CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిది ద్దుదామని అందరం ప్రతిజ్ఞ చేద్దామ ని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఉ పాధ్యాయులకు పిలుపునిచ్చారు. ప్రతి పేదవాడూ ఎదగాలంటే చదు వు ఒక్కటే మార్గమని, అందరం క లిసి వారికి నాణ్యమైన విద్యను అందిద్దామని కోరారు. విద్యా రంగం అభివృద్ధి కోసం తెలంగాణలో ఏటా 40 వేల కోట్లు ఖర్చు పెడుతున్నా మని, ఈ పిల్లలే దేశ భవిష్యత్తు అ ని, వారి భవిష్యత్తు ఉపాధ్యాయు లైన మీ చేతుల్లో ఉందని, రాష్ట్రం లో 1 లక్షా 20 వేల మంది ఉపాధ్యా యులు ఉన్నారు. ప్రభుత్వ బడుల్లో ప్రైవేటు స్కూళ్లకంటే నాణ్యమైన వి ద్యను అందించడానికి అందరం న డుం బిగిద్దామని అన్నారు. బలమై న తెలంగాణను నిర్మించాలంటే దేశ భవిష్యత్తు గరగతి గదుల్లో ఉందని బలంగా విశ్వసిస్తానని చెప్పారు.
గురుపూజోత్సవం సందర్భంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో పెద్ద ఎత్తున నిర్వహించిన కార్యక్రమం లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతరత్న డాక్టర్ స ర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. విద్యార్థి నీ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఎగ్జి బిషన్‌ను ప్రారంభించి స్టాల్స్ అన్నిం టినీ పరిశీలించారు. ఈ సందర్భం గా ముఖ్యమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే.
ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్ర భుత్వ స్కూళ్లు రాణించాలి. ప్రైవే టు స్కూళ్లలో నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ మూడేళ్లు చదివిన త ర్వా త పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు రావడం లేదు. అందుకే విద్యా క మిషన్ సూచనల మేరకు ప్రభుత్వ బడుల్లో కూడా నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రారంభిస్తున్నాం. ఈ ఏ డాది 3 లక్షల మంది విద్యార్థినీ వి ద్యార్థులు ప్రైవేటు నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి వచ్చారంటే ఉపాధ్యాయుల కృషి మాత్రమే. అం దుకు టీచర్లందరినీ అభినందిస్తు న్నా. పిల్లలు బడికి పోవడానికి ర వాణా సౌకర్యం లేకపోతే స్కూల్ టీచర్లు వారి జీతంలో కొంత కేటా యించి సామాజిక బాధ్యతగా ఆ డబ్బుతో పిల్లలకు రవాణా సౌకర్యం కల్పించిన ఉపాధ్యాయులకు ప్రత్యే క అభినందనలు. ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధ్యాయులైన భార్య, భర్తలిద్దరూ కలిసి ఆదివాసీ పిల్ల ల కు చదువు చెబుతున్న తీరు అభి నందనీయం.
రాష్ట్రంలోని ఉపాధ్యాయులంతా ఆ దరించి, అవకాశం ఇచ్చినందున వి ద్యా శాఖ నా వద్ద పెట్టుకుని తక్షణ మే మీ బదిలీలు, ప్రమోషన్లు వంటి సుదీర్ఘ కాలం పెండింగ్‌లో ఉన్న స మస్యలను పరిష్కరించాం. కొంత ఆలస్యం జరిగి ఉండొచ్చు. కానీ వీ లైనంత మేరకు అన్ని సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తు న్నాం.తెలంగాణ వస్తే కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య అంటే తెలం గాణ బాగుపడుతుందని అందరూ భావించారు. కానీ అందుకు విరు ద్ధంగా సింగిల్ టీచర్ పాఠశాలలు ఎన్ని మూత పడ్డాయో ఉపాధ్యా యులకు తెలుసు. ఉపాధ్యాయుల సమస్యలేవీ పరిష్కారం కాలేదు. ప్రజా ప్రభుత్వం వచ్చాక 15 ఏళ్లుగా నిలిచిపోయిన ప్రమోషన్స్ కల్పిం చాం. బదిలీలు చేపట్టాం. కేవలం 5 5 రోజుల్లో టెట్ నిర్వహణతో సహా కేవలం 55 రోజుల్లో డీఎస్సీ నిర్వ హించి 11 వేల మందికి టీచర్ ఉ ద్యోగాలిచ్చాం.
