CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, వై ఎస్ చివరికోరిక నెరవేర్చే వరకు విశ్ర మించకుండా పనిచేస్తాం
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ప్రా ణహిత – చేవెళ్ల, ఎస్ఎల్బీసీ ప్రా జె క్టులను పూర్తిచేసి తీరుతామని ము ఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటిం చారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదు కోవాలని గోదావరి, కృష్ణా నదులపై వైఎ స్సార్ తలపెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాకుండా వారి జీ వితం లోని చివరి కోరిక నెరవేర్చేవ రకు విశ్రమించకుండా పనిచేస్తామ ని స్పష్టం చేశారు. డాక్టర్ వైఎస్ రా జశేఖర రెడ్డి మెమోరియల్ అవార్డు 2025 కార్యక్రమంలో ముఖ్యఅతిథి గా ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి దు ద్దిళ్ల శ్రీధర్ బాబు, హర్యాన మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హు డా, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు బొ మ్మ మహేష్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి రఘువీరా రెడ్డి, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రకృతి వ్యవసాయ విప్లవ పితామ హుడు, పద్మశ్రీ సుభాష్ పాలేకర్ కి, పద్మావతి వెంకటేశ్వర ఫౌండేషన్, కృష్ణ సుధా అకాడమీ ఫర్ ఆగ్రోఎకా లజీ వ్యవస్థాపకులు డాక్టర్ చదల వాడ సుధ, డాక్టర్ చదలవాడ నా గేశ్వర రావు లకు డా. వైఎస్ రాజ శేఖర రెడ్డి స్మారక తొలి పురస్కారా న్ని ముఖ్యమంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్ర సంగం ఆయన మాటల్లోనే…వ్యవ సాయం దండక కాదు పండుగ చే యాలన్న వైఎస్ ఆలోచనలకు అ నుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలని గోదావరి, కృష్ణా న దులపై తలపెట్టిన ప్రాజెక్టులను క చ్చితంగా పూర్తి చేసి తీరుతాం.
కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, పేలి పోతున్న మోటార్ల కాలంలో బాధల నుంచి రైతులను కాపాడాలని 20 07-08 లో ప్రాణహిత – చేవెళ్ల ప్రాజె క్టుకు వైఎస్సార్ పునరుజ్జీవం కల్పి స్తే తర్వాత ప్రభుత్వంలో రీడిజైనిం గ్ పేరుతో తుమ్మిడిహెట్టి నుంచి ఆ ప్రాజెక్టును తప్పించారు. రైతాంగా నికి మేలు చేయాలని, చేవెళ్ల, వికా రాబాద్, తాండూరు, కొంత కొడంగ ల్ ప్రాంతం చివరి ఆయకట్టు వరకు నీరివ్వాలన్న వైఎస్సార్ ఆశయానికి అనుగుణంగా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత – చేవెళ్ల కడతాం. ఫ్లోరైడ్ మహమ్మారి నుంచి నల్గొండ ప్రజ లను రక్షించాలని సంకల్పించిన ఎ స్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తాం.
రైతునే రాజును చేయాలన్న ఆలోచ నతో వైఎస్ ముఖ్యమంత్రిగా బాధ్య తలు చేపట్టిన మరుక్షణం రైతాంగా నికి ఉచిత విద్యుత్ కు సంబంధిం చిన ఫైలుపై సంతకం చేయడమే కాకుండా రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేశారు. 1300 కోట్ల రూపాయ ల మేరకు రైతుల బకాయిలను ర ద్దు చేశారు. దేశంలో రైతులకు ఉ చిత కరెంటు ఇవ్వాలంటే తప్పని సరిగా వైఎస్సార్‌ను గుర్తు చేసుకోక తప్పని రీతిలో అందరి మదిలో వా రు స్థానం పదిలం చేసుకున్నారు.
వైఎస్సార్ గారి ఆలోచనల కొనసా గింపుగా వారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ మెంట్, రాజీవ్ ఆరోగ్య శ్రీలను తమ ప్రభుత్వం కొనసాగి స్తోంది. ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల రూపాయలు పెంచాం. ఫీజు రీయింబర్స్ మెంట్ కొనసాగిస్తు న్నాం. వైఎస్ ఆలోచన, వారి స్ఫూ ర్తితోనే దేశంలోనే మొట్ట మొదటి సారి రాష్ట్ర వ్యాప్తంగా 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తు న్నాం.
రైతు సంక్షేమం కోసం అధికారంలోకి రాగానే 25 లక్షల మంది రైతులకు 20 వేల కోట్ల రూపాయల మేరకు రుణాలను మాఫీ చేసి విముక్తుల ను చేశాం. వరి వేసుకుంటే ఉరి వే సుకున్నట్టే అన్న రోజుల నుంచి వరి వేసుకోండి, బోనస్ ఇచ్చి మరీ కొను గోలు చేస్తామని ప్రోత్సహించాం. ఈ రోజు దేశంలోనే అత్యధికంగా 2.85 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి మొదటి స్థానంలో నిలి చాం. కేంద్ర ప్రభుత్వం సరిగా సహ కరించని కారణంగా రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితు లు వచ్చాయి. పాలేకర్ సూచిం చి నట్టు మార్గంలో రాష్ట్రంలో వ్యవసా యాన్ని ప్రోత్సహించడానికి ప్రభు త్వం అవసరమైన ప్రణాళికలు రచి స్తాం.
విద్యార్థి దశ నుంచి వైఎస్‌కు వెన్నం టి నిలిచిన మిత్రుడి కోసం కేవీపీ రా మచంద్ర రావు తన శక్తినంతా ధార పోశారు. వైఎస్ ఎన్నో కష్టాలను ఎ దుర్కొన్న సందర్భంలో కూడా వారి వెంట నిటారుగా నిలబడ్డారు. వై ఎస్ మరణించి 16 సంవత్సరాలు పూర్తయినా, వారిపై ఉన్న అభి మా నంతో ఈ కార్యక్రమం నిర్వహించ డం అభినందనీయమని ముఖ్య మంత్రి పేర్కొన్నారు.