Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్య, సీఎం రేవంత్‌రెడ్డిపై ఒకింత సీరియస్

CM Revanth Reddy : ప్రజా దీవెన న్యూ ఢిల్లీ: రాజకీయ పార్టీ మారినా ఉప ఎన్నికలు రావం టూ తెలంగాణ ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీం కోర్టు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సీఎం కొంతమేర సంయ మనం పాటించాలని ఇలాంటి వ్యా ఖ్యలు కోర్టు ధిక్కారంగా పరిగణిం చాల్సి వస్తుందని ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసింది.

తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై గురు వా రం విచారణ జరిగింది. అసెంబ్లీ కా ర్యదర్శి తరఫున అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ సందర్భంలో సీఎం రేవంత్‌ చే సిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌ తరఫు న్యాయవాది ఆర్యమా సుందరం మరోసారి బెంచ్‌ దృష్టికి తీసుకెళ్లా రు.

ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో సీఎం బహిరంగంగానే ప్రకటించిన విషయం తెలిసిందే. స్పీకర్‌ తరఫు నే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని ఆ యన చెప్పారు. స్పీకర్‌ తరఫున సీ ఎం ఎలా కామెంట్‌ చేస్తారు సీఎం ఉప ఎన్నికలు రావని అసెంబ్లీలో చెప్పాక పిటిషన్లపై విచారణ జరు గుతుందని మేమెలా నమ్మాలని లా యర్‌ ఆర్యమ వాదించారు.

దీంతో అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మరోసారి సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం కొంత మేర సంయమనం పాటిం చాలి. గతంలో కూడా ఇలాగే వ్యవ హరించారు. ఇలాంటివాటిని కోర్టు ధిక్కారంగా పరిగణించాల్సి వస్తుం ది. మేము సంయమనం పాటిస్తు న్నాం. మిగిలిన రెండు వ్యవస్థలు కూడా అదే గౌరవంతో ఉండాలి. అసెంబ్లీలో జరిగిన పూర్తి చర్చను మేము పరిశీలిస్తామని వ్యాఖ్యా నించింది.

గత అనుభవం ఉన్న వ్యక్తిగా, ముఖ్యమంత్రి కనీసం కొంత ని యంత్రణ పాటించాలి కదా ఆ సమయంలో మేము చర్యలు తీ సుకోకుండా, సరియైన తీర్పును (contempt) ఇవ్వకుండా తప్పు చేశామా?. మేము రాజకీయ నేత లు ఏం చెబుతున్నారనే దానితో పట్టించుకోము. కానీ ఇదే పరిస్థితి ని ఇంతకుముందు ఎదుర్కొన్న వ్య క్తి ఉన్నప్పుడు ఎలా ఉండాలని సీ ఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి జస్టిస్‌ బీఆర్ గవాయి మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ సమయంలో న్యాయవాది సింఘ్వీ కలుగజేసుకుని ప్రతిపక్షం నుంచి అంతకుమించిన రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయని కోర్టు దృష్టి కి తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు అవన్నీ అప్రస్తుతమని ధర్మాసనం వాటిని పక్కన పెట్టింది.

రేవంత్‌ ఏమన్నారంటే, మార్చి 26 వ తేదీన అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశా ల్లో సీఎం రేవంత్‌ ప్రసంగిస్తూ రా ష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని, పార్టీ మారిన ఎమ్మెల్యేలెవ రూ ఈ విషయంలో ఆందోళన చెం దాల్సిన అవసరం లేదన్నారు. ‘‘వచ్చే వారమే రాష్ట్రంలో ఉప ఎ న్నికలు వస్తాయంటూ బీఆర్‌ఎస్‌ నేతలు ఊదరగొడుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రావు. గత బీ ఆర్‌ఎస్‌ హయాంలో ఉన్న రాజ్యాం గమే ఇప్పుడు కూడా ఉంది. స్పీకర్‌ వ్యవస్థ, చట్టం అవే ఉన్నాయి. ఏవీ మారలేదు. అలాంటప్పుడు అప్పు డు పార్టీలు మారిన నేతల విష యంలో రాని ఉప ఎన్నికలు ఇప్పు డెలా వస్తాయని వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలను సుప్రీం కోర్టు ఈ రోజు తీవ్రంగా పరిణిం చినట్లు అత్యున్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యల నేతకు అవగతమ వుతోంది.