అవగాహనతో కూడిన బాధ్యతా యుతమైన పౌరులుగా తీర్చిదిద్దా లని విద్యా రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం.విద్యార్థినీ విద్యార్థులకు డై ట్, కాస్మొటిక్ చార్జీలు పెంచాం. ప్రై వేటు యూనివర్సిటీలు పెట్టుకుని విద్యపై ఆదిపత్యం చెలాయించాల న్న ప్రయత్నాలు జరిగాయి. వర్సి టీల్లో నియామకాలు ఆగిపోయా యి. ఇంటర్మీడియట్ విద్య పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. నైపుణ్యం కలి గిన అధ్యాపకులు, ఉపాధ్యాయు లు రిటైరైపోతుంటే కొత్త నియామ కాలు చేపట్టలేదు. దేశానికి గొప్ప మేధావులను అందించిన ఉస్మాని యా, కాకతీయ యూనివర్సిటీలు మూతపడే పరిస్థితికి చేరుకున్నా యి.
తెలంగాణలో గతంలో గురుపూజో త్సవ కార్యక్రమాలు ఎప్పుడైనా జ రిగాయా. తెలంగాణ పునర్నిర్మా ణంలో ఉపాధ్యాయుల పాత్ర, వారి సేవల అవసరం ఉంటుందని మీతో మాట్లాడటానికి సమయం కేటా యించా. నేనూ గ్రామీణ పాఠశాల లోనే చదువుకున్నా. మీలాంటి వా రు చదువు చెబితేనే ఈ స్థాయికి ఎదిగా. రాష్ట్రంలో 25 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే వాటిల్లో 24 ల క్షల మంది విద్యార్థులున్నారు. 11 వేల ప్రైవేటు స్కూల్స్ ఉంటే వాటి ల్లో 34 లక్షల మంది పిల్లలు చదు వుతున్నారు. అందుకు కారణం పా లకులుగా మేము లేదా ఉపాధ్యా యులుగా మీరు. ప్రైవేటు స్కూళ్ల ను అవమానించడం కాదు. పోల్చి చెబుతున్నా. ప్రైవేటుకన్నా ప్రభు త్వ టీచర్లకు ఉన్నత విద్యార్హతలతో పాటు సామాజిక బాధ్యత గుర్తెరిగి న వారుంటారు.
చదువు ఒక్కటే పేదల తలరాత మార్చుతుందని బలంగా నమ్ముతా. కొన్ని సంస్థల్లో అక్కడక్కడ పుడ్ పా యిజనింగ్ సంఘటనలు బాధ కలి గిస్తుంది. డైట్ చార్జీలను పెంచాం. నాణ్యమైన ఆహారం ఇవ్వాలని చె ప్పాం. ఉపాధ్యాయులు కూడా వా రితో కలిసి భోజనం చేయాలి. తల్లి దండ్రులు మనపై ఎంతో విశ్వాసం తో బడులకు పంపిస్తుంటారు. వారి నమ్మకమంతా టీచర్లపైనే. మీరెప్పు డైతే పిల్లలతో కలిసి భోజనం చేస్తా రో తప్పులు జరక్కుండా ఉంటుంది.
ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెంది న సింగపూర్, చైనా, జపాన్, జర్మనీ లాంటి దేశాల్లో జరుగుతున్న విద్యా విధానం అధ్యయనం కోసం ప్రతి ఏటా 2 వందల మంది ఉపాధ్యా యులను ఆయా దేశాలకు పంపిం చాలని నిర్ణయించాం.
రాష్ట్రంలో 1 లక్షా 20 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మారుతున్న కాలమాన పరిస్థితుల కు అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా నైపుణ్యం పెంచుకోవలసిన అవసరం ఉంది. ఫౌండేషన్ సరిగా లేకుండా భవనానికి పై అంతస్తులు కట్టాలని భావించడం సరికాదు. అం దుకే నర్సరీ నుంచి 12 తరగతి వర కు విద్యా రంగంలో గట్టి ఫౌండేషన్ ఉండాలని భావిస్తున్నాం. నైపుణ్యం లేకుండా కేవలం సర్టిఫికేట్లతో సరి పోదు.
రాష్ట్రంలో ప్రతి ఏటా 1.10 లక్షల విద్యార్థులు ఇంజనీరింగ్ పూర్తి చే స్తున్నారు. స్కిల్స్ లేని కారణంగా చాలామంది వెనుకబడి పోతున్నా రు. అలాంటి విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో వంద నియోజకవర్గాల్లో 20 వేల కోట్ల రూ పాయలు వెచ్చించి ప్రపంచంలోనే అత్తున్నత ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ ల్ స్కూల్స్ ప్రారంభిస్తున్నాం. అలా గే నైపుణ్యత కోసం మహీంద్రా గ్రూ ప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా చైర్మన్ గా యంగ్ ఇండియా స్కిల్స్ యూ నివర్సిటీని ప్రారంబించాం. రాష్ట్రం లోని 65 ప్రభుత్వ ఐటీఐల్లో పాత సిలబస్‌తో అవి కాలగర్భంలో కలి సిపోయే పరిస్థితులొస్తే టాటా క న్స ల్టెన్సీ వారి సహకారంతో 2400 కో ట్ల రూపాయలు వెచ్చించి అడ్వా న్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఏటీసీలు గా మార్చుతున్నాం.
