CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణ యం, అటవీ, రెవెన్యూ భూముల హద్దులు నిర్ధారించాలని ఆదేశం
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్రంలో ఎకో టూరిజం అ భివృద్ధిపై దృష్టి సారించాలని ము ఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికా రులను ఆదేశించారు. సింగపూర్ వంటి దేశాల్లో 30 ఎకరాల్లోనే నైట్ సఫారీలు ఉన్నాయని, మన దగ్గర భారీ విస్తీర్ణాల్లో అటవీ ప్రాంతాలు అందులోనే నదులు, జలపాతాలు ఉన్నందున మనకు ఉన్న వనరుల ను సద్వినియోగం చేసే ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించా రు. అటవీ శాఖపై కమాండ్ కంట్రో ల్ సెంటర్‌లో రాష్ట్ర అటవీ, పర్యా వరణ, దేవాదాయ శాఖ మంత్రి కొం డా సురేఖ తో కలిసి ముఖ్యమంత్రి ఎ.రేవం త్ రెడ్డి మంగళవారం స మీ క్ష నిర్వహించారు.
తెలంగాణలో అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులున్నా తెలం గాణ వాసులు ఇతర రాష్ట్రాల్లోని బందీపూర్, తడోబా వంటి ప్రాంతా లకు పులుల సందర్శనకు వెళుతు న్నారని సీఎం అన్నారు.అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టులకు సందర్శకుల సంఖ్య పెంచేలా సౌక ర్యాలు కల్పించాలని సీఎం ఆదేశిం చారు. అటవీ, రెవెన్యూ శాఖల మ ధ్య భూ వివాదాల పరిష్కారానికి సంయుక్త సర్వే చేపట్టాలని సీఎం సూచించారు. కలెక్టర్లు ఈ విషయం లో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.
వరంగల్ కాకతీయ జూ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సీ ఎం సూచించారు. హైదరాబాద్ త ర్వాత రాష్ట్రంలో పెద్ద నగరమైన వ రంగల్‌లో జూను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేం దుకు ఉన్న అవకాశాలపై అధ్యయ నం చేయాలన్నారు. అటవీ జంతు వుల దాడిలో మృతిచెందిన లేదా గాయపడిన వారికి, పశువులు, పెం పుడు జంతువులు కోల్పోయిన వా రికి తక్షణమే పరిహారం అందేలా చ ర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందుకు సీఎం ఆర్ఎఫ్ నుంచి అవసరమైన మేర కు నిధులు వినియోగించుకోవాలని సీఎం సూచించారు. అటవీ శాఖ ప రిధిలో చేపడుతున్న రహదారులు, ఇతర అభివృద్ధి పనులకు అవసర మైన అనుమతుల విషయంలో అ టవీ శాఖ, ఆయా పనులు చేపడు తున్న శాఖల అధికారులు సమన్వ యంతో పని చేయాలని సీఎం సూ చించారు. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి అనుమతులను సాధ్య మైనంత త్వరగా సాధించాలన్నా రు. అడవుల్లో వన్య ప్రాణుల సంర క్షణ, వాటి కదలికలను గమనించేం దుకు ఏర్పాటు చేసిన కెమెరాలన్నిం టిని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానించాలని సీఎం ఆదేశిం చారు.
అటవీ శాఖలో అధికారుల కొరత పై నా సీఎం ఆరా తీశారు. రాష్ట్రానికి తగిన సంఖ్యలో ఐఎఫ్ఎస్ అధి కా రుల కేటాయింపుపై కేంద్రంతో సంప్ర దించాలని సీఎస్‌కు సూచించారు. అటవీ శాఖలో ప్రమోషన్ లు, ఉద్యో గాల భర్తీకి సంబంధించిన ప్రతిపాద నలను తక్షణమే సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. శాఖ లో ఉత్తమ పని తీరు కనబర్చుతు న్న వారికి అవార్డులను ఇచ్చే ప్రక్రి యను పునరుద్ధరించాలని సీఎం సూచించారు.
ఈ సమీక్షలో రాష్ట్ర అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అహ్మద్ నదీమ్, ముఖ్యమంత్రి ఓఎస్డీ వేముల శ్రీని వాసులు, పీసీసీఎఫ్ డాక్టర్ సి.సు వర్ణ, పీసీసీఎఫ్ (వైల్డ్ లైఫ్) ఎలుసిం గ్ మేరు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.