Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Osmania Hospital Construction : సీఎం రేవంత్ కీలక ఆదేశాలు, వచ్చే రెండేళ్ల‌లో ఉస్మానియా కొత్త ఆసుప‌ త్రి నిర్మాణం పూర్తి చేయాలి

–ప‌నుల వేగవంతానికి వివిధ శాఖ‌ ల అధికారుల‌తో స‌మ‌న్వ‌య క‌మి టీ

–రానున్న వందేళ్ల అవ‌స‌రాల‌కు తగిన‌ట్లు వ‌స‌తుల క‌ల్ప‌న‌

–ప‌నులతీరుపై త‌ర‌చూ క్షేత్రస్థాయి లో త‌నిఖి

— తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ.రేవం త్ రెడ్డి

Osmania Hospital Construction : ప్రజా దీవెన, హైద‌రాబాద్‌: రాష్ట్ర ప్ర‌ భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ఉస్మానియా నూత‌నఆసుప‌త్రిని ర్మాణం రెండేళ్లలో పూర్తిచేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధి కారుల‌ను ఆదేశించారు. ఉస్మాని యా నూత‌న ఆసుప‌త్రి నిర్మాణంపై త‌న నివాసంలో ముఖ్య‌మంత్రి ఎ.రే వంత్ రెడ్డి బుధ‌వారం స‌మీక్ష నిర్వ‌ హించారు. నూత‌న ఆసుప‌త్రి అవ‌ స‌రాల‌కు త‌గిన‌ట్లు అధునాతన వై ద్య ప‌రిక‌రాల‌ను స‌మ‌కూర్చుకో వా ల‌ని, ఇందుకు సంబంధించి త‌గిన‌ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని అధి కారుల‌ను సీఎం ఆదేశించారు.

అధునాత‌న ప‌రిక‌రాల ఏర్పాటుకు త‌గిన‌ట్లు గ‌దులు, ల్యా బ్‌లు, ఇత‌ర నిర్మాణ‌లు ఉండాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌కు ముఖ్య‌ మంత్రి సూ చించారు.

ఆసుప‌త్రి నిర్మాణ ప‌నుల‌తో పాటు స్థానికుల‌కు ఇబ్బంది లేకుండా చు ట్టూ రోడ్లనిర్మాణం చేప‌ట్టాల‌న్నారు. ఆసుప‌త్రి నిర్మాణ ప‌నుల వేగ‌వం తానికి వైద్యారోగ్య శాఖ‌, పోలీసు, జీహెచ్ ఎంసీ, ఆర్అండ్ బీ, విద్యు త్ శాఖ అధికారుల‌తో స‌మ‌న్వ‌య క‌మిటీని వెంట‌నే ఏర్పాటు చేయాల‌ ని సీఎం ఆదేశించారు.

ఈ క‌మిటీ క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌ టి స్తూ ప్ర‌తిప‌ది రోజుల‌కోక‌సారి స‌మా వేశ‌మై ఏవైనా స‌మ‌స్య‌లుంటే ప‌రి ష్క‌రించుకుంటూ ప‌నులు వేగంగా జ‌రిగేలాచూడాల‌ని సీఎం ఆదేశిం చారు. ఉస్మానియా నూత‌న ఆసు ప‌త్రి నిర్మాణం పూర్తయ్యాక అక్క‌డి బందోబ‌స్తు, ట్రాఫిక్ విధుల నిర్వ‌హ‌ ణ‌కు సంబంధించి ముందుస్తుగానే త‌గిన ప్ర‌ణాళిక‌లు రూపొందించుకో వాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పోలీసు శాఖ ఉన్న‌తాధికారుల‌కు సూచించారు.

ఆసుప‌త్రికి వివిధ ర‌హ‌దా రుల‌ను అనుసంధానించే ప్ర‌ణాళిక‌లు ఇప్ప‌ టి నుంచే రూపొందించాల‌ని ఆర్ అండ్ బీ అధికారుల‌కు సీఎం సూ చించారు.హైద‌రాబాద్‌తో పాటు వి విధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న ఆ సుప‌త్రులు, మెడిక‌ల్ క‌ళాశాల‌ల ని ర్మాణానికి సంబంధించి ప్ర‌తి నిర్మా ణానికి ఒక అధికారిని నియ‌మించా ల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. నిర్మాణాల‌పై 24×7 ఆ అధికారి ప‌ర్య‌వేక్షించేలా పూర్తి స్థాయి బాధ్యతలను అప్పగించా లని సీఎం సూచించారు.

వచ్చే జూన్ నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలని సీఎం అధికారుల ను ఆదేశించారు. ఈ స‌మీక్ష‌లో సీ ఎం ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీలు వి.శేషాద్రి, శ్రీ‌నివాస‌ రాజు, సీఎం కార్య‌ద‌ర్శి మాణిక్ రాజ్‌, డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి, వివిధ శాఖ‌ల ఉన్న‌తాధికారులు వి కాస్‌రాజ్‌, క్రిస్టియానా జోంగ్తూ, ఇ లంబ‌ర్తి, ముషార‌ప్ అలీ ఫ‌రూఖీ, హ‌రిచంద‌న త‌దిత‌రులు పాల్గొన్నా రు.