ప్రపంచంలోని అత్యధిక జనాభా క లిగిన దేశం ఒలింపిక్స్‌లో ఒక్క మె డల్ కూడా సాధించలేకపోవడం మనకు అవమానకరం. దేశ ప్రతిష్ట పెరగడానికి తెలంగాణలో స్పోర్ట్ వర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీ ఉండా లని నిర్ణయించాం. మీ స్కూళ్లల్లో నై పుణ్యం ఉన్న క్రీడాకారులను గు ర్తిం చండి. వారిలోని ప్రతిభను వెలికితీ యడానికి పిల్లలను నిశితంగా గమ నించండి. అందుకు ఏది అడిగినా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉం ది.కొందరు పిల్లలు మాదక ద్రవ్యాల వ్యసనాల బారిన పడుతున్నారు. తద్వారా జీవితంలో దారి తప్పు తున్నారు. అలాంటి వారిని చూస్తే తల్లిదండ్రులు ఎంత వ్యధ చెందు తారో అర్థం చేసుకోండి. రాష్ట్రంలో ఒక చిన్న గంజాయి మొక్క కనబడి నా కఠినంగా చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు.ఈ కార్యక్ర మంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, సలహాదారులు కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎ మ్మెల్యేలు, ఉత్తమ ఉపాధ్యాయ అ వార్డు గ్రహీతలు, ఆయా విశ్వ వి ద్యాలయాల వైస్ చాన్సెలర్లు, ఇత ర ఉపాధ్యాయులు, విద్యార్థినీ వి ద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
*కన్నుల పండుగగా గురుపూజో త్సవం….* గురుపూజోత్సవం సం దర్భంగా ప్రభుత్వం తరఫున హైద రాబాద్లోని శిల్పకళా వేదికలో ని ర్వహించిన కార్యక్రమం కన్నుల పం డుగగా సాగింది. పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యా యులు భాగస్వామ్యంగా సాగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిఎంతో సమయం వెచ్చిం చి అందరితోనూ ఉల్లాసంగా గడి పారు. తొలుత తెలంగాణ రెసిడెన్షి యల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూష న్ సొసైటీ (TGSWREIS) విద్యార్థి నుల నుంచి గౌరవ వందనం స్వీక రించారు.
ప్రాంగణంలోకి వచ్చీ రాగానే వి ద్యా ర్థినీ విద్యార్థులతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ముఖ్య మంత్రి ప్రతి స్టాల్స్‌ను సందర్శించడ మే కాకుండా ఆయా రంగాల్లో వారు ప్రదర్శించిన నైపుణ్యాల గురించి ఒ క్కొక్కరిని అడిగి మరీ తెలుసుకు న్నారు. పాఠశాల విద్యార్థుల నుంచి వర్సిటీ అధ్యాపకుల వరకు అన్ని స్థాయిల్లో స్టాళ్లలో ప్రదర్శకు ఉంచిన వస్తువుల వివరాలను అడిగారు.
ముఖ్యమంత్రి కార్యక్రమ ప్రాంగణా నికి వచ్చిన సందర్భంగా ఎన్సీసీ, ఎన్ఎస్సెస్, స్కౌట్స్ అండ్ గైడ్స్, స్కూల్ బ్యాండ్ పిల్లలతో కరచాల నం చేస్తూ కలివిడిగా తిరిగారు. తర గతి గదుల్లోనే దేశ భవిష్యత్తు ఉం టుందని విశ్వసించే ముఖ్యమంత్రి వారితో ఎక్కువ సమయం వెచ్చిం చారు.
పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, టెక్నికల్, ఉన్నత విద్యా శాఖల ఆ ధ్వర్యంలో పాఠశాలల నుంచి వ ర్సిటీల స్థాయి వరకు సంప్రదాయ వస్తువులు, సేంద్రీయ సేద్యం నుంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వర కు అన్ని రంగాల్లో వారి వారి పరిశో ధనలు, నూతన ఆవిష్కరణలను ప్రదర్శనగా ఉంచారు. ఒక్కొక్కరిగా అందరి వద్దకు వెళ్లిన ముఖ్యమంత్రి గారు వారు చెప్పే అనేక విషయాల ను ఆసక్తిగా విన్నారు. ఆ తర్వాత ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీ తలతో ఫోటో దిగారు.