Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య,దే శానికి దిక్సూచిలా తెలంగాణ విద్యా విధానం 

–భాష‌, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడ‌ల మేళ‌వింపుతో అవసరం

–విజ‌న్ డాక్యుమెంట్ 2047లో వి ద్యా విధానానికి ప్ర‌త్యేక అధ్యాయం

–విద్యా రంగం స‌మూల ప్ర‌క్షాళ‌నే మా ధ్యేయం

–సిల‌బ‌స్‌, వ‌న‌రుల స‌మీక‌ర‌ణ‌, వి ధానం అమ‌లుపై స్ప‌ష్ట‌త అవ‌స‌రం

–తెలంగాణ విద్యా విధానంపై స‌ మావేశంలో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైద‌రాబాద్‌: క్షేత్ర స్థా యి ప‌రిస్థితులు, అధ్య‌య‌నం, భ‌వి ష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు రూ పొందించే తెలంగాణ విద్యా విధా నం (Telangana Education Po licy-TEP) భార‌త‌దేశ విద్యా విధా నానికి దిక్సూచిలా ఉండాల‌ని ము ఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆకాంక్షిం చారు. ప్ర‌స్తుత విద్యా విధానంలో భాష ఉన్న వారి ద‌గ్గ‌ర జ్ఞానం లేద‌ ని జ్ఞానం ఉన్న చోట భాష లేద‌ని రెండు ఉన్న చోట నైపుణ్యాలు లేవ‌ ని కానీ ఈ మూడింటి క‌ల‌బోత‌గా వి ద్య ఉండాల‌ని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ విద్యా విధానం నివేదిక రూప‌క‌ల్ప‌న‌పై తెలంగాణ సెక్ర‌టేరి య‌ట్‌లో బుధ‌వారం నిర్వ‌హించిన స‌మావేశంలో ముఖ్య‌మంత్రి ఎ.రే వంత్ రెడ్డి మాట్లాడారు.

తెలంగాణ‌ లో విద్యా రంగాన్ని స‌ మూల ప్ర‌క్షాళ‌న చేయాల‌ని తాము నిర్ణ‌యించు కున్న‌ట్లు సీఎం తెలిపా రు. గ‌తంలో పేద‌రిక నిర్మూల‌న‌కు ప్ర‌ భుత్వాలు భూముల పంప‌కం నిధు ల పంపిణీ వంటి కార్య‌క్ర‌మాలు చేప‌ ట్టేవ‌ని, ఇప్పుడు పంప‌కానికి భూ ములు, త‌గిన‌న్ని నిధులు లేవ‌న్నా రు. ఇప్పుడు పేద‌రిక నిర్మూల‌న‌కు విద్య త‌ప్ప మ‌రో ఆయుధం లేద‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

విద్యా రంగం ప్రాధాన్య‌త‌ను గుర్తిం చినందునే ప్ర‌థ‌మ ప్ర‌ధాన‌మంత్రి జ‌ వ‌హ‌ర్ లాల్ నెహ్రూ దేశంలో విశ్వ విద్యాల‌యాలు, ఐఐటీలు వంటి ఉన్న‌త విద్యా సంస్థ‌ల‌ను స్థాపించా ర‌ని గుర్తు చేశారు. మిశ్ర‌మ ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఉన్న కాలంలో ఉద్యోగావ‌ కాశాల‌కు అనేక ప‌రిమితులు ఉ న్నాయ‌ని సీఎం అన్నారు. స‌ర‌ళీకృ త ఆర్థిక వ్య‌వ‌స్థ అమ‌ల్లోకి వ‌చ్చిన త‌ర్వాత దేశ‌, విదేశాల్లో ఉపాధి అ వ‌కాశాలు భారీగా పెరిగిన‌ప్ప‌టికీ వి ద్యాప్ర‌మాణాలు ఆస్థాయిలో పెర‌ గ‌క‌పోవ‌డంతో వాటిని అందిపుచ్చు కోవ‌డంలో మ‌నం విఫ‌ల‌మ‌వుతు న్నామ‌ని సీఎం ఆవేద‌న వ్య‌క్తం చే శారు. కాలానుగుణంగా ఇంజినీ రిం గ్ క‌ళాశాల‌లు వ‌చ్చినందునే పెద్ద సంఖ్య‌లో సాఫ్ట్ వేర్ రంగంలో మ‌న యువ‌త రాణిస్తున్నార‌ని సీఎం తెలి పారు. అయిన‌ప్ప‌టికీ మ‌న రాష్ట్రం నుంచి ఏటా బ‌య‌ట‌కు వ‌స్తున్న ల‌ క్ష‌లాది మంది ఇంజినీరింగ్ విద్యా ర్థుల్లో ప‌ది శాతం మందికి కూడా ఉ ద్యోగాలు ద‌క్క‌డం లేద‌న్నారు. త‌గి నంత నైపుణ్యం లేకపోవ‌డమే అం దుకు కార‌ణ‌మ‌న్నారు.

ఆరంగంలో నైపుణ్యాలు పెంచ‌డం తో పాటు ఇంకా ప‌లురంగాల్లో అవ‌ కాశాలు విస్తృత‌మైనందున ఆ అవ‌ కాశాలు అంది పుచ్చుకునేలా వి ద్యా రంగాన్ని స‌ మూలంగా ప్ర‌క్షాళ‌ న చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని సీఎం తెలిపారు. విద్యా రంగానికి భారీఎత్తున నిధులు కేటాయిస్తు న్నా ఏటికేడు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల సంఖ్య త‌గ్గుముఖం ప‌ డుతోంద‌ని సీఎం రేవంత్ రెడ్డి అ న్నారు. ప్రైవేటు పాఠ‌శాల‌లు న‌ర్స‌ రీ, ఎల్‌కేజీ, యూకేజీతో ప్రారంభి స్తుంటే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఒక‌టో త‌ర‌గ‌తి నుంచి ప్రారంభ‌మ‌వుతు న్నాయ‌న్నారు. న‌ర్స‌రీకి ప్రైవేటు పా ఠ‌శాల‌లో చేరిన వారు తిరిగి ప్ర‌భు త్వ పాఠ‌శాల‌ల వైపు చూడ‌డం లేద‌ న్నారు. విద్యార్థుల రాక‌పోక‌లు, త‌ గిన శ్ర‌ద్ధ చూపుతార‌నే కార‌ణంతో త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌ను ప్రై వేటు పాఠ‌శాల‌ల్లో చేర్పిస్తున్నార‌ని సీఎం తెలిపారు. ప్ర‌భుత్వ పాఠ‌ శా ల‌లు ఆ ర‌క‌మైన ధీమా క‌ల్పించ‌గ‌ల్గి తే త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌ను ప్ర‌ భుత్వ పాఠ‌శాల‌ల్లోనే చేర్చుతార‌ని తెలంగాణ విద్యా విధానం రూప‌ క‌ ల్ప‌న‌లో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టు కోవాల‌ని సీఎం సూచించారు.

విద్యార్థుల సంఖ్య‌కు త‌గిన‌ట్లు ఉ పాధ్యాయులు ఉండాల‌నే ఉద్దేశం తో తాము అధికారంలోకి రాగానే ఉ పాధ్యాయ నియామ‌కాలు చేప‌ట్టా మ‌ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశా రు. ఉపాధ్యాయులు బోధ‌న‌పై దృ ష్టి పెట్టేలా వారికి ప్ర‌మోష‌న్లు, బ‌దిలీ లు చేశామ‌న్నారు. యూనివ‌ర్సిటీల వైస్ ఛాన్స‌ల‌ర్ల నియామ‌కం చేప‌ట్టా మ‌ని సీఎం తెలిపారు.ఉస్మానియా, కాక‌తీయ విశ్వ విద్యాల‌యాలు గ‌ తంలో సైద్దాంతిక భావ‌జాల‌ల‌కు నిల‌యంగా నిలిచి ప్రజా స‌మ‌ స్య‌ ల‌పై ఆందోళ‌న‌లు, ఉద్యమాలు చేప‌ ట్టేవ‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.

