధానమంత్రి వాజ్‌పేయి నేతృత్వం లోని ప్రభుత్వం పునర్విభజన ప్రక్రి యను కూడా ఇదే రకంగా చేపట్టా రు. లోక్‌సభ సీట్లను అదే సంఖ్యలో ఉంచుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అదే విధంగా చేయగ లరా?
— జనాభా దామాషా ప్రాతిపదికను పునర్విభజన దక్షిణాది వ్యతిరేకి స్తోంది. బీజేపీ ప్రతిపాదిస్తున్న జనా భా దామాషా పద్దతిలో పునర్విభ జనను చేపడితే దక్షిణాది రాష్ట్రా లు రాజకీయ గళం కోల్పోతాయి. దక్షిణాది రాష్ట్రాలు ఉత్తరాదిలో ద్వితీయ శ్రేణి పౌరులుగా తగ్గించి బడుతుంది.జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపడితే ఉత్తరప్ర దేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థా న్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాలు దేశంపై ఆధిపత్యం చలాయిస్తా యని అందరూ అంగీకరిస్తున్నారు. ఏ పరిస్థితుల్లోనూ ఈ ప్రతిపాదన ను అంగీకరించకూడదు.
–ప్రొరేటా విధానాన్నీ అంగీకరిం చలేం. ప్రొరేటా విధానం కూడా దక్షి ణాదికి నష్టమే కలగజేస్తుంది. ప్రొ రేటా ప్రక్రియ కూడా రాజకీయ అం తరాలను పెంచుతుంది. ప్రొరేటా విధానాన్ని పాటిస్తే సీట్ల మధ్య తేడా కేంద్ర ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయిస్తుంది. ఒక్క సీటు కూడా కేంద్రంలో ప్రభుత్వాలను నిర్ధేశిం చగలదు. దేశంలో ఒక్క సీటుతో కేంద్ర ప్రభుత్వం పడిపోయిన చరిత్ర మన అనుభవంలో ఉంది.
ఆమోదయోగ్య ప్రతిపాదన లు
— మరో 25 ఏళ్లపాటు లోక్‌సభ సీట్లలో ఎటువంటి మార్పు తీసు కురావద్దు. సీట్ల సంఖ్యలో మార్పు లేకుండా పునర్విభజన ప్రక్రియ చేపట్టాలి. పునర్విభజనకు రాష్ట్రా న్ని యూనిట్ గా తీసుకొని చేయా లి. రాష్ట్రాల్లోని జనాభా ఆధారంగా పునర్విభజన చేపట్టాలి.
–రాష్ట్రాల్లోని నగరాలు, గ్రామాల్లోని జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్ల హద్దులను మార్పు చేయాలి. తా జా జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రా ల్లో ఎస్సీ, ఎస్టీ సీట్ల సంఖ్య పెంచా లి. ప్రతి రాష్ట్రంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. లో క్ సభ స్థానాల పెంపును మరో 25 ఏళ్లపాటు వాయిదా వేయాలి.
–జనాభా నియంత్రణలో ప్రగతి సా ధించిన దక్షిణాది రాష్ట్రాలను శిక్షిం చే విధానానికి కేంద్రం స్వస్తి చెప్పా లి. జనాభా దామాషా ప్రాతిపదికన పునర్విభజన చేపట్టొద్దని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్న నేప థ్యంలో లోక్‌సభ నియోజకవర్గా లకు సంబంధించి దేశంలోని ఇతర రాష్ట్రాలతో సంబంధం లేకుండా చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రా లు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సీట్ల ను ఏర్పాటు చేసినట్లే దక్షిణాదికి అవకాశం ఇవ్వాలి.
–మంచి ప్రగతి సాధించిన దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంట్ సీట్లలో మంచి వాటా ఇవ్వడం ద్వారా ఇ తర రాష్ట్రాలు ఆర్థిక వృద్ది, సుప రిపాలనపై దృష్టి సారించేలా చే యాలి.
ప్రధాన డిమాండ్లు
— 543 సీట్లు ఉన్న లోక్‌సభలో ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల సీట్ల సంఖ్య 130. ఇది మొత్తం సీట్లలో 24 శాతం. పునర్విభజన తర్వాత ఏర్పడే నూతన లోక్‌సభలో దక్షి ణాది రాష్ట్రాలకు 33 శాతం సీట్లు ఇవ్వాలి.
— దేశవ్యాప్తంగా 50 శాతం సీట్లను పెంచాలనుకుంటే అలా పెరిగే 272 సీట్లతో మొత్తం లోక్‌సభ సీట్ల సం ఖ్య 815 అవుతుంది. ఇందులో 3 3 శాతం అంటే దక్షిణాది రాష్ట్రాల లోక్‌సభ సీట్లు 272 గా ఉండాలి. ఈ సీట్లను దక్షిణాదిలోని తమిళ నాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలకు ఇప్పు డున్న ప్రొరేటా ప్రాతిపదికన పంచ వచ్చు.
–దేశంలో మిగిలిన సీట్లను ఉత్త రాది, ఇతర రాష్ట్రాలకు కేంద్రం పం చవచ్చు. అనుకున్న దానికంటే దక్షి ణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్య తగ్గి స్తే అది దేశ రాజకీయ రంగంపై ప్రతి కూల ప్రభావం చూపుతుందని ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరిం చారు.