CM Revanth Reddy :ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రపంచ సుందరి 2025 పోటీకి కట్టుదిట్టమై న ఏర్పాట్లు చేయాలని ముఖ్యమం త్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మే నెల 10 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న MISS WORLD-2025 ఏర్పాట్లపై అధికా రులతో ముఖ్యమంత్రి సమీక్ష స మావేశం నిర్వహించారు. హైదరా బాద్ లో 72 వ మిస్ వరల్డ్ నిర్వ హణకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్ల వివరాలను సమావేశంలో అధికారులు వివరించారు. ఈ కా ర్యక్రమంలో పాల్గొనే అతిథులకు ఎ లాంటి అసౌకర్యం కలగకుండా చ ర్యలు తీసుకోవాలని ఈ సందర్భం గా ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కా ర్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసే అతిథుల కోసం ఎయిర్ పోర్టు, వా రు బస చేసే హోటళ్లు, కార్యక్రమా లు నిర్వహించే ప్రాంతంలో కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయా లని ముఖ్యమంత్రి పోలీసు అధికా రులను ఆదేశించారు.
తెలంగాణలోని చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శిం చేందుకు అతిథుల ప్రత్యేక ఏర్పా ట్లు చేయాలని చెప్పారు. కార్యక్ర మాలకు సంబంధించి విభాగాల వారిగా పర్యవేక్షణకు ప్రత్యేక అధి కారులను నియమించాలని సూ చించారు. నగరంలో పెండింగ్ లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను త్వ రగా పూర్తి చేయాలని, మిస్ వర ల్డ్-2025 ప్రారంభమయ్యే నాటి నుంచి పూర్తయ్యే వరకు చేపట్టా ల్సిన కార్యక్రమాలు, పూర్తి చేయా ల్సిన పనులు, ఏర్పాట్లకు సంబం ధించి పూర్తి స్థాయి ప్రణాళికను సి ద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదే శించారు.