CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యా ఖ్య, గతప్రభుత్వ రెండు చట్టాలే బీసీ రిజర్వేషన్ల అమలకు గుదిబండ
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్ : తెలం గాణలో గత కేసీఆర్ ప్రభుత్వం తీ సుకొచ్చిన రెండు చట్టాలు బీసీ రిజ ర్వేషన్ల అమలుకు గుదిబండగా మారాయని సీఎం రేవంత్ రెడ్డి చె ప్పుకొచ్చారు. ఆదివారం అసెంబ్లీలో మున్సిపల్ చట్ట సవరణ బిల్లుపై శా సనసభలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడారు. సీఎం వ్యాఖ్యలు ఆ యన మాటల్లోనే…2018 లో తీసు కొచ్చిన పంచాయతీరాజ్ చట్టంలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల పరి మితికి లోబడి మాత్రమే ఎన్నికలు నిర్వహించాలని ఉంది. 2019లో తెచ్చిన మున్సిపల్ చట్టంలోనూ ఇ దే ఉంది. ఈ రెండు చట్టాలు గుది బండగా మారడంతో మాప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
విద్య, ఉద్యోగ అవకాశాల్లో 42 శా తం రిజర్వేషన్లు,స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం రెండు బి ల్లులను గతంలో తాము అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్కు పంపినట్లు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గవర్నర్ వాటిని ఆమోదిం చకుండా రాష్ట్రపతికి పంపించార న్నారు. సుమారు ఐదు నెలల నుం చి ఆ బిల్లులు రాష్ట్రపతి వద్ద ఉ న్నాయన్నారు.
భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే గం గుల కమలాకర్ ఢిల్లీకి అఖిలపక్షా న్ని తీసుకెళ్లలేదని చెబుతున్నార ని, ఐదు సార్లు దీని గురించి ప్రధాని కి లేఖ రాశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. ఈక్రమంలో ప్రధా నిపై ఒత్తిడి తీసుకురావడానికి జం తర్ మంతర్ వద్ద ధర్నా చేశామని గుర్తు చేశారు. వంద మంది ఇతర రాష్ట్రాలకు చెందిన ఎంపీలు మద్ద తిచ్చారని, రాజ్యసభలో ఉన్న భా రత రాష్ట్ర సమితి ఎంపీలు మాత్రం అటు వైపు కన్నెత్తి కూడా చూడలే దని ఆరోపించారు.
బీసీల గురించి మాట్లాడుతున్న గం గుల కమలాకర్ కూడా రాలేదన్నా రు. వాళ్ల పార్టీ నాయకుడు బలహీ నవర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధంగా లేరని ఆరోపిం చారు. ఈరోజు కూడా సభలో గం దరగోళం సృష్టించి బిల్లు ఆమోదం చెందకుండా ప్రయత్నిస్తున్నారని అ న్నారు.ఆరునూరైనా రాష్ట్రంలో బీ సీల రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ ఆకాంక్షల్ని నెరవేర్చేందు కు సోనియాగాంధీ తీవ్రంగా శ్రమిస్తు న్నారని చెప్పారు. రాహుల్ గాంధీకి తెలియకుండా తాను నిర్ణయం తీ సుకోలేదని స్పష్టం చేశారు. బీసీ రి జర్వేషన్లకు రాష్ట్రంలో డెడికేటెడ్ క మిషన్ ను వేశామని చెప్పారు. బల హీన వర్గాలకు న్యాయం చేయాలని తాము ప్రయత్నిస్తోంటే బీఆర్ఎస్ అడ్డుకోవాలని చూస్తోందని మండి పడ్డారు. ఉన్న అడ్డంకులన్నింటినీ తొలగించి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవ ర్నర్ కు పంపిస్తే, గవర్నర్ వద్ద పెం డింగ్లోనే ఉందన్నారు.