CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో ప్రతీ ఒక్క అమ్మ పేరుతో ఒక మొక్క ను నాటాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని, రాష్ట్రంలో ని అమ్మలు కూడా తమ పిల్లల పే రుతో ఓ మొక్కను నాటాలని తెలం గాణ ముఖ్యమంత్రి ఎనుముల రే వంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతీ ఇంట్లో కనీసం రెండు మొక్కలు నా టాలని ఆయన కోరారు. మీ పిల్ల ల్లాగే వాటిని సంరక్షిస్తే తెలంగాణ రాష్ట్రమంతా పచ్చదనంతో నిండి పోతుందని ఆకాక్షించారు. ప్రకృతిని మనం కాపాడితేనే, ప్రకృతి మనల్ని కాపాడుతుందని గుర్తు చేశారు. వ నమే మనం… మనమే వనమని పె ద్దలు చెప్పారని గుర్తుచేసుకున్నా రు. ఈ ఏడాది 18 కోట్ల మొక్కలు నాటాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. సోమవా రం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసా య విశ్వవిద్యాలయంలో వనమ హోత్సవం- 2025 కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొ న్నారు. ఈ సందర్భంగా రుద్రాక్ష మొక్కను నాటి వనమహోత్సవా న్ని ప్రారంభించారు. అనంతరం అటవీ శాఖ HMDA ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు.
ఈ సందర్భంగా మీడియాతో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ మహిళ లను ప్రోత్సహిస్తూ తమ ప్రభుత్వం ముందుకు వెళుతోందని ఉద్ఘాటిం చారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, ప్ర భుత్వ పాఠశాలల నిర్వహణ బా ధ్యతను ఆడబిడ్డలకు అప్పగించా మని గుర్తుచేశారు. ఆర్టీసీలో మహి ళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడమే కాదని, ఆర్టీసీకి వె య్యి బస్సులను అద్దెకు ఇచ్చేలా ప్రోత్సహించి వారిని బస్సులకు యజమానులను చేశామని గుర్తు చేశారు.
హైటెక్ సిటీలో విప్రో, మైక్రో సాఫ్ట్ సంస్థలు ఉండేచోట మహిళా సం ఘాలు తయారు చేసిన వస్తువు లను మార్కెటింగ్ చేసుకునే సదు పాయం కల్పించామని వెల్లడించా రు. తెలంగాణ మహిళలు ప్రపం చంతో పోటీ పడుతున్నారని చెప్పు కొచ్చారు. మహిళా సంఘాలు త యారు చేసిన వస్తువులను చూసి మిస్‌వరల్డ్ పోటీదారులు అభినం దించారని పేర్కొన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయ డమే తమ ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు.
తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి బస్సు లకు మహిళలు యజమానులు అ య్యారని తెలిపారు. మహిళల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. హై టెక్ సిటీ పక్కన మహిళా శక్తి భవన్ నిర్మిం చామని గుర్తుచేశారు. ఐకేపీ సెంటర్ల ద్వారానే వడ్లు కొనుగోలు జరుగు తోందని తెలిపారు. గత కేసీఆర్ ప్ర భుత్వం ఆడబిడ్డలను పట్టించుకోలే దని విమర్శించారు. గత ప్రభు త్వం లో ఐదేళ్ల వరకు మంత్రివర్గంలో మ హిళలు లేరని ఆవేదన వ్యక్తం చేశా రు. స్థానిక సంస్థల్లో మహిళా రిజ ర్వేషన్ తెచ్చిందే కాంగ్రెస్ అని ఉద్ఘా టించారు. త్వరలోనే చట్టసభల్లో కూడా మహిళలకు 33శాతం రిజ ర్వేషన్ రాబోతుందని ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో 51 అసెంబ్లీ స్థానాలు మహిళలకు రిజర్వ్ కా నున్నాయని చెప్పుకొచ్చారు. 51కి మరో పది కలిపి మహిళలకు ఎమ్మె ల్యే సీట్లు కేటాయిస్తామని సీఎం రే వంత్‌రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్ర మంలో మంత్రి కొండా సురేఖ, వేం నరేందర్ రెడ్డి. పీసీసీఎఫ్ డా. సువ ర్ణ, ఇతర అటవీ అధికారులు పా ల్గొన్నారు.