Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, ప్ర జా సమస్యలపై రాజకీయాలక తీ తంగా ప్రతి ఒక్కరూ మానవత్వం తో వ్యవహరించాలి 

CM Revanth Reddy : ప్రజా దీవెన, కామారెడ్డి: ప్రజలకు స మస్యలు వచ్చినప్పుడు రాజకీయా లకు అతీతంగా ప్రతి ఒక్కరూ మా నవత్వంతో వ్యవహరించాలని ము ఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కోరారు. వరదల కారణంగా నష్టపోయిన కా మారెడ్డి జిల్లాలో తీసుకునే చర్యలు సంక్షోభ నివారణలో ఒక మాడల్ జి ల్లాగా నిలవాలన్నారు.సహాయక చ ర్యలకు సంబంధించి అధికారులు పరిష్కారాలతో అంచనాలు సిద్ధం చేయాలని చెప్పారు. వారి అంచ నాల ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని, 15 రో జుల తర్వాత మరోసారి పరిస్థితు లను సమీక్షిస్తామని చెప్పారు.

వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అ నంతరం ముఖ్యమంత్రి సమీకృత కలెక్టరేట్‌ భవనంలో ఉన్నతస్థాయి సమావేశంలో పరిస్థితులను సమీ క్షించారు. ప్రజలను ఆదుకోవడానికి తీసుకోవలసిన చర్యలపై అదికారు లకు పలు సూచనలు చేశారు. ఇ లాంటి విపత్కర పరిస్థితులు తలె త్తినప్పుడు ప్రభుత్వానికి సంబంధిం చి అన్ని శాఖల మధ్య సమన్వ యం చాలా అవసరమని నొక్కి చె ప్పారు. వరదలొచ్చినప్పుడు దాని ప్రభావం, పర్యవసనాలు నీటి పా రుదల, వ్యవసాయం, విద్యుత్, రోడ్లు భవనాలు, మున్సిపాలిటీ.. ఇలా ఒకదానిపై ఇంకొకటి ఆధార పడి ఉంటుందన్నారు.

శాఖల మధ్య సమన్వయం లోపిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పలు అంశాలను ఉదహరించారు. వరద ల వల్ల ఉమ్మడి నిజామాబాద్ జి ల్లాలో జరిగిన నష్టంపై ప్రజాప్రతిని ధులు, ఉన్నతాధికారులతో రోజం తా ప్రత్యేకంగా సమావేశం ఏర్పా టు చేసి చర్చించాలని ఇంచార్జీ మం త్రి ధనసరి సీతక్కకి సూచించారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి జరిగి న నష్టంపై అధికారులు క్షేత్రస్థాయి లో పర్యటించి అంచనాలు రూపొం దించి, ప్రతిపాదనలు తయారు చే యాలని చెప్పారు. అధికారుల ప్ర తిపాదనలపై తక్షణం నిధులను వి డుదల చేసి ప్రజలను ఆదుకుంటా మన్నారు.

కామారెడ్డిలో గతంలో ఎప్పుడూ లే నంత వర్షం కురవడం, భారీ వరద ల సమయంలో ఎమ్మెల్యే, ఎస్టీఆర్ ఎఫ్ (SDRF), ఆయా శాఖల అధికా రులు ప్రజలకు సహకరించారని చె బుతూ, ఆపత్కాలంలో సిబ్బంది రో జుకు 24 గంటలు పని చేశారంటూ ముఖ్యమంత్రి వారికి అభినందన లు తెలిపారు. సిబ్బంది బాగా స్పం దించినప్పటికీ శాఖల మధ్య కొంత సమన్వయ లోపం కనిపించింద న్నారు.

ఎరువుల విషయంలోనూ క్షేత్రస్థా యిలో గందరగోళ పరిస్థితులు త లెత్తకుండా చూడాలని, ముఖ్యంగా రైతు వేదికల వద్ద సమావేశాలు ఏ ర్పాటు చేసి ముందుగానే టోకెన్లు జారీ చేయడం వంటి చర్యలు తీ సుకోవాలని చెప్పారు. యూరియా అందుబాటులో ఉన్నా ఒక్కసారిగా ఎక్కువ మంది లైన్లో నిలబెట్టడం ద్వారా చివరన ఉన్న వారు సహ నం కోల్పోయే పరిస్థితి ఉత్పన్నమ వుతుందని, యూరియాకు సంబం ధించి స్థానికంగా సమన్వయం చే సుకోవాలని చెప్పారు.

వరదలొచ్చినప్పుడు ఎదుర్కొనడా నికి తక్షణం తాత్కాలిక చర్యలు తీ సుకున్నప్పటికీ భవిష్యత్తులో ఇ లాంటి సందర్భాలను నివారించడా నికి, ప్రణాళికా బద్ధమైన శాశ్వత ప రిష్కారాలు ఉండాలన్నారు. విపత్తు సహాయం విషయంలో నిబంధనల మేరకు కేంద్రం నుంచి నిధులు రాబ ట్టుకోవాలని అధికారులకు చెప్పా రు. వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయి వారి కుటుంబాలకు ఈ సందర్బంగా పరిహారానికి సంబం ధించిన పత్రాలను అందించారు.

ఈ సమీక్షా సమావేశంలో మంత్రు లు ధనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సలహా దారు షబ్బీర్ అలీ, ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస రెడ్డి, మదన్ మోహన్ రా వు, సుదర్శన్ రెడ్డి, కాటిపల్లి వెంకట రమణారెడ్డి, తోట లక్ష్మీకాంతరావు , జిల్లా కలెక్టర్, ఎస్పీతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.