Comrade Suravaram Sudhakar Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, కా మ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి పేరు శాశ్వతంగా చరిత్రలో నిలిచే విధం గా నిర్ణయం
Comrade Suravaram Sudhakar Reddy :
ప్రజా దీవెన, హైదరాబాద్: నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పని చేసిన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారి పేరు చరిత్రలో శాశ్వతంగా ఉండే విధంగా రాష్ట్ర మంత్రిమండ లిలో చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.
హైదరాబాద్ రవీంద్రభారతిలో ని ర్వహించిన కామ్రేడ్ సురవరం సు ధాకర్ రెడ్డి సంస్మరణసభలో ము ఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం యా వత్తు ఆయన మాటల్లోనే..
సిద్ధాంతాలు చెప్పడమే కాదు. న మ్మిన సిద్ధాంతం కోసం 65 సంవత్స రాలు నిబద్ధతతో జీవించడం ద్వా రా సురవరంకి ఆ గౌరవం దక్కింది. వారు ఏ జెండాను మోశారో, ఏ జెం డా మోయడం గొప్పగా భావించారో చివరి శ్వాస తర్వాత కూడా ఆ జెం డా నీడనే విశ్రమించడం అత్యంత అరుదు.ప్రజలతో గుర్తింపబడిన మ హనీయుల పేర్లు ఈ రాష్ట్రంలో శా శ్వతంగా నిలవాలి. అందుకే తెలు గు విశ్వ విద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి పేరు, కోఠీ మహిళా వి ద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హాండ్లూ మ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బా పూజీ పేరును పెట్టుకున్నాం.
సామాన్య ప్రజల్లో చైతన్యం నింపి గోల్కొండ కోటను పాలించిన సర్దార్ సర్వాయి పాపన్న గారు అందరికీ స్ఫూర్తిగా నిలవాలని ట్యాంక్‌బం డ్‌పై వారి విగ్రహాన్ని ప్రతిష్టించుకుం టున్నాం. ఒక ప్రాంతం నుంచి సమా జంలో గుర్తింపు పొందిన ఉన్నప్పు డు చెప్పుకోవడానికి ఆ ప్రాంత వా సులకు గర్వంగా ఉంటుంది. మొ దటి తరంలో సురవరం ప్రతాపరెడ్డి, బూర్గుల రామకృష్ణా రావు, రెండో తరంలో జైపాల్ రెడ్డి, సురవరం సు ధాకర్ రెడ్డ మహబూబ్‌నగర్ జిల్లా కు వన్నె తెచ్చారు. వారెప్పుడు స మాజంలో గౌరవం పొందుతూనే ఉంటారు.
సురవరం విజయలక్ష్మి చిన్న కోరిక లు కోరారు. వారి గౌరవం ఆలంపూ ర్ శాసనసభ నియోజకవర్గానికే కా దు. సురవరం సుధాకర్ రెడ్డి గౌర వం రాష్ట్ర స్థాయిలో ఉండే విధంగా శాశ్వతంగా గుర్తుంచుకునే విధంగా మంత్రివర్గంలో ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతం సమాజం లో ప్రజాస్వామిక మూల సిద్ధాంతా నికి విరుద్ధంగా పెరిగిపోతున్న విప రీత పోకడలను అడ్డుకోవలసిన అ వసరం ఉంది. ప్రజల ప్రాథమిక హ క్కులను హరించే ప్రమాదకర పరి స్థితులను తలెత్తుతున్నాయి. ప్ర జలను చైతన్య పరిచే ఆలోచన ఎ వరూ చేయడం లేదు. అందుకోసం ఐక్య కార్యాచరణ నిర్మించుకోవాలి. అప్పుడే సురవరం లాంటి నేతకు ఘనమైన నివాళి అని ముఖ్య మంత్రి వ్యాఖ్యానించారు.
ఈ సంస్మరణ సభలో మంత్రి జూ పల్లి కృష్ణారావు, సురవరం విజయ లక్ష్మి, సీపీఐ జాతీయ ప్రధాన కార్య దర్శి డి. రాజా, సీనియర్ నాయకు లు కె. నారాయణ, కేవీపీ రామ చం దర్ రావు, రామకృష్ణ, శాసనసభ్యు డు కూనంనేని సాంబశివరావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కమ్యూనిస్టు నాయకులు పాల్గొన్నా రు.