Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : కొనసాగుతోన్న సీఎం రేవంత్ సింగపూర్ పర్యటన

CM Revanth Reddy : ప్రజా దీవెన, సింగపూర్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సింగపూర్ పర్యటన విజయ వంతంగా కొనసాగుతోoది. సింగ పూర్‌లో పర్యటిస్తున్న ముఖ్యమం త్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆ దేశ పర్యా వరణ శాఖ మంత్రి గ్రేస్ ఫూ హైయి న్ తో సమావేశమయ్యారు. తెలం గాణలో ఉన్న అపార పెట్టుబడి అవకాశాలు, భాగస్వామ్యాలపై ఈ సమావేశంలో ఇరుపక్షాల మధ్య విస్తృత చర్చలు జరిగాయి.

 

ముఖ్యంగా పట్టణాభివృద్ధి ప్రణా ళిలు, మౌలిక సదుపాయాల కల్ప న, నీటి వనరులు – నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, క్రీడలు, సెమీ కండక్టర్లు, తయారీ, పర్యావ రణం, స్థిరత్వ, సాంకేతికత సహా వివిధ రంగాలలో తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, భాగస్వామ్యాలపై చర్చలు సాను కూల వాతావరణంలో జరిగాయి.ఈ చర్చల్లో ముఖ్యమంత్రి వెంట ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులు, సింగపూర్‌లో భారత డిప్యూటీ హై కమిషనర్ పూజ ఎం.టిల్లు పాల్గొన్నారు.

 

ఆసక్తి కనబరిచిన సింగపూర్ మంత్రి… లక్ష్యాలు, ఆ మేరకు ప్రజా ప్రభుత్వం అనురిస్తున్న కా ర్యాచరణ పట్ల సింగపూర్ మంత్రి గ్రేస్ ఫూ హైయిన్ ఆసక్తి కనబరిచా రు. ప్రధానంగా నెట్ జీరో ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, నీటి నిర్వహణ, స్థిరత్వ ప్రణాళిక ల్లో తెలంగాణతో భాగస్వామ్యం అంశాన్ని సింగపూర్ ప్రభుత్వం పరిశీలిస్తుందని వారు హామీ ఇచ్చా రు. ఉమ్మడి ప్రాజెక్టులపై సాధ్యమై నంత వేగంగా ముందుకు పోవా లని, మరింత సమన్వయంతో పని కలిసి చేయాలని ఇరుపక్షాలు అంగీ కరించాయి.