Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : సీఎం కీలక నిర్ణయం, ఆర్టీసీలో చరిత్రత్మాక ఘట్టం

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం తీపికబురు అందించింది. ముఖ్యమంత్రి ప్రజా వాణి చొరవతో, ఆర్టీసీ యాజమా న్యం అంగీకారంతో ఆర్టీసీ చరిత్రలో నూతన అధ్యాయనానికి తెరలే చింది. ఆర్టీసీలో చరిత్రత్మాక ఘట్టం మంగళవారం ఆవిష్క్రుతమైందని చెప్పవచ్చు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే…వివిధ కార ణాలతో ఉద్యోగాల నుంచి తొలగిం చబడ్డ 136 మంది ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం తిరిగి విధు ల్లోకి తీసుకుంది. ఇందులో కండ క్టర్స్, డ్రైవర్స్, మెకానిక్స్, సెక్యూరి టీ ఘార్డ్స్ వంటి వాళ్ళు ఉన్నారు.

ఆర్టీసీలో ఉద్యోగాలు కోల్పోయిన దాధాపు 472 మంది ఆర్టీసీ ఉద్యో గులు తమ తప్పులను క్షమించి తి రిగి విధుల్లోకి తీసుకోవాలని కోరు తూ సీఎం ప్రజావాణిలో ఇంచార్జ్ చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్యలకు కొన్ని నెలల క్రితం విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

చిన్నారెడ్డి, దివ్య రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టి కి ఆర్టీసీ ఉద్యోగుల అంశాన్ని తీ సుకెళ్లారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభు త్వం సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ చైర్మన్ గా సెర్ప్ సీఈఓ, ప్రజావాణి స్టేట్ నోడల్ అధికారి దివ్య మెంబర్ గా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మెంబర్ కన్వీనర్ గా కమిటీ వేశారు.

త్రీమెన్ కమిటీ ఆర్టీసీ ఉద్యోగుల విషయాన్ని పరిశీలించి తొలి విడ తగా 136 ఉద్యోగులకు తిరిగి వి ధుల్లోకి తీసుకుంటూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. మిగిలిన 336 మంది ఆర్టీసీ ఉద్యో గుల సమస్యలు వినేందుకు బ్యాచ్ వారీగా తేదీలను ఖారారు చేసి షె డ్యూల్ ప్రకటించారు.

మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో మంగళవారం జరిగిన సీఎం ప్రజావాణి కార్యక్రమానికి వ చ్చిన ఆర్టీసీ ఉద్యోగులు చిన్నారెడ్డి, దివ్య సహా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లకు ధన్యవాదాలు తెలి పారు.