Revanth Reddy on KCR :ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో అడ్డగోలుగా ఆగమాగంగా 11 శాతం వడ్డీకి అప్పుతెచ్చిన కేసీఆర్ రాష్ట్రాన్ని దివాళా తీయించి ఫామ్ హౌస్ సల్లగా పడుకున్నాడని తెలం గాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీ వ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకపోయి నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు సమరమని ప్రకటించడం ఏంటని ఒకింత అస హనం ప్రదర్శించారు. ఉద్యోగ సం ఘాల నాయకుల్లారా ఎవరి మీద మీరు యుద్ధం చేస్తారు, మీకు బా ధ్యత లేదా అని ఉద్యోగ సంఘాల నాయకులను నిలదీశారు. నన్ను కోసినా నెలకు తెలంగాణ ఆదా యం రూ.18,500 కోట్లే వస్తుందని, ఒక్క రూపాయి అదనంగా వచ్చినా మీకే పంచిపెడుతానంటూ సీఎం రే వంత్ నర్మగర్భంగా వ్యాఖ్యానించా రు. తమ సమస్యల పరిష్కారం కో సం పోరు బాట పడతామని ప్రభు త్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్ష న ర్ల జేఏసీ చేసిన ప్రకటనపై సుతి మెత్తగా చురక అంటించారు.
సోమ వారం హైదరాబాద్ లోని పోలీస్ క మాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం మీడియాతో మాట్లాడు తూ రూ.10 0 పెట్రోల్ రూ.200 చేయమంటారా రూ.30 బియ్యం రూ. 60 చేద్దామా బోనస్ లు, జీ తాల పెంపు ఎలా చేయాలో ఉద్యో గ సంఘాలే చెప్పాలన్నారు. ఏదై నా సమస్య ఉంటే చర్చలకు రావా లని, అంతేకాని రాజ కీయనాయ కుల చేతుల్లో పావులుగా మారవ ద్దని హితవు పలికారు. గడిచిన పదేళ్లలో ఏ ప్రభుత్వ ఉద్యోగి ఒక టో తేదీన జీతాలు తీసుకోలేదన్నా రు. ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తె లంగాణ కేసీఆర్ మూలంగా అప్పు ల రాష్ట్రంగా మారి పోయిందన్నా రు.
ఈ 16 నెలల కాలంలో తాము రూ. 1.58 లక్షల కోట్ల అప్పులు తెస్తే కేసీ ఆర్ చేసిన అప్పు, వడ్డీకి కలిసి 7 డిసెంబర్ 2023 నుంచి 31 మార్చి 2025 నాటికి 1.52 వేల కోట్లు చె ల్లించామని సీఎం తెలిపారు. తా ము తెచ్చిన ఏ ఒక్క రూపాయి కూ డా ప్రజా సంక్షేమం, ప్రభుత్వ ఉద్యో గుల కోసం వాడలేదన్నారు. కేసీఆ ర్ తమ ప్రభుత్వంపై మోపిన రూ. 8.29 లక్షల కోట్ల బకాయిలు చెల్లిం చామన్నారు. ప్రస్తుతం నెలకు రూ. 7 వేల కోట్ల అసలు,వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు.