Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, వాళ్ళు కడుపులో కత్తులు పెట్టుకు ని కౌగిలించుకుంటున్నారు 

CM Revanth Reddy : ప్రజా దీవెన, మహబూబ్ నగర్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రె డ్డి మహబూబ్ నగర్ జిల్లా పర్యట నలో కీలక రాజకీయ వ్యాఖ్యలు చే శారు. బుధవారం మహబూబ్‌ నగ ర్ జిల్లా మూసాపేట మండలం వే ములలో ఎస్‌జీడీ ఫార్మా రెండో యూనిట్‌ను ఆయ‌న ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి కుటుంబంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిఆర్ఎస్ నేత లు, కేసీఆర్ కుటుంబ సభ్యులు క డుపులో కత్తులు పెట్టుకొని కౌగిలిం చుకుంటున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీఆర్ఎస్ కాలగ ర్భంలో కలిసిపోతున్న పార్టీ అని, వి పరీతమైన అవినీతి సొమ్ము వచ్చా క పంపకాల్లో ఒకరినొకరు సహించు కోలేక పోతున్నారన్నారు. మీ పం చాయితీలోకి మ‌మ్మ‌ల్ని లాగొద్ద‌ని సీఎం రేవంత్ రెడ్డి హితవు పలికా రు. హరీశ్ రావు, సంతోష్ రావు వె నుక రేవంత్ రెడ్డి ఉన్నాడని కవిత వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించా రు. ప్రజలు తిరస్కరించిన వాళ్ల వె నుక తానెందుకు ఉంటాను, త‌న‌కు అంత సమయంలేదన్నారు. మీరు చేసిన పాపం ఊరికే పోదని అను భవించక తప్పదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కాంగ్రెస్ పార్టీని బతకనివ్వమని ఆ నాడు శాసనసభ్యులు కాకుండా అ క్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు. ఇ వాళ వాళ్ళేతన్నుకుని చస్తున్నారు, ఒకరినొకరు ఎవరూ అక్కర్లేదు వాళ్ల ను వాళ్ళే పొడుచుకుంటారన్నారు.

అవినీతి సొమ్ము పంపకాల్లో తేడా వచ్చి కుటుంబంలో తగాదాలు పె ట్టుకుంటున్నారని గుర్తు చేశారు.

కడుపులో కత్తులు పెట్టుకుని కౌగి లించుకుంటున్నారని, పాపం ఊరికే పోదు, ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయని ఖచ్చితంగా అనుభవిం చాల్సిందేనని స్పష్టం చేశారు. ఒకరి వెనక ఒకరు ఉన్నారని కొందరు మా ట్లాడుతున్నారని, అంత చెత్తగాళ్ళ వెనక నేనెందుకు ఉంటానని, నేను నాయకుడిని ఉంటే ముందుంట,నా వాళ్లకు తోడుగా ఉంటానని చెప్పా రు. వాళ్ళ కుటుంబంలో వాళ్లు వా ళ్లు కత్తులతో పొడుచుకుని హరీష్, సంతోష్ వెనక రేవంత్ రెడ్డి ఉన్నా ర ని ఒకరంటారు, లేదు లేదు కవిత వె నకాల రేవంత్ రెడ్డి ఉన్నారని ఇంకొ కరంటున్నారు, మీరంతా దిక్కుమా లినవారనే తెలంగాణ ప్రజలు బం డకేసి కొట్టారని దుయ్యబట్టారు.

అన్నం తినేవారు ఎవరైనా మీ వెనక ఉంటారా, దయచేసి మీ కుటుంబ పంచాయతీలనో మీకుల పంచా యతీలోనో మమ్మల్ని లాగకండo టూ మాకు ఎలాంటి ఆసక్తి లేదు, మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్క రించారని అన్నారు.