పాఠ‌శాల స్థాయి నుంచి విశ్వ విద్యా ల‌యాల స్థాయి వ‌ర‌కు విద్యా ప్ర‌మా ణాలు ప‌డిపోవ‌డం, నైపుణ్యాల లే మితో ఉద్యోగాలు ల‌భించ‌క‌పోవ‌డం తో విద్యార్థులు డ్ర‌గ్స్ బారిన‌ప‌డి జీ వితాల‌ను కోల్పోతున్నార‌ని సీఎం అన్నారు. మ‌న చ‌దువులు భాష‌, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడ‌ల మేళ‌ వింపుతో ఉండాల‌ని సీఎం అన్నా రు. దేశంలో ఐటీఐలు ప్రారంభించి న‌ప్పుడు ఉన్న డీజిల్ ఇంజిన్ మెకా నిక్‌, ఫిట్ట‌ర్ వంటి సంప్ర‌దాయ కో ర్సులే నేటికీ ఐటీఐల్లో ఉన్నాయ‌ని సీఎం తెలిపారు. తాము అధికారం లోకి వ‌చ్చాక ఆధునిక పారిశ్రామిక అవ‌స‌రాల‌కు అవ‌స‌ర‌మైన నైపు ణ్యాలు అందించే కోర్సుల‌ను అం దించేందుకు ఐటీఐల్లో కోర్సుల‌ను మార్చామ‌ని, యంగ్ ఇండియా స్కి ల్ యూనివ‌ర్సిటీ ఏర్పాటు చేశామ‌ ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ఇప్ప‌టి వ‌ర‌కు విద్యా రంగంపై తా ము చేసిన కృషితోనే తాము సంతృ ప్తి చెంద‌డం లేద‌ని.. ప్రాథ‌మిక ద‌శ నుంచి యూనివ‌ర్సిటీల వ‌ర‌కు స‌ మూల ప్ర‌క్షాళ‌న చేయాల్సి ఉంద‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అ న్నారు. రానున్న 25 ఏళ్ల వ‌ర‌కు విద్యా వ్య‌వ‌స్థ‌కు దిశానిర్దేశం చేసేలా తెలంగాణ విద్యా విధానం ఉండాల‌ ని సీఎం అన్నారు. డిసెంబ‌రు 9వ తేదీన ఆవిష్క‌రించ‌నున్న తెలంగా ణ విజ‌న్ డాక్యుమెంట్‌-2047లో తెలంగాణ విద్యా విధానానికి చోటు క‌ల్పిస్తామ‌ని సీఎం వెల్ల‌డించారు. ప్రాథ‌మిక‌, ఉన్న‌త‌, సాంకేతిక‌, నైపు ణ్య విద్య‌లుగా విభ‌జించుకొని ఇం దులో ఉన్న విద్యావేత్త‌లు త‌మ అ భిరుచుల‌కు అనుగుణంగా స‌బ్ క‌ మిటీలుగా ఏర్ప‌డి అత్యుత్త‌మ డా క్యుమెంట్ రూపొందించాల‌ని సీఎం కోరారు.

విద్యా వ్య‌వ‌స్థ వ్య‌క్తులు, ప్ర‌భుత్వ ఉద్యోగుల కోసం కాకుండా నిరుపేద‌ ల‌కు ల‌బ్ధిక‌లిగేలా ఉండాల‌ని తా ము ఆకాంక్షిస్తున్నామ‌ని సీఎం తెలి పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాల పేరిట విద్యార్థుల‌ను చిన్న‌త‌నం నుంచే వేరు చేస్తున్నా మ‌ని, దానిని రూపుమాపి అంతా ఒక‌టే అనే భావ‌న క‌లిగించేలా వి ద్యాల‌యాల్లో అంద‌రికీ స‌మాన అ వ‌కాశాలు ఉండాలని సీఎం అన్నా రు. మీరు రూపొందించే తెలంగాణ విద్యా విధానం దేశానికి దిక్సూచిలా ఉండాల‌ని సీఎం రేవంత్ రెడ్డి అన్నా రు. ఆశించిన స్థాయిలో తెలంగాణ విద్యా విధానం అమ‌ల‌య్యేందుకు వివిధ ఫౌండేష‌న్లు, ఎన్జీవోల స‌హ‌ కారం తీసుకోవాల‌ని సీఎం సూచిం చారు. సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని స‌మ‌ గ్రంగా వినియోగించుకునేలా విద్యా విధానం ఉండాల‌న్నారు.

విద్యా విధానంపై ఎంత వ్య‌యానికై నా తాము వెనుకాడ‌మ‌ని సీఎం రే వంత్ రెడ్డి తెలిపారు. ప్ర‌త్యేక విద్యా కార్పొరేష‌న్ ఏర్పాటు చేసి మౌలిక వ‌స‌తులు, ప్ర‌మాణాల మెరుగుకు ఖ‌ర్చు చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని తెలిపారు. విద్య‌పై చేసే వ్య‌యాన్ని వ్య‌యంగా కాక పెట్టుబ‌డిగా చూ డాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి విన్న‌ విం చామ‌న్నారు. విద్యాభివృద్ధికి తీసు కునే రుణాల‌ను ఎఫ్ఆర్‌బీఎం ప‌రి మితి నుంచి తొల‌గించాల‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారా మ‌న్ కోరామ‌ని సీఎం తెలిపారు. తె లంగాణ విద్యా విధానంలో సిల‌బ‌స్ రూప‌క‌ల్ప‌న‌, వ‌న‌రుల స‌మీక‌ర‌ణ‌, విధానం అమ‌లుపై స్ప‌ష్ట‌త అవ‌స‌ ర‌మ‌ని సీఎం పేర్కొన్నారు.

తెలంగాణ విద్యా విధానం ఛైర్మ‌న్ కేశ‌వ‌రావు మాట్లాడుతూ విద్యా క‌ మిష‌న్‌, ఇత‌ర భాగ‌స్వాముల‌తో తాము విస్తృత సంప్ర‌దింపులు చే శామ‌న్నారు. గ‌ణాంకాల క‌న్నా నా ణ్య‌త ప్ర‌ధాన‌మ‌ని, విద్యార్థి కేంద్రం గా బోధ‌న ఉండాల‌నేది త‌మ అభి ప్రాయ‌మ‌న్నారు.ఏఐ వంటివి ఎన్ని వ‌చ్చినా అవి గురువుకు ప్ర‌త్యా మ్నాయం కావ‌న్నారు. విశ్రాంత ఐఏ ఎస్ అధికారి ఐ.వి.సుబ్బారావు దే శ యువ‌త‌లో మూడో వంతు NEE T గాఉన్నార‌ని, దాని అర్ధం నాట్ ఇ న్ ఎడ్యుకేష‌న్‌, ఎంప్లాయిమెంట్ అండ్ ట్రైనింగ్ అని ఓ స‌ర్వే తేల్చిం దన్నారు. అమ్మ ఆద‌ర్శ పాఠ‌శాలల ద్వారా రాష్ట్ర ప్ర‌భుత్వం పాఠ‌శాల‌ లు, క‌ళాశాల‌ల్లో మౌలిక వ‌స‌తుల పెంపున‌కు చేసిన కృషి అభినంద‌ నీయ‌మ‌న్నారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారు త‌న సేవ‌ల‌ను విద్యా రంగానికి వినియోగించుకో వాల‌ని, విద్యా వ‌లంటీర్ గా విని యోగించుకోవాల‌న కోరారు.ఐఐటీ హైద‌రాబాద్ డైరెక్ట‌ర్ ప్రొఫెసర్ బి.ఎ స్‌.మూర్తి తాము స్టార్ట‌ప్‌ల‌ను ప్రోత్స‌ హిస్తున్నామ‌ని, ఒక్క ఏడాదిలో 18 0 పేటెంట్లు పొందామ‌ని సీఎం తెలి పారు. ప్రొఫెసర్ హ‌ర‌గో పాల్ మా ట్లాడుతూ విద్యా విధానం కొలువు ల సాధ‌న‌కే కాకుండా అత్యుత్త‌మ మాన‌వునిగా తీర్చిదిద్దేదిగా ఉం డా ల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ ధాన కార్య‌ద‌ర్శి కె.రామ‌కృష్ణారావు, ఎ మ్మెల్సీలు ఏ.వి.ఎన్‌.రెడ్డి, శ్రీ‌పాల్ రె డ్డి, విద్యావేత్త‌లు మోహ‌న్ గురు స్వామి, ప్రొఫెస‌ర్ సుబ్బారావు, సీఐ ఐ శేఖ‌ర్ రెడ్డి, ఉన్న‌త విద్యామం డ‌ లి ఛైర్మ‌న్ బాల‌కిష్టారెడ్డి, అక్ష‌ర‌వ‌నం మాధ‌వ‌రెడ్డి, విద్యా క‌మిష‌న్ ఛై ర్మ‌ న్ ఆకునూరి ముర‌ళి, ఫ్రొపెస‌ర్ గం గాధ‌ర్, విశ్రాంత ఐఏఎస్‌లు మిని మాథ్యూ శ్రీ‌మ‌తి రంజీవ్ ఆచార్య‌, ప్రొఫెస‌ర్ శాంతా సిన్హా త‌దిత‌రులు మాట్లాడారు. ఈ స‌మావేశంలో ము ఖ్యమంత్రి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ వి.శే షాద్రి, ముఖ్య‌ మంత్రి ప్ర‌త్యేక కా ర్య‌ ద‌ర్శి బి.అజిత్ రెడ్డి, అధికారులు జ‌ యేశ్ రంజ‌న్‌, శ్రీ‌దేవ‌సేన, కృష్ణ ఆది త్య‌, న‌వీన్ నికోల‌స్ త‌దిత‌రులు పాల్గొన్నారు.