Praja Deveena
Newspaper Banner
Date of Publish : 01 December 2025, 9:10 am Posted by : praja deveena

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం, మే డారం అభివృద్ధి ప‌నుల్లో నాణ్య‌తా ప్ర‌మాణాలు పాటించాలి 

CM Revanth Reddy : ప్రజా దీవెన,హైదరాబాద్: మేడారం అభివృద్ధి ప‌నుల్లో నాణ్య‌ తా ప్ర‌మాణాలు పాటించాల‌ని ము ఖ్య‌మంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి అధి కా రుల‌ను ఆదేశించారు. అధికారులు, ఇంజినీర్లు క్షేత్ర స్థాయిలో ఉండి ప‌ నులను ప్ర‌త్య‌క్షంగా ప‌ర్య‌వేక్షిం చాల‌ ని ఏ మాత్రం పొర‌పాట్లు దొర్లినా క‌ఠి న చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ రించారు.మేడారం అభివృద్ధి ప‌ను ల‌పై ముఖ్య‌మంత్రి మంత్రులు పొం గులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీఎం సల హాదారు వేం నరేందర్ రెడ్డితో పాటు ఉన్నతా ధికారులతో జరిగిన సమా వేశంలో స‌మీక్షించారు.

మేడారం అభివృద్ధిలో భాగంగా రా తి ప‌నుల‌తో పాటు ర‌హ‌దారులు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, గ‌ద్దెల చుట్టూ భ‌క్తుల రాక‌పోక‌ల‌కు సం బంధించిన మార్గాలు, భ‌క్తులు వేచి ఉండే ప్ర‌దేశాలు ఇలా ప్ర‌తి ఒక్క అంశంపైనా ముఖ్య‌మంత్రి అధి కారుల‌కు సూచ‌న‌లు చేశారు.

ప‌నులు సాగుతున్న తీరుపై ప్ర‌ద‌ ర్శించిన‌ పవ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌ న్‌ను ప‌రిశీలించిన ముఖ్య‌మంత్రి ప‌లు విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌ను సూచించారు. ఆర్ అం డ్ బీ, విద్యుత్ శాఖ‌, దేవాదాయ శాఖ‌, అట‌వీ శాఖ‌, స్థ‌ప‌తి శివ‌నాగి రెడ్డిస‌మ‌న్వ‌యంతో సాగాలని ము ఖ్యమంత్రి సూచించారు.

అభివృద్ధి ప‌నుల్లో ఆదివాసీ సం స్కృతి, సంప్ర‌దాయాలు, ఆచారా ల‌కు పెద్ద పీట వేయాల‌ని మరోసారి స్పష్టంగా చెప్పారు. నిర్దేశిత స‌మ‌ యంలోనే అభివృద్ధి ప‌నులు పూర్తి కావాల‌ని ఆదేశించారు. ఈ సమా వేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, సీఎం ముఖ్య కార్య‌ద‌ర్శి శ్రీ‌నివాస‌రాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి సందీ ప్ కుమార్ సుల్తానియా, దేవాదా య శాఖ క‌మిష‌న‌ర్ హ‌రీష్‌, ఆర్ అండ్ బీ ఈఎన్సీ మోహ‌న్ నాయ‌క్‌ తో పాటు ఇతర అధికారులు పా ల్గొన్నారు.