Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy: కాజీపేట‌లో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ నెల‌కొల్పాలి

— కేంద్ర రైల్వే శాఖ మంత్రి కి సీఎం రేవంత్ రెడ్డి వినతి

ప్రజా దీవెన, న్యూఢిల్లీ: కాజీపేట‌లో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్ట‌రీ నెల‌కొల్పాల‌ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్‌కు ముఖ్య‌ మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కేవలం కాజీ పేట వాసులకల మాత్రమే కాదని, యావత్ తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమని, దాన్ని సాకారం చేయ డంలో కేంద్రం ముందుకు రావాల ని కోరారు. రాష్ట్ర ఎంపీలతో కలిసి సీఎంగారు అశ్వనీ వైష్ణవ్ ను కలి శారు. రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం లో కాజీపేట‌లో కోచ్ ఫ్యాక్ట‌రీ ఏర్పా టును పేర్కొన్న విష‌యాన్ని ప్రస్తా వించారు.

కాజీపేట‌లో పీరియాడి క‌ల్ ఓవ‌ర్‌హాలింగ్ (పీవోహెచ్‌) వ‌ర్క్‌షాప్ ఏర్పాటు చేస్తున్న‌ట్లు రైల్వే శాఖ ప్ర‌క‌టించింద‌ని గుర్తు చేస్తూ ఆ త‌ర్వాత సైతం కోచ్ ఫ్యాక్ట‌ రీ ఏర్పాటు కోరుతూ తాను లేఖ రాశాన‌ని చెప్పారు. అలాగే, వికారా బాద్‌ – కృష్ణా స్టేష‌న్ మ‌ధ్య పూర్తిగా రైల్వే శాఖ వ్య‌యంతో నూత‌న రైలు మార్గం నిర్మించాల‌ని, తద్వా రా ఇరు ప్రాంతాల మధ్య రావాణా కు 70 కిలోమీటర్ల దూరం తగ్గు తుందని చెప్పారు. ఆ మార్గం నిర్మిస్తే ద‌క్షిణ తెలంగాణ‌లో మారు మూల‌ వెనుక‌బ‌డిన ప‌రిగి, కొడం గ‌ల్‌ తదితర ప్రాంతాలన్నీ సిమెంట్ క్ల‌స్ట‌ర్‌, ఇత‌ర ప‌రిశ్ర‌మ‌లు అభివృద్ది కి అవ‌కాశం ఉంటుంద‌ని వివ‌రిం చారు. క‌ల్వ‌కుర్తి-మాచ‌ర్ల మ‌ధ్య నూత‌న రైలు మార్గం మంజూరు చేయాల‌ని సీఎం కోరారు.

క‌ల్వ‌కుర్తి నుంచి వంగూరు- కందుకూరు- దేవ‌ర‌కొండ‌-చ‌ల‌కుర్తి-తిరుమ‌ల‌గిరి మీదుగా మాచ‌ర్ల వ‌ర‌కు తాము ప్ర‌తిపాదించే నూతన మార్గం ప్ర‌తి పాదిత గ‌ద్వాల‌-డోర్న‌క‌ల్‌, ఇప్ప‌టికే ఉన్న మాచ‌ర్ల మార్గాల‌ను అనుసం ధానిస్తుంద‌ని సీఎం వివ‌రించారు. డోర్న‌క‌ల్‌-మిర్యాల‌గూడ (పాప‌ట‌ ప‌ల్లి-జాన్ ప‌హాడ్‌), డోర్న‌క‌ల్‌ -గ‌ద్వా ల ప్ర‌తిపాదిత రైలు మార్గాల‌ను పునఃప‌రిశీలించాల‌ని సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. ఈ రెండు మార్గాల అలైన్‌ మెంట్‌ను పునఃప‌రిశీలించాల‌ని కేంద్ర మంత్రిని కోరారు. ముఖ్యమం త్రి వెంట ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, మల్లు రవి, సురేష్ శేట్కర్ , పొరిక బలరాం నాయక్ , చామల కిరణ్ కుమార్ రెడ్డి, గడ్డం వంశీ, కడియం కావ్య, రామ సహా యం రఘురామిరెడ్డి, కుందూరు రఘువీర్ గారు, ప్రభుత్వ సలహ దారు మహమ్మద్ అలీ షబ్బీర్, మాజీ ఎంపీ హన్మంతరావు ఉన్నారు.