*ఎస్‌జీడీ ఫార్మా రెండో యూనిట్‌ ను ప్రారంభించిన సీఎం*

 

కరవు, కాటకాలతో అల్లాడుతున్న ఉమ్మడి పాలమూరు పేదరికాన్ని ప రిశీలించడానికి విదేశాల నుంచి బృందాలు వచ్చే పరిస్థితి నుంచి జి ల్లాను సమున్నత స్థానంలో నిల బెట్టడం తన నైతిక ధర్మమని ము ఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొ న్నారు. దశాబ్దాల కరవు, వెనుక బాటుతనం, వలసల నుంచి బయ టపడేందుకు ముఖ్యమంత్రి రూపం లో దక్కిన అవకాశాన్ని సద్వినియో గం చేసుకోవాలని, విద్య, నీటి పా రుదల, ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఉ మ్మడి పాలమూరును ఉన్నత స్థా నంలో నిలబెట్టాల్సిన అవసరం ఉందన్నారు. మహబూబ్‌నగర్ జి ల్లా దేవరకద్ర నియోజకవర్గ పరిధి లోని వేముల గ్రామంలో ప్రఖ్యాత ఎస్‌జీడీ కార్నింగ్ టెక్నాలజీస్ సంస్థ నిర్మించిన నూతన యూనిట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించిన సం దర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్ర మంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.

సీఎం రేవంత్ ప్రసంగం ఆయన మా టల్లోనే…

రాబోయే రోజుల్లో మహబూబ్ నగ ర్ జిల్లాకు నూతన పరిశ్రమలకు రా బోతున్నాయి. స్థానిక యువతకే కా దు, రాష్ట్రంలో చదువుకున్న నిరు ద్యోగులకు ఉద్యోగ అవకాశాలు క ల్పించడానికి ఈ జిల్లా వేదిక కాబో తోంది. పాలమూరు జిల్లా అంటే ఒ కనాడు వలసలకు మారుపేరు. దే శంలో ఎక్కడ ఏమూలన ప్రాజెక్టులు కట్టినా వాటి నిర్మాణాల్లో పాలమూ రు కూలీలు భాగస్వాములయ్యా రు. విద్యావకాశాలు, నీటి వసతు లు లేని కారణంగా పాలమూరు బి డ్డలు కూలీలుగా దేశం నలుమూ లలకు వలసపోయేది.

ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన పా లమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, క ల్వకుర్తి ఎత్తిపోతల, జూరాల, నె ట్టెంపాడు, కోయిల్‌సాగర్‌, బీమా వంటి ఏ ప్రాజెక్టులూ పూర్తికాలేదు. ఆనాడు సోనియా గాంధీ పాల మూ రు యూనివర్సిటీని మంజూరు చే సినా, దానికి ఇంజనీరింగ్ కాలేజీ గానీ, లా కాలేజీ గానీ లేని కారణం గా అది పీజీ కాలేజీ స్థాయిలోనే మిగిలిపోయింది.హైదరాబాద్ రా ష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణా రావు తర్వాత 70 ఏండ్లకు మళ్లీ పాలమూరు బిడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యా డు. ఈనాటి అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలి. శశభిషలకు తావులేకుండా, జిల్లాకు బాసర త ర్వాత రెండో ట్రిపుల్ ఐటీని ఈ జిల్లాలో ఏర్పాటు చేశాం. ఇంజనీ రింగ్, లా, మెడికల్ కాలేజీ వచ్చినా, వెనుకబడిన ఈ ప్రాంతంలో, ఇక్కడి పేద పిల్లలకు అందుబాలోకి తేవా లని ప్రయత్నిస్తున్నాం.

పాలమూరు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 14 యంగ్ ఇండి యా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరుచేశాం. మొదటి యంగ్ ఇండియా స్కూలుకు షాద్‌ నగర్‌లోనే శిలాఫలకం వేశాం. వల సలు పోయే మనం, మన తలరాత లను మార్చుకోవాలి. మన తలరా తను మార్చేది విద్య మాత్రమే. పా లమూరు జిల్లా నుంచి పిల్లలు వి ద్యా రంగంలో పైకి రావాలి. ఎద గా లంటే చదవాలి, చదవాలంటే వస తులు పెరగాలి. ఆ బాధ్యత నేను తీసుకుంటా. విద్యకు నిధులు అం దించడంలో వెనుకడుగువేసేది లే దు.

