CM Revanth Reddy : ప్రజా దీవెన, జయశంకర్ భూపాల పల్లి: రాష్ట్రంలో కొన్ని జిల్లాలను ర ద్దు చేస్తారని, సింగరేణి మెడికల్ బోర్డును రద్దు చేస్తారంటూ జరుగు తున్న తప్పుడు ప్రచారంపై ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వయంగా స్పష్టతనిచ్చారు. ఏ జిల్లాను తొల గించడం గానీ, కొత్త జిల్లాను ఏర్పా టు చేసే ఆలోచనగానీ ప్రభుత్వ ప రిశీలనలో లేదని కీలక ప్రకటన చే శారు. సింగరేణి మెడికల్ బోర్డు ర ద్దు చేస్తారంటూ కొందరు తప్పుడు, విషప్రచారం చేస్తున్నారన్నారు. అ లాంటి ఆలోచనలే ప్రభుత్వం చే యడం లేదని స్పష్టం చేశారు.ప్రజా పాలన,ప్రగతి బాట కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చెల్పూరు గ్రామంలో ఏర్పా టు చేసిన బహిరంగ సభలో ము ఖ్యమంత్రి ప్రసంగించారు.జిల్లాల పునర్వ్యవస్థీకరణ, సింగరేణి మెడి కల్ బోర్డు అంశాలపై స్పష్టతనిచ్చా రు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ చే సి న వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే..జయశంకర్ భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారంటూ తప్పుడు విష ప్ర చారం చేస్తున్నారు. 4 కోట్ల తెలం గాణ ప్రజలకు స్పష్టంగా చెప్పదలు చుకున్నా. ఏ జిల్లాను తొలగించ డం గానీ, కొత్త జిల్లాను ఏర్పాటు చే సే ఆలోచన గానీ ప్రభుత్వ పరిశీల నలో లేదు. ఎక్కడైనా జిల్లాల్లో పు నర్వ్యవస్థీకరించాలి లేదా రేషనలై జేషన్ చేయాలంటే బహిరంగంగా ప్రజలకు చెప్పి శాసనసభలో చర్చిం చి, ప్రతిపక్షాల సూచనలు తీసుకు న్న తర్వాతనే జిల్లాల గురించి ఆ లోచనలు చేస్తాం.
ఎవరెన్ని కుట్రలు పన్నినా, ఎవరె న్ని అపోహలు సృష్టించినా, భూపా లపల్లి ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం, కుట్రలు కుతంత్రాలతో త ప్పుడు ప్రచారం చేస్తున్నారో వారిని పసిగట్టగలిగే శక్తి భూపాలపల్లి ప్ర జలకు ఉంది. భూపాలపల్లిని అభి వృద్ధి పథంలో నడిపిస్తామని వివ రంగా చెప్పారు.సింగరేణి మెడికల్ బోర్డుకు సంబంధించి జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ఆదిలా బాద్ నుంచి ఖమ్మం వరకు సింగరే ణి పరీవాహక ప్రాంతంలో వేలాది సింగరేణి కార్మిక కుటుంబాలు న్నాయి.
కార్పొరేట్ మెడికల్ బోర్డును రద్దు చేస్తుందని, వారసత్వ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పోతాయని కొందరు తప్పుడు, విష ప్రచారం చేస్తున్నారు.అసలు ఈ ఆలోచన లు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థం కావడం లేదు. సింగరేణి మెడికల్ బోర్డు రద్దు చేయాలన్న ఆలోచనే ప్రభుత్వం చేయడం లేదు. కార్మికు ల ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేస్తుంది తప్ప, కార్మికులకు నష్టం కలిగే ఏ నిర్ణయం తీసుకోదు. సింగ రేణి గని కార్మికులు తమ భుజాల పై మోసి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టా రని ముఖ్యమంత్రి విడమరిచి చె ప్పారు.
2027లో నిర్వహించబోయే పుష్క రాల గురించి ముఖ్యమంత్రి వివ రి స్తూ, ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వ రకు గోదావరి పరీవాహక ప్రాంతం లోని బాసర నుంచి భద్రాచలం వర కు ప్రతి ఆలయాన్ని పర్యాటక పు ణ్యక్షేత్రాలుగా తీర్చిదిద్దుతాం. అ ట వీ ప్రాంతాల్లో రిసార్టులను నిర్మించి పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తాం.గతేడాది సరస్వతి పుష్కరా లను అద్భుతంగా నిర్వహించుకు న్నాం. అలాగే, వెయ్యేండ్లు గుర్తుం డే విధంగా మేడారంను తీర్చిదిద్దు కుని సమ్మక్క – సారలమ్మ జాతర ను దక్షిణ కుంభమేళాగా గొప్పగా నిర్వహించాం. మేడారం జాతరకు 2 కోట్ల మంది దర్శించుకున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ము న్సిపాలిటీల్లో వివిధ అభివృద్ధి ప నుల కోసం 6,116 కోట్ల రూపాయ లను కేటాయించామని వాటి వివ రాలను వెల్లడించారు. తెలంగాణ తొలి, మలి విడత పోరాటంలో వ రంగల్ జిల్లా ప్రజలు, కాకతీయ, ఉ స్మానియా యూనివర్సిటీల పాత్ర, ప్రొఫెసర్ జయశంకర్ పాత్రను ము ఖ్యమంత్రి గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు దుద్ది ళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొం గులేటి శ్రీనివాస రెడ్డితో పాటు ఉ మ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప లువురు ప్రజాప్రతినిధులు పాల్గొ న్నారు.
✅ ఈ బహిరంగ సభ వేదిక నుంచి ముఖ్యమంత్రి గారు ‘సమ్మక్క – సారలమ్మ జిల్లా మహిళా సమాఖ్య’కు 205 కోట్ల రూపాయల బ్యాంకు లింకేజీ చెక్కును అందజేశారు.


