CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, అ వినీతిపరులని సమాజంలో దోషిగా రెవెన్యూ శాఖ, ఆముద్ర తొలగించు కునే బాధ్యత కొత్త విఆర్ఓలపై ఉం ది
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: అవినీతి కి పాల్పడుతారని సమాజం ముం దు దోషిగా రెవెన్యూ శాఖ మీద ప డిన ముద్రను తొలగించుకునే బా ధ్యత కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారులపై ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్ప ష్టం చేశారు. పరిపాలన చేయలే ర ని, అవినీతికి పాల్పడుతారంటూ మీపై జరిగిన ప్రచారం తప్పు, అని నిరూపించాల్సిన అవసరం ఉంద న్నారు. ఎక్కడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పని చేయాలని చె ప్పారు. రెవెన్యూ శాఖలో కొత్తగా ఎంపికైన 5,106 మంది గ్రామ పా లనాధికారులు (GPO) లకు హైటె క్స్‌లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన లో కొలువుల పండుగ కార్యక్రమం లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంఛనంగా నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఉ ద్యోగాల్లో నియ మితులైన జీపీఓలు అందరితో మం త్రి పొంగులేటి శ్రీని వాస రెడ్డి “భూ సంబంధిత విధి ని ర్వహణలో పార దర్శకతతో నిబద్ధ తతో న్యాయబద్దంగా పని చేస్తా న ని” ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ముఖ్యమంత్రి చేసిన ప్రసంగం యా వత్తు ఆయన మాటల్లోనే.
కొత్తగా నియమితులైన మీ పట్ల నా కు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తెలంగాణలో ప్రజాపాలన ప్రభు త్వం అధికారంలోకి రావడంలో భా గస్వాములైన మీరు, ఇప్పుడు ఏ చి న్న తప్పు చేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుంది. భూభారతిని అమలు చేయడమే కాకుండా సాదా బై నా మా సక్రమంగా అమలు చేస్తారని హామీ ఇచ్చాం. పేదవాడికి న్యాయం జరగాలంటే గ్రామపాలనాధికారులు అందుబాటులో ఉండాలని, అందు కు గాను 5 వేల పైచిలుకు గ్రామ పా లనాధికారులను నియమించాం. సాదా బైనామాకు సంబంధించి ఎ నిమిది, తొమ్మిది లక్షల దరఖాస్తులు వచ్చాయని చెబుతున్నారు. జాగ్రత్త గా పరిష్కరించాలి. ఇది ఉద్యోగం కాదు. మీ ఆత్మగౌర వానికి సంబం ధించిన సమస్య. ఇదొక భావోద్వే గం.
తెలంగాణ ఉద్యమంలో ఉపా ధ్యా యులు, ఆర్టీసీ, సింగరేణి, రెవెన్యూ సిబ్బంది అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజా సమస్యలు పరి ష్కా రానికి నోచుకోలేదు. పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖల సిబ్బందిని దొంగలుగా, దోషులుగా నిలబెట్టే ప్రయత్నం జరిగింది.తెలంగాణలో భూములకు సంబంధించి ఎన్నో స మస్యలున్నాయి. ఆ సమస్యలు ప రిష్కరించడానికి వీలులేకుండా వీఆ ర్ఏ, వీఆర్వో, ఎంఆర్వోల నుంచి అ ధికారాలను తప్పించారు. తద్వారా సమాధానం చెప్పలేక మీరు సమా జంలో దోషులుగా నిలబడే పరిస్థితి కల్పించారు. ఎవరో కొందరు తప్పు చేశారని మొత్తం వ్యవస్థనే రద్దు చే స్తారా.
ఆనాడు ఎవరిని కదిలించినా ఈ ధ రణి అనే ఒక భూతం పట్టి పీడిం చిందని చెప్పారు. అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో విసిరేసి కొత్త చట్టాలను తెచ్చాం. ధ రణి అనే మహమ్మారిని అంతం చే యడానికి నిపుణులతో ఒక కమిటీ ని వేశాం. భూభారతి (BhuBhara ti 2025) చట్టం చేసి 4 కోట్ల తెలం గాణ ప్రజలకు అంకితం చేశాం. ధర ణి అనే వైరస్‌ను తప్పించడానికి అ నేక రకాల సమాలోచనలు చేశాం. ఎంతమంది సలహాలు, సూచ నలు తీసుకున్నాం. రాష్ట్రంలోని 1 లక్షా 56 వేల ఎకరాల భూములకు సం బంధించి రెవెన్యూ రికార్డులను ప్ర క్షాళన చేయడమే కాకుండా గతం లో జరిగిన తప్పిదాలను సరిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తె చ్చాం.
భూమికి తెలంగాణ ప్రజలకు వి డ దీయరాని అనుబంధం. భూమిపై జరిగిన ఏ పోరాటమైనా భూమి చుట్టే సాగాయి. నిజాంలను, ర జా కార్లను, పెత్తందార్లను దిగంతాలకు తరిమికొట్టి భూమి కోసం, భుక్తి కో సం, విముక్తి కోసం ఎన్నో పోరా టా లు జరిగిన చరిత్ర ఉంది. వీటితో పా టు భూదాన్ ఉద్యమాలు కూడా వ చ్చాయి. ఇందిరాగాంధీని ఒప్పించి ఆనాడు పీవీ నరసింహారావు ల్యాం డ్ సీలింగ్ చట్టం తీసుకొచ్చి 25 లక్ష ల ఎకరాల భూములను దళితు లు, గిరిజనులు, ఆదివాసీలకు పం పిణీ చేశారు. 10 లక్షల ఎకరాల పోడు భూములపై ఆదివాసీలకు పట్టాలను ఇవ్వడం జరిగింది.
తెలంగాణలో మనిషికి భూమితో ఉన్న సంబంధం తల్లికీ బిడ్డకు ఉన్న సంబంధం. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు 2023 నాటి వరకు చరిత్రను పరిశీలిస్తే భూములను చె రబట్టిన వారిని ప్రజలు దిగంతాల వరకు తరిమికొట్టిన చరిత్ర ఉందని అన్నారు. అనంతరం పలువురికి నియామక పత్రాలను ముఖ్యమం త్రిచేతుల మీదుగా అందించారు.
ఈ కొలువుల పండుగ కార్యక్ర మం లో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి ధనసరి అనసూ య సీతక్క, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల రావు, ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, పీఏసీ చైర్మన్ ఆరికె పూడి గాంధీతో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే లు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొ న్నారు.