గ్రీన్ ఛానెల్‌లో నిధులు కేటాయించి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచే యించే ప్రయత్నం చేస్తున్నాం. ఉ ద్ధండాపూర్, మక్తల్ నారాయణపే ట్, కొడంగల్ ప్రాంతాలకు నీళ్ల కోసం 2014లోనే జీవో 69 ద్వారా ప్రాజె క్టును తెచ్చుకుంటే, గత పాలకులు పదేండ్లు ఆ ప్రాజెక్టును అడ్డుకొని ఈ ప్రాంతానికి అన్యాయం చేశారు. ఆ ప్రాజెక్టును ఇప్పుడు ముందుకు తీ సుకెళుతుంటే గ్రీన్ ట్రిబ్యునల్‌లో కే సులు వేసి అడ్డుకునే ప్రయత్నం చే స్తున్నారు.భూములు కోల్పోతున్న రైతులకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిం చాలి. మంత్రి పది రోజులు టైమ్ తీ సుకొని రైతులతో మాట్లాడాలి. భూ మి కోల్పోయే ప్రతి రైతును పిలిచి మాట్లాడాలి. వారికి న్యాయం చే ద్దాం. కలెక్టర్ ద్వారా అండర్ టేకింగ్ ఇప్పించాలి. పాలమూరు రైతాంగా నికి నష్టం జరిగితే నాకు, నా మం త్రులు, ఎమ్మెల్యేలకు నష్టం జరిగి నట్లే. మీకు న్యాయం చేసే బాధ్యత నాది.

నారాయణపేట్, మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్లకు సూచన, రైతుల ను కార్యాలయాలకు పిలవడం కా దు. అధికారులే క్షేత్రస్థాయికి వెళ్లి రై తులను కలవాలి. రైతులతో మాట్లా డి ఒప్పించండి. మంచి నష్టపరిహా రం ఇచ్చి ఒప్పించండి. నిధులకు ఇ బ్బంది ఉన్నప్పటికీ పాలమూరు జి ల్లా ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా నిధు లు అందిస్తున్నాం. బ్రహ్మోస్ మి స్సైల్ ఇక్కడ ఉత్పత్తి చేస్తే, మన పి ల్లలకు ఉద్యోగాలు వస్తాయి. రెసిడె న్షియల్ స్కూళ్లతోపాటు, ఏటీసీలు అందుబాటులోకి తెచ్చి, యువతకు నైపుణ్యాలు నేర్పిస్తున్నాం. పాల మూరు జిల్లాలోని 14 నియోజకవ ర్గాల్లో ఏటీసీలు ఉండాల్సిందే. త ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. పాల మూరు పేదరికాన్ని ప్రదర్శనగా చూ పడం కాదు. ఇక్కడి అభివృద్దిని, వి ద్యా సంస్థలను, సాగునీటి ప్రాజెక్టు లను చూడటానికి విదేశీ బృందాలు రావాలి. ఇక్కడి పరిశ్రమలు స్థాని కులకే కాదు, ఇతర రాష్ట్రాల వారికీ ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలి.

ఈరోజు ఎస్‌జీడీ – కార్నింగ్ సంస్థ అమెరికా, జర్మనీ దేశాల జాయింట్ వెంచర్. ఇలాంటి సంస్థలు మరిన్ని ఈ ప్రాంతానికి రావాలి.ఎయిర్ పో ర్టుకు దగ్గరగా ఉన్న మహబూబ్‌ న గర్ జిల్లాలో డ్రైపోర్టు ఏర్పాటును పరిగణలోకి తీసుకుంటాం. హైదరా బాద్ – బెంగళూరు డిఫెన్స్ కారిడా ర్‌గా తీర్చిదిద్దుదాం. పరిశ్రమల కో సం అందుబాటులో ఉన్న భూము ల వివరాలు కలెక్టర్లు సేకరించి ఇస్తే, ఏ కొత్త పరిశ్రమ వచ్చినా పాలమూ రులోనే నెలకొల్పే ప్రయత్నం చేస్తా నని అన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు జూ పల్లి కృష్ణారావు, ధనసరి అనసూ య సీతక్క, వాకిటి శ్రీహరి, ప్రణా ళికా సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నా రెడ్డి, లోక్‌సభ సభ్యుడు డాక్టర్ మ ల్లు రవి, ఉమ్మడి జిల్లాకు చెందిన ఎ మ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.