CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: దేశ భద్ర తా బలగాలు ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్య వసర సమీక్ష సమావేశం నిర్వహిం చారు. ఆర్మీ, పోలీసు, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఇతర అత్యవసర విభాగాలతో తాజా పరిణామాలను సమీక్షించిన ముఖ్యమంత్రి ఇలాం టి సందర్భాల్లో తీసుకోవలసిన చ ర్యలపై దిశానిర్దేశం చేశారు.
భారత సైనిక బలగాలకు సంఘీభా వంగా, అండగా ఉన్నామని సందే శం ఇవ్వడానికి తెలంగాణ ప్రజల తరఫున గురువారం సాయంత్రం 6 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ చేపట్టాలని నిర్ణయిం చారు. తీవ్రవాద వ్యతిరేక పోరాటా లకు సంఘీభావ ప్రకటనగా ఈ ర్యా లీ కొనసాగుతుందని తెలిపారు.
ఇలాంటి సమయాల్లో రాజకీయాల కు, పార్టీలకు సంబంధించిన వివా దాలకు తావులేదని చెప్పారు. ఎ లాంటి పరిస్థితులనైనా ఎదుర్కొన డానికి సర్వసన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి గారు ఆయా విభా గాలకు స్పష్టంగా పలు ఆదేశాలి చ్చారు.
మంత్రులు, అధికారులు 24 గం టలు అందుబాటులో ఉండాలి. అత్యవసర సర్వీసులు అందించే విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సెలవులు రద్దు చేయాలి. ఉద్యోగు లంతా అందుబాటులో ఉండాలి. విదేశీ పర్యటనలు రద్దు చేసుకో వాలన్నారు . వైద్యం, పౌరసరఫ రాలు, విద్యుత్ వంటి అత్యవసర సేవల విభాగాలన్నీ 24 గంటలు ప్ర జలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలి. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమాచారం కోసం ప్రత్యేక వ్యవస్థ ను ఏర్పాటు చేసుకోవాలని చెప్పా రు.
పరిస్థితిని ఆసరా చేసుకుని సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రకటనలు చేసే వారి పట్ల పోలీసులు కఠిన చ ర్యలు తీసుకోవాలి. శాంతి భద్రత లకు భంగం కలిగించే వారిపట్ల అ త్యంత కఠినంగా వ్యవహరించాల ని, సైబర్ సెక్యూరిటీ విభాగం అప్ర మత్తంగా ఉండాలని ఆదేశించారు.
ముఖ్యంగా తప్పుడు సమాచారం వ్యాప్తి జరక్కుండా ఫేక్ న్యూస్ ప్ర చారం చేసే వారిపైన కఠినంగా వ్య వహరించాలని, ఫేక్ న్యూస్‌ను, పు కార్లు వ్యాప్తిని అరికట్టడానికి ప్రత్యే క విభాగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు.రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమె రా లను కమాండ్ కంట్రోల్ రూంకి అ నుసంధానం చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. అ న్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో 24 గంటలు అప్రమత్తం గా ఉండటంతో పాటు భధ్రతను పెంచాలన్నారు.
హైదరాబాద్ నగరంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, అవసర మైన సందర్భంగా పీస్ కమిటీలతో సమావేశం కావాలని చెప్పారు. పా త నేరస్తులు, ఇతర నేర చరిత్ర కలి గిన వారిపట్ల పోలీసులు అప్రమ త్తంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షి స్తుండాలని ముఖ్యమంత్రి ఆదే శించారు. ఈ సమావేశంలో ఆర్మీ, పోలీసు, ఇతర అత్యవసర విభాగా లకు చెందిన ఉన్నతస్థాయి అధికా రులు పాల్గొన్నారు.