— కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
ప్రజా దీవెన, న్యూఢిల్లీ: రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలోని వెనుకబ డిన జిల్లాలకు పెండింగ్లో ఉన్న రూ.1,800 కోట్ల గ్రాంటును వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆర్థిక శాఖ మం త్రి నిర్మల ను విజ్ఞప్తి చేశారు. 9 జిల్లా లకు సంబంధించి 2019 నుంచి 2024 వరకు ఏటా రూ.45 0 కోట్ల చొప్పున గ్రాంటు విడుద లకు అంగీకరించిన అంశాన్ని వారి దృష్టికి తెచ్చిన ముఖ్యమంత్రి ఆ నిధులు వెంటనే విడుదల చేయా లని కోరారు.ముఖ్యమంత్రి ఎంపీల తో కలిసి పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ ని వారి చాంబర్ లో కలిసి రాష్ట్రానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న పలు అంశాలపై వినతిపత్రాలను అందజేశారు.
రాష్ట్ర పునర్విభజన తర్వాత హైదరాబాద్లోని హైకోర్టు, రాజ్ భవన్, లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, జ్యుడీషియల్ అకాడమీ సహా ఇతర ఉమ్మడి సంస్థల నిర్వహణను తెలంగాణ ప్రభుత్వమే భరించిన విషయాన్ని తెలియజేశారు. ఆయా సంస్థల విభజన పూర్తయ్యే వరకు నిర్వహ ణకు రూ.703.43 కోట్లను తెలంగా ణ భరించిందని, అందులో ఆంధ్రప్ర దేశ్ వాటా కింద రూ.408.49 కోట్లను తెలంగాణకు చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఆ మొత్తం చెల్లించడానికి ఆంధ్రప్రదేశ్ సమ్మతి తెలిపినప్పటికీ ఇప్పటివరకు చెల్లించలేదన్నారు. ఆ విషయంలో కేంద్ర హోం శాఖ సైతం ఆ ఏపీకి లేఖలు రాసినట్టు గుర్తుచేశారు. వడ్డీతో సహా ఆ మొత్తం తెలం గాణకు చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని సీఎం కోరారు.
ఉమ్మడి రాష్ట్రంలో విదేశీ ఆర్థిక సహాయంతో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించి ఏపీ, తెలంగాణల మధ్య రుణాల పంపిణీ విషయంలో తెలంగాణ నుంచి రూ.2,547.07 కోట్ల రికవరీకి కేంద్రం ఏకపక్షంగా ఆదేశాలు ఇచ్చిందని, ఆ విషయంపై మరోసారి సమీక్షించి సరైన నిర్ణయం తీసుకోవాలని సీఎంగారు కోరారు. 2014-15 లో కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబం ధించిన నిధులను కేంద్రం కేవలం ఏపీకి మాత్రమే కేటాయించిందని గుర్తుచేశారు. జనాభా ప్రాతిపదికన ఆ మొత్తంలో ఏపీ నుంచి తెలంగాణకు రూ.495 .20 కోట్లు సర్దుబాటు చేయాల్సి ఉందని, నిధులు ఇప్పించేలా ఆ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు. ముఖ్యమం త్రి వెంట కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఎంపీలు ఎం. అనిల్ కుమా ర్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ కడియం కా వ్య, కుందూరు రఘువీర్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు పాల్గొ న్నారు