Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, తెలం గాణను రోల్ మాడల్‌గా నిలపాల న్న సంకల్పంతో మా క్రీడావిధానం

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్:  క్రీడల్లో తెలంగాణను దేశానికి రోల్ మాడల్‌గా నిలపాలన్న సంకల్పంతో క్రీడా విధానం తెచ్చామని ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ విధానంలో రాజకీయ జోక్యం తగ్గించాలన్న ఉద్దేశంతోనే పబ్లిక్ – ప్రైవేటు భాగస్వామ్యంతో క్రీడాపాల సీని రూపొందించామని తెలిపారు. క్రీడా రంగాన్ని ప్రోత్సహిస్తూ అత్యు త్తమ ఫలితాలను అందిస్తున్న కా ర్పొరేట్ సంస్థలు, ఆ రంగంలో విశే ష అనుభవం ఉన్న వారిని ఆహ్వా నించే ఒక బోర్డును ఏర్పాటు చేసిన ట్టు చెప్పారు.హెచ్ఐసీసీలో నిర్వ హించిన మొదటి ఎడిషన్ తెలంగా ణ క్రీడా సదస్సు ( 1st Edition Telangana Sports Conclave – 2025) లో ముఖ్యమంత్రి పాల్గొ ని ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ క్రీడా విధానాన్ని (Telan gana Sports Policy) ప్రకటించా రు. దేశంలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రఖ్యాత సంస్థల ప్రతినిధు లు, ప్రముఖ క్రీడాకారులు, క్రీడాభి మానులు ఈ కాంక్లెవ్ లో పెద్దఎత్తు న పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్ర సంగం ఆయన మాటల్లోనే “రాను న్న రోజుల్లో మంచి క్రీడాకారులను తయారు చేయాలన్న లక్ష్యంతో ఈ పాలసీ తెచ్చాం. ఒక రోజు సదస్సు నిర్వహిం చి వదిలేయడానికి కాదు. వచ్చే రోజుల్లో ఈ దేశాన్ని ముందు కు నడిపించడానికి, ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే లక్ష్యంగా పని చేయాలి.ఈ వేదికలో పాల్గొన్న క్రీడా కారులంతా తెలంగాణ క్రీడా పాలసీ లో భాగస్వాములే. క్రీడల్లో తెలంగా ణను దేశానికి రోల్ మాడల్‌గా నిల పాలి. ఇది కొత్త ఆరంభం. ఇందుకు అందరికీ ఆహ్వానం పలుకుతు న్నాం. క్రీడాభివృద్ధికి ఎలాంటి మద్ద తు కావాలన్నా అందించడానికి ప్ర భుత్వం సిద్ధంగా ఉన్నాం. అందరం కలిసి ముందుకు సాగుదాం. తెలం గాణ పేరును ప్రపంచం ముందు నిలపడంలో మీ అందరి మద్దతు ఉండాలి.

 

నగరాలు, పట్టణాల్లో క్రీడామైదా నాలు లేక, క్రీడలను ప్రోత్సహించే పరిస్థితులు లేని కారణంగా కాలేజీ లు, విద్యా సంస్థల్లో యువత పెడ దారులు పడుతున్నారు. ప్రభుత్వ పరంగా సరైన విధానాలు లేకపో వడం, క్రీడలను ప్రోత్సహించని కా రణంగానే మాదక ద్రవ్యాలు వేగం గా విస్తరించే ప్రమాదం ఏర్పడుతోం ది. మాదక ద్రవ్యాల వినియోగమే కాదు, అవి తెలంగాణలో అడుగు పెట్టాలంటే వణుకు పుట్టాలి. అందు కోసమే ఈగల్‌ వ్యవస్థను ఏర్పాటు చేశాం. 1956 ఒలింపిక్స్ ఫుట్‌బాల్ క్రీడలో 9 మంది క్రీడాకారులు హైద రాబాద్ నుంచి పాల్గొన్న చరిత్ర ఈ ప్రాంతానికి ఉంది. అక్కడి నుంచి ప్రారంభిస్తే ఆ తర్వాత ఎందరో క్రీడా కారులు ఇక్కడి నుంచి రాణించా రు. అలా రాణించిన వారికి ప్రభు త్వం ఇంటి స్థలాలు, నగదు ప్రోత్స హకాలు, ఉద్యోగాలు కల్పించడం వంటి అనేక రకాలుగా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. చదువులోనే కాదు క్రీడల్లో రాణిస్తే క్రీడాకారులను ప్రభు త్వం ప్రోత్సహిస్తుంది. గడిచిన పది పదిహేను సంవత్సరాల కాలంలో క్రీడలకు ప్రోత్సహం లేక మైదానాలు ఫంక్షన్ హాళ్లుగా మారాయి.

