CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: పరిశ్రమ ల ఏర్పాటుకు అనువైన వాతావర ణం కల్పించడంలో తెలంగాణ ప్రభు త్వం ఎల్లప్పుడూ ముందుంటుంద ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రజా ప్రభుత్వం అధికా రంలోకి వచ్చిన 20 నెలల కాలంలో నే హైదరాబాద్‌ను గ్లోబల్ క్యాపబి లిటీ సెంటర్ల (GCC) కు హబ్‌గా మార్చామని తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత ఫార్మా దిగ్గజం ఎలీ లిల్లీ (Eli Lilly and Co) హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన గ్లోబల్ క్యాపబి లిటీ సెంటర్‌ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఏ ర్పాటు చేసిన కార్యక్రమంలో ము ఖ్యమంత్రి మాట్లాడారు. లైఫ్ సైన్సె స్ రంగంలో తెలంగాణ చరిత్రలో ఈ ఘట్టం ఒక మైలురా యిగా నిలిచి పోతుందని వ్యాఖ్యానించారు.సీఎం ప్రసంగం యావత్తు ఆయన మాట ల్లోనే…
పారిశ్రామిక అభివృద్ధి సహా అన్ని రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో నే అగ్రస్థానంలో నిలపడమే తమ ల క్ష్యమని, ఆ దిశగా చిత్తశుద్ధితో చే స్తున్న ప్రయత్నాలకు హైదరాబాద్ జీసీసీ హబ్‌గా ఎదగడం ఒక నిదర్శ నమని చెప్పారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన రాష్ట్ర పరిశ్ర మలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుని, సంబంధిత అధికా రులను ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. తెలంగాణను 2 047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆ ర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే మా ల క్ష్యం. ఎలీ లిల్లీ వంటి ప్రపంచ స్థా యి సంస్థ హైదరాబాద్‌కు రావడం గర్వకారణం. ఇప్పటికే హైదరా బా ద్‌లో 2 వేలకు పైగా లైఫ్ సైన్సెస్ కం పెనీలు, 200 అంతర్జాతీయ సంస్థ లు ఉన్నాయి.దేశంలో తయారవు తున్న టీకాలలో ప్రతి మూడో టీకా ఇక్కడే ఉత్పత్తి అవుతోంది. జీనోమ్ వ్యాలీ దేశంలోనే అతిపెద్ద లైఫ్ సై న్సెస్ పరిశోధనాభివృద్ధి కేంద్రంగా ఉంది. ఈ విజయం హైదరాబాద్‌లో ని ప్రతిభ, పాలసీ దృఢత, మరియు బలమైన మౌలిక సదుపాయాలకు నిదర్శనం.
మధుమేహం, క్యాన్సర్, ఇమ్యునా లజీ, న్యూరోసైన్స్ వంటి రంగాల్లో ఎలీ లిల్లీ చేసే కృషి ఒక ‘గేమ్ ఛేంజ ర్’ అవుతుంది. పరిశ్రమలకు అను వైన వాతావరణాన్ని కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుంది.హైదరాబాద్‌లో పని చేయబోయే ఎలీ లిల్లీ ఉద్యోగు లు ఇకపై తెలంగాణ కుటుంబ స భ్యుల్లాంటి వారే. వారి సహకారం తో తెలంగాణను భారతదేశ లైఫ్ సైన్సెస్ రాజధానిగా మాత్రమే కా కుండా, ప్రపంచంలో ఆరోగ్య సంరక్ష ణ ఆవిష్కరణలకు నంబర్ వన్ హ బ్‌గా అభివృద్ధి చేస్తామని ముఖ్య మంత్రి అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్న తాధికారులతో పా టు ఎలీ లిల్లీ ఎగ్జి క్యూటివ్ వైస్ ప్రెసి డెంట్ డియాగో రా వ్ , ఇండియా ప్రెసిడెంట్ విన్సె లోవ్ టకర్, మేనే జింగ్ డైరెక్టర్ మనీ ష్ అరోరా ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.