Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth: సీఎం రేవంత్ కు ఘన స్వాగతం

CM Revanth: ప్రజా దీవెన, న్యూయార్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)అమెరికా పర్యటనకు వెళ్లిన నేప థ్యంలో అక్కడికి చేరుకున్నారు. శనివారం ప్రారంభమైన ఆయన ప్రయాణం ఆదివారం తెల్లవారుజా మున అమెరికా చేరుకున్నారు. ఈ సందర్భంగా న్యూయార్క్‌లో సీఎం రేవంత్‌ బృందానికి స్వాగతం పలికా రు. సీఎం రేవంత్ రెడ్డి 10 రోజుల పాటు అమెరికాలో పర్యటించను న్నారు. ఈరోజు న్యూయార్క్‌లో ఎన్‌ఆర్‌ఐలతో రేవంత్ భేటీ కాను న్నారు. ఇక్కడి పర్యటన అనంత రం రేవంత్ బృందం దక్షిణ కొరియా కు వెళ్లనుంది. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడమే లక్ష్యంగా సీఎం రేవంత్ విదేశీ పర్యటన షె డ్యూల్ (Foreign tour schedule) కొనసాగుతుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, న్యూ యార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, దక్షిణ కొరియాలోని సియోల్‌లలో రేవంత్ బృందం పర్యటించనుంది. ఆదివా రం నుంచి సుమారు 10 రోజులు విదేశీ పర్యటలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా ఉండనున్నారు.సీఎం పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి.


ఈ నెల 4న న్యూజెర్సీలో ప్రవాస తెలంగాణా ప్రజలతో జరిగే సమా వేశంలో ఈ బృందం పాల్గొంటుంది.
అనంతరం 5, 6 తేదీల్లో న్యూయా ర్క్ లో వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధుల తో సమావేశమై రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాల పై చర్చిస్తారు. ఇక 6వ తేదీన పెప్సీకో, హెచ్‌సీఏ కంప్యూట ర్స్‌ ప్రతినిధులతో సమావేశమ వుతారు. మధ్యాహ్నం వాషింగ్టన్ డీసీకి (Washington DC)చేరుకుని అక్కడి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశం కానున్నారు.7న డల్లాస్‌లో వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. అదే రోజు అక్కడి గాంధీ స్మారక కేంద్రాన్ని సందర్శిస్తారు.

8వ తేదీన యాపిల్ తయారీ బృందం, ట్రైనెట్ సీఈవో, ఇతర వ్యాపార సంస్థల ప్రతినిధులు సమావేశమై చర్చించనున్నారు. 9వ తేదీన గూగుల్, అమెజాన్ (Google, Amazon)తదితర కంపెనీల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. సాయంత్రం శాన్ ఫ్రా న్సిస్కోలో జరిగే ప్రవాస తెలంగాణ ల సమావేశంలో వీరు పాల్గొనను న్నారు. ఇక 10వ తేదీన శాన్ ఫ్రాన్సి స్కో నుంచి బయలుదేరి 11న దక్షి ణ కొరియా రాజధాని సియోల్ చేరుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత 12, 13 తేదీల్లో ఎల్ జీ, శాంసంగ్ తదితర వ్యాపార సంస్థల ప్రతినిధులతో సమావేశమై పెట్టు బడి అవకాశాలపై చర్చించ నుo డగా13వ తేదీ రాత్రి 11.50 గంట లకు సియోల్ బయలుదేరి, 14వ తేదీ ఉదయం 10.50 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.