ఇటీవలి ఒలింపిక్స్‌లో భారత్ 71 వ స్థానంలో ఉందంటే అందరూ ఆలో చించాలి. చిన్న దేశమైన దక్షిణ కొరి యా 32 స్వర్ణ పతకాలు సాధిస్తే అందులో ఒక అమ్మాయి ఏకంగా 3 స్వర్ణాలు సాధించారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత దేశానికి ఒక్క స్వర్ణం కూడా రాకపోవడం విచార కరం. 2036 ఒలింపిక్స్ నిర్వహిం చాలని దేశం ముందుకు వెళుతున్న నేపథ్యంలో కనీసం రెండు క్రీడలనై నా తెలంగాణలో నిర్వహించడానికి అవకాశం ఇవ్వాలని కోరాం.దేశం ఒ క బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగు తున్న దశలో క్రీడల్లో కూడా బలంగా నిలవాలి. అందుకే తెలంగాణ రైజిం గ్ 2047 విజన్ డాక్యుమెంట్‌లో క్రీ డాభివృద్ధి లక్ష్యాల కోసం ప్రత్యేక చాప్టర్ పెట్టాం. ఆ లక్ష్య సాధన దిశ గానే క్రీడల్లో మంచి ఫలితాలు సాధి స్తున్న వారందరినీ ఈ వేదికపైకి ఆ హ్వానించాం.

 

తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీలను ప్రారంభిస్తున్నాం. ఇక్కడ శిక్షణ ఇచ్చే కోచ్‌ల సంఖ్య తక్కువగా ఉంది. అందుకే అత్యు త్తమ శిక్షణ కోసం దక్షిణ కొరియా యూనివర్సిటీతో ఒప్పందం చేసుకు న్నామని ముఖ్యమంత్రి వివరించా రు.ఈ కాంక్లేవ్‌లో ముఖ్యమంత్రి స మక్షంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సం స్థ క్రీడాభివృద్ధికి సంబంధించి పలు సంస్థలతో ఒప్పందాలు కుదు ర్చుకుంది. వివిధ క్రీడల్లో ప్రతిభ కన బరిచిన క్రీడాకారులకు ఈ సంద ర్భంగా ప్రోత్సాహకంగా ప్రభుత్వం నగ దు బహుమతులను అందజే సింది.

 

కొరియాలో జరిగిన ఏషియన్ అథ్లె టిక్స్ చాంపియన్ షిప్ 2025 లో స్వర్ణ పతకం సాధించిన అథ్లెట్ అగసర నందినికి 5 లక్షలు, బెల్జి యం లో జరిగిన 14 వ అంతర్జా తీయ జిమ్నోవా కప్ 2024 లో కాంస్య పతకం సాధించిన నిశికా అగర్వాల్‌కు 3 లక్షలు, 2024 జర్మ నీలో జరిగిన ప్రపంచ (మూగ) షూ టింగ్ చాంపియన్ షిప్‌లో 2 స్వర్ణా లు సాధించిన షూటర్ ధనుష్ శ్రీ కాంత్‌కు 10 లక్షలు, ఈజిప్ట్‌లో వ చ్చే సెప్టెంబర్ లో జరగబోయే గోల్ బాల్ అథ్లెటిక్స్‌లో పాల్గొంటున్న ప వన్ కల్యాణ్, పి. సాయి తేజ, కోచ్ శివకుమార్‌లకు 4.8 లక్షల రూపా యలను క్రీడా ప్రోత్సహాకం కింద అందజేశారు.

 

క్రీడలను ప్రోత్సహించడానికి గగన్ నారంగ్‌ (షూటింగ్‌), అభినవ్‌ బిం ద్రా (స్పోర్ట్స్‌ సైన్స్‌), పుల్లెల గోపీచం ద్‌ (బాడ్మింటన్), ఫీపా, ఒలంపిక్ వ్యాల్యూస్‌ ఎడ్యుకేషన్, గన్ ఫర్ గ్లోరీ, స్పోర్ట్స్‌ ప్రిక్స్‌, ఆస్పైర్‌, టెన్విక్‌ లాంటి సంస్థలతో ఒప్పందాలు కు దిరాయి. ఈ కాంక్లేవ్ మంత్రి వాకి టి శ్రీహరి , ప్రభుత్వ సలహాదారు (క్రీ డా వ్యవహారాలు) ఏపీ జితేందర్ రెడ్డి, తెలంగాణ క్రీడా ప్రాధికార సం స్థ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు క్రీడారంగానికి చెం దిన ప్రముఖులు హాజరయ్యారు.