CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ ముఖ్యమంత్రి ఎనుముల రేవం త్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నేతలపై సం చలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ విషపురుగని, నగరానికి డ్రగ్స్ సం స్కృతిని తెచ్చింది ఆయనేనని తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించా రు. హైదరాబాద్ లో డ్రగ్స్ మహ మ్మారిని రూపుమాపేందుకు తాము ఈగల్ టీంను రంగంలోకి దించామ ని గుర్తు చేశారు. నగరంలోని పాఠ శాలల వద్ద కూడా డ్రగ్స్ చాక్లెట్లు అ మ్ముకునే పరిస్థితి కల్పించారన్నా రు. సింగరేణి కాలనీల్లో ఆరేండ్ల పిల్ల ను చంపారని, జవహర్ నగర్ లో ఎ న్నో దారుణాలు జరిగాయని సీఎం చెప్పుకొచ్చారు. గ్రేటర్ పరిధిలో 6 9 5 చెరువులుంటే, 44 చెరువులను బిఆర్ఎస్ వాళ్లు ఆక్రమించి కట్టేసి అమ్ముకున్నారన్నారు. బతుకమ్మ కుంటను బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధా కర్ రెడ్డి కి రాసిచ్చారని, తాము అ ధికారంలోకి వచ్చాక తిరిగి స్వాధీ నం చేసుకొని పూర్వవైభవం తెచ్చా మని అన్నారు. సినీ నటుడు అక్కి నేని నాగార్జున తుమ్మడి కుంటను ఆక్రమిస్తే కూల్చి పునరిద్ధరిస్తున్నా మని చెప్పారు. శుక్రవారం ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో మాట్లాడారు.
రాష్ట్రాన్ని దోచుకున్న కల్వకుంట్ల ఫ్యామిలీ వేల కోట్లుకు ఎదిగిందని, హరీశ్ రావుకు మొయినాబాద్ లో ఫాంహౌస్, కేటీఆర్ కు జన్వాడలో ఫాంహౌస్ వచ్చాయని విమర్శించా రు. కేసీఆర్ గజ్వేల్ లో ఫాంహౌస్ క ట్టుకున్నారని, టీవీలు, పేపర్లు, పె ట్టు బడులు వ్యాపారాలు వచ్చా యని సీఎం చెప్పారు. పదేండ్ల కా లంలో గ్రూప్ 1 ఉద్యోగ నియామకా లు చేపట్టలేదని విమర్శించారు. తా ము అధికారంలోకి వచ్చాక 70 వేల ఉద్యోగ నియామకాలు చేశామని, 11 వేల మంది టీచర్లను అపా యింట్ చేశామని చెప్పారు. శి ల్పా రామంలో, ఎల్బీ స్టేడియంలో ని యామక పత్రాలు అందించామని వివరించారు.
*అభివృద్ధిని అడ్డుకుంటున్నది వాళ్లిద్దరే* … బీజేపీ కిషన్ రెడ్డి, బి ఆర్ఎస్ కేటీఆర్ హైదరాబాద్ నగ రానికి బ్యాడ్ బ్రదర్స్ అని, అభివృ ద్ధిని అడ్డుకుంటున్నది వాళ్లిద్దరేనని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. న గరంలో ఒక్క ప్రాజెక్టు కూడా ముం దుకు సాగనివ్వడం లేదని అన్నా రు.
మెట్రో విస్తరణ, హైదరాబాద్ కు గో దావరి జలాల తరలింపును,మూసీ ప్రక్షాళనను, రీజినల్ రింగ్ రోడ్డును, ఫ్యూచర్ సిటీని, ఎలివేటెడ్ కారిడా ర్లను అడ్డుకుంటున్నది వాళ్లిద్దరేన నన్నారు. తాము అధికారంలోకి వ చ్చినప్పటి నుంచి కేంద్రంతో సంప్ర దింపులు జరిపి కంటోన్మెంట్ శామీర్ పేట, కంటోన్మెంట్ మేడ్చల్ వరకు ఎ లివేటెడ్ కారిడార్లు తీసుకొస్తు న్నా మని చెప్పారు. పదేండ్ల పాటు అధి కారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రయత్నమే చేయలేదని చెప్పా రు. తాము 16 వేల కోట్ల మిగులు బడ్జె ట్ తో రాష్ట్రాన్ని అప్పగిస్తే 8 లక్షల 11 వేల కోట్ల అప్పుతో తిరిగి తమ కు అప్పగించారని చెప్పారు.
2004 నుంచి 2014 వరకు రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, ఐటీ కంపెనీలు, ఎయిర్ పోర్ట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైటెక్ సిటీ వచ్చాయన్నారు. కాంగ్రెస్ ముందు చూపుతోనే హైదరాబాద్ అభివృద్ధి అయ్యిందన్నారు. బీఆర్ ఎస్ హయాంలో నిర్మించినవి నాలు గని సీఎం చెప్పారు. కమాండ్ కం ట్రోల్ సెంటర్, ప్రగతి భవన్, కాళేశ్వ రం, సచివాలయం నిర్మించారని, వీ టితో ఎవరికీ ఉద్యోగ ఉపాధి అవ కాశాలు రాలేదన్నారు. వాస్తుదోషం ఉందని 2 వేల కోట్లు వెచ్చించి సచి వాలయం నిర్మించారని, ఆ సమ యంలో అక్కడ పోచమ్మ గుడి, మ జీద్ కూలగొట్టినా కిషన్ రెడ్డి మాట్లా డ లేదని గుర్తు చేశారు. తాను నివా సం ఉండేందుకు ప్రగతి భవన్ ని ర్మించుకున్నారని, అందులోకి గద్దర న్నను కూడా రానీయలేదన్నారు.
అలాగే నగరం నడిబొడ్డున కమాం డ్ కంట్రోల్ సెంటర్ నిర్మించారని, సీ సీ కెమెరాలు పెట్టి ప్రతిపక్ష నాయకు ల కదలికలను గమనించారని అ న్నారు. లక్ష కోట్లు వెచ్చించి నిర్మిం చిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎ కరాకు నీరందలేదన్నారు. ఫ్లైఓవర్లు నిర్మించినట్టు కేటీఆర్ చెబుతున్నా రని, సిటీలో తార్నాక, బేగంపేట ఫ్లై ఓవర్లు కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే నని వివరించారు.
నగరాభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరగిందని, ఈ విషయాన్ని జూబ్లీ హిల్స్ ఓటర్లు విజ్ఞతతో ఆలోచిం చాలని సీఎం విజ్ఞప్తి చేశారు. రాష్ట్రా న్ని, నగరాన్ని అభివృద్ధి వైపు సడి పించే నిర్ణయం తీసుకోవాలని కోరా రు. అభివృద్ధి కోసం సవీన్ యాదవ్ ను గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు.