Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy: సీఎం కీలక వ్యాఖ్య,విద్యార్థులంతా రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వా ములవ్వాలి

CM Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: జీవితం లో తొలి మెట్టు ఎక్కబోతున్న వి ద్యార్థినీ విద్యార్థులంతా కష్ట పడి చదువుకుని భవిష్యత్తులో మరిం తగా రాణించి రాష్ట్ర పునర్నిర్మా ణంలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆకాం క్షించారు. చదువుకోవడం ద్వారా కుటుంబానికే కాకుండా, సొంత ఊ రికి, రాష్ట్రానికి, దేశానికి పేరు ప్రతి ష్టలు తేవొచ్చని ఉద్భోదించారు. బా బూ జగ్జీవన్‌రామ్ భవన్‌లో తెలం గాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (TGSWR EIS) ఆధ్వర్యంలోని ఎస్సీ గురుకు లాల నుంచి ఐఐటీ, ఎన్ఐటీల్లాంటి ప్రఖ్యాత సంస్థల ప్రవేశాలతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 10 వ తరగతి, ఇంటర్ విద్యార్థు లకు అవార్డుల బహూకరణ, ఉత్త మ ఫలితాలు సాధించిన గురుకు లాలకు ప్రోత్సాహకాలు అందించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొ న్నారు.శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసా ద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మ ల్లు భట్టివిక్రమార్కతో కలిసి పాల్గొ న్న ముఖ్యమంత్రి ముందుగా ప్రాంగ ణంలో విద్యార్థుల చిత్రకళా గ్యాల రీని ప్రా రంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే…. “అసమాన తలు తొలగించి సమసమాజం నిర్మించాలన్న ఆనాటి పోరాటయో ధుల స్ఫూర్తితో ప్రభుత్వం పనిచే స్తోంది. గురుకులాల్లో చదువుకుం టున్న మా పిల్లలు రేపటి రోజున ఉన్నత శిఖరాలను అధిరో హించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగ స్వాములు కావాలని కాంక్షిస్తున్నా.

తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాప రెడ్డి గారి పేరును తెలుగు యూనివర్సిటీకి, మహిళా విద్యాల యానికి చాకలి ఐలమ్మ పేరును, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరును.. ఇలా ఎందరో త్యాగమూ ర్తుల స్ఫూర్తితోనే సమసమాజ ని ర్మాణం కోసం ప్రభుత్వం పనిచేస్తోం ది. జవహర్ లాల్ నెహ్రూ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్నాం.

ప్రజల కోసం పాటుపడిన వారే చరిత్రలో నిలిచిపోతారు. ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే చదువు చాలా ముఖ్యం. చదువులో మరో మెట్టు ఎక్కబోతున్న విద్యార్థుల ముందు రకరకాల రంగుల ప్రపం చం ఆకర్షణీయంగా ఉంటుంది. ఊహాగానాల్లో తిరగకుండా జీవితం లో 25 సంవత్సరాలు వచ్చే వరకు కష్టపడి చదువుకుంటే ఈ సమాజం లో గౌరవంగా బతకడానికి, భవిష్య త్తులో రాణించడానికి వీలవుతుం ది. దారితప్పితే తల్లిదండ్రులు తల దించుకునే పరిస్థితి వస్తుంది. చదు వుకుంటే గ్రామం నుంచి రాష్ట్రం వ రకు గర్వంగా బతికేలా చేస్తుంది.

వందేళ్ల చరిత్రలో ఉస్మానియా విశ్వ విద్యాలయానికి తొలిసారి దళితుడి ని వీసీగా నియమించాం. ఆ కోవలో నే సార్వత్రిక విశ్వవిద్యాలయానికి, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీకి, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్‌గా, విద్యా కమి షన్ చైర్మన్‌గా, రాష్ట్ర ఎన్నికల సం ఘం కమిషనర్‌గా, రాష్ట్ర శాసనస భ స్పీకర్‌గా గతంలో ఎప్పుడూ లేని విధంగా దళిత బిడ్డలు ఈ పదవు లు చేపట్టారంటే వారికి కేవలం కు లం తోనే అవకాశాలు రాలేదు. వా రు ఉన్నత స్థాయిలో చదువుకుంటే వచ్చాయి.

దళితులు, గిరిజనులు, బలహీనవ ర్గాలు ఆత్మన్యూనతా భావాన్ని వీ డాలి. ఆ లక్ష్యంతోనే రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడున్న గురుకుల పిల్లల్లో ప్రతిభ ఉంది. ఆత్మవిశ్వాసం ఉంది. భవిష్యత్తులో కచ్చితంగా రా ణించగలుగుతారన్న నమ్మకం నా కుంది. కుటుంబానికే కాకుండా గ్రా మానికి, దేశానికి పేరుప్రతిష్టలు తీ సుకొస్తారు.

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉ న్నదని సంపూర్ణంగా విశ్వసించే వా డిని. కష్టపడి చదివితే రాణిస్తారు. మీరు బాగుంటేనే రాష్ట్రం బాగుం టుంది. మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నా. మీకె ప్పుడూ తోడుగా ఉంటా. భవిష్య త్తులో రాణించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్ర భాకర్, సలహాదారులు వేం నరేం ద ర్ రెడ్డి , షబ్బీర్ అలీ , పలువురు ఎం పీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, విద్యార్థినీ వి ద్యార్థులు, వారి తల్లిదండ్రులు హా జరయ్యారు.