Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ ను దర్శిం చుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 

Khairatabad Bada Ganesh : ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ లోని ఖైరతాబాద్ శ్రీ విశ్వ శాంతి మహా గణపతి మహదేవు డిని శుక్రవారం ముఖ్యమంత్రి ఎ. రే వంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూ జలు నిర్వహించారు. ఆ విఘ్నేశ్వ రుడి కృప ప్రజలందరిపైనా ఉం డా లని ఈ సందర్భంగా ప్రార్థించారు.

హైదరాబాద్ నగర చరిత్రలో గడి చి న 71 సంవత్సరాలుగా ఎన్ని ఇ బ్బందులు, కష్టాలొచ్చినా దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఖైరతా బాద్ బడా గణేష్ ఉత్సవాలను జ రుపుతున్నారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నిర్వాహకులను అ భినందించారు.

ఇలాంటి కార్యక్రమాలను ఒకసారి చేయడమే కష్టమవుతున్న ఈ కా లంలో ఎన్ని ఉపద్రవాలొచ్చినా త ట్టుకుని నిలబడి నిర్వహిస్తున్న ఖైర తాబాద్ గణపతికి పోటీ లేదన్నా రు. హైదరాబాద్‌లో 1 లక్షా 40 వేల విగ్రహాలను ప్రతిష్టించుకుని ఉత్స వాలను అత్యంత వైభవంగా జరు పుకుంటున్నామని చెప్పారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా గ ణేష్ మండపాలకు ఉచిత విద్యు త్‌ను అందిస్తున్నామని చెప్పారు. భక్తుల మనోభావాలను గౌరవించే విధంగా నగరంలో పోలీసు, ము న్సిపల్, రెవెన్యూ, విద్యుత్, ఇతర శాఖలు తోడ్పాటును అందిస్తు న్నా యని చెప్పారు.

అన్ని మతాలను గౌరవిస్తూ హై ద రాబాద్ నగరం మత సామరస్యా నికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. ప్ర జలకు ఎలాంటి అసౌకర్యాలు కల గకుండా ట్యాంక్‌బండ్‌తో పాటు ఇ తర ప్రాంతాల్లో ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, ప్రజలంతా భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసుకో వాలని పిలుపునిచ్చారు.