Praja Deveena
Newspaper Banner
Date of Publish : 08 September 2025, 11:43 am Posted by : praja deveena

Chikita Taniparthi : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, ప్రపం చ యూత్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌ లో స్వర్ణo సాధించిన తొలి మహిళ చికిత తానిపర్తి ఒలింపిక్స్‌లో పోటీ పడేలా సహకారం 

Chikita Taniparthi : ప్రజా దీవెన, హైదరాబాద్: కెనడా లో జరిగిన ప్రపంచ యూత్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సా ధించిన తొలి మహిళగా రికార్డు సృ ష్టించిన చికిత తానిపర్తి వచ్చే ఒలిం పిక్స్‌లో పోటీ పడేలా ప్రభుత్వ తర ఫున పూర్తిస్థాయిలో శిక్షణ అందిం చేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. కె నడాలో జరిగిన ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సా ధించి వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచి న పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండ లం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన చికిత ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.

ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌తో పాటు చైనాలోని షాంగైలో జరిగిన సీనియర్ వరల్డ్ కప్ జట్టు రజత ప తకం