CM Revanth Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణను కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్‌గాబిమూడు ప్రాంతాలుగా విభజించి రాష్ట్రం సమ్మిళిత, సమ గ్రాభివృద్ధి సాధించడానికి సంబం ధించిన విజన్ డాక్యుమెంట్‌ను డి సెంబర్ 9 వ తేదీలోపు విడుదల చే యనున్నట్టు ముఖ్యమంత్రి ఎ. రే వంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబా ద్‌ను ప్రపంచ శ్రేణి నగరంగా తీర్చిది ద్దడంలో ప్రభుత్వం ప్రణాళికాబద్ధం గా చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలందరి సహకారం ఉండాలని విజ్ఞప్తి చేశారు.గచ్చీబౌలి కూడలిలో ఆరు లేన్లతో నిర్మించిన దివంగత పి. జనార్ధన్ రెడ్డి ఫ్లైఓవర్‌ను ముఖ్య మంత్రి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మాట్లాడారు.
తెలంగాణను మూడు ప్రాంతాలు గా ఓఆర్ఆర్ లోపలి భాగంలో కోర్ అర్బన్‌గా, ఓఆర్ఆర్ అవతలి నుం చి రీజినల్ రింగ్ రోడ్డు వరకు సెమీ- అర్బన్‌గా, రీజినల్ రింగ్ రోడ్డు అవ తలి భాగంలో గ్రామీణ ప్రాంతంగా విభజించి, ప్రాంతాల వారిగా ప్రణా ళికా బద్ధమైన అభివృద్ధితో ముం దుకు వెళతామని ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం చేసిన వ్యాఖ్య లు ఆయన మాటల్లోనే..ఓఆర్‌ఆర్ ఆవలివైపున 30 వేల ఎ కరాల్లో ప్రపంచ శ్రేణి భారత్ ఫ్యూ చర్ సిటీని ప్రతిపాదించాం. ఇందు లో క్రీడలు, ఆర్టిఫీషియల్ ఇంటె లిజెన్స్, ఐటీ, నాన్-పొల్యూటెడ్ ఫార్మా రంగాలను అభివృద్ధి పరు స్తాం. ఫ్యూచర్ సిటీలో పచ్చదనం కోసం దాదాపు 15 వేల ఎకరాల్లో పార్కులను, మిగతా ప్రాంతంలో మౌలిక సదుపాయాలను కల్పిస్తాం.
వాయు కాలుష్యంతో ఢిల్లీ, విపరీత మైన ట్రాఫిక్ సమస్యలతో బెంగు ళూరు, వర్షాలొస్తే వరదలతో చెన్నై నగరాలు అతలాకుతమవుతున్న పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకో వలసిన అవసరం ఉంది. హైదరా బాద్‌ను ప్రపంచ శ్రేణి నగరంగా తీ ర్చిదిద్దాలని సంకల్పంతో పనిచేస్తు న్నాం.
నగరంలో కాలుష్యం నివారించా ల న్న లక్ష్యంతోనే ఎలక్ట్రిక్ వాహనా లపై రిజిస్ట్రేషన్ పన్నులను పూర్తిగా రద్దు చేశాం. జంట నగరాల్లో తిరు గుతున్న 3 వేల ఆర్టీసీ బస్సులను ఓఆర్ఆర్ బయటి ప్రాంతాలకు త రలించి వాటి స్థానంలో వచ్చే ఏ డాది లోపు 3 వేల ఎలక్ట్రిక్ వాహ నాలను అందుబాటులోకి తెస్తు న్నాం. కాలుష్యాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో అనేక విధాలుగా పనిచే స్తున్నాం. నాలాలు, చెరువులు కబ్జా లు చేశారు. నీరుండాల్సిన చోట అ పార్ట్‌మెంట్లు వెలువడంతో నీరు రో డ్లపైకి వస్తోంది. అందుకే నాలాలు, చెరువుల ఆక్రమణలను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టాం.
దీన్ని కొందరు రాజకీయం చేసి అభి వృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నా రు. అభివృద్ధిలో అందరూ కలిసి రావాలి. ఆ మధ్య కాలంలో ఎన్ -కన్వెన్షన్ కూల్చివేసిన సందర్భంగా సినీనటుడు నాగార్జున ముందు కొచ్చి 2 ఎకరాల స్థలాన్ని ప్రభు త్వానికి అప్పగించి చెరువును అ భివృద్ధి పరచడానికి సహకరిస్తామ ని చెప్పారు. కబ్జాలకు గురైన బతు కమ్మ కుంట 6 ఎకరాలను కాపాడ గలిగాం.
జంట నగరాల అభివృద్ధికి దివంగత పీజేఆర్ గారు అందించిన సేవలు ప్ర జల్లో చిరస్మరణీయంగా గుర్తుండిపో తాయి. 1.2 కోట్ల జంట నగరాల ప్ర జల దాహార్తి తీరిందంటే అది పీజేఆ ర్ నాయకత్వంలో జరిగిన పోరాటా ల ఫలితమే. అలాంటి పీజేఆర్ పే రును ఫ్లైఓవర్‌కు పెట్టుకోవడం ఎం తో సముచితం.
.
గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రపం చంలోనే ఫార్చూన్ 500 కంపెనీల్లో 85 కంపెనీలు హైదరాబాద్ నుంచి పనిచేస్తున్నాయి. లక్షలాది మంది యువకులకు ఉద్యోగ, ఉపాధి అవ కాశాలు దక్కాయి. లక్షలాది మంది కి ఉపాధి కల్పించాలన్న సంకల్పం తోనే 2.8 లక్షల కోట్ల విదేశీ పెట్టు బడులను సాధించాం.
ఈ నగరాన్ని మరింత గొప్ప నగ రంగా తీర్చిదిద్దాలి. ప్రజలు అభి వృ ద్ధిని కోరుకుంటున్నారు. ప్రభుత్వం రూపొందించిన ప్రణాళికలను ప్ర జల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. 2028 వరకు రాజకీయాల ను పక్కన పెడుతాం. అభివృద్ధికి అందరూ సహకరించాలి.
ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ , ప్రజా ప్రతి నిధులు అనిల్ కుమార్ యాదవ్ , అరికెపూడి గాంధీ , ఎమ్మెల్సీలు పబిట్నం మహేందర్ రెడ్డి , అద్దంకి దయాకర్ , బల్మూరు వెంకట్ ము ఖ్యమంత్రి సలహాదారు వేం నరేంద ర్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజ యలక్ష్మి, డిప్యూటీ మేయర్, కార్పొ రేటర్లతో పాటు జీహెచ్ఎంసీ కమిష నర్, ఇతర అధికారులు పాల్గొన్నా రు.
ఇదిలా ఉండగా ఈ ఫ్లైఓవర్‌కు దివంగత పీజేఆర్ ఫ్లైఓవర్‌గా నా మకరణం చేసినం దుకు వారి కు మార్తె విజయారెడ్డి తో పాటు కు టుంబ సభ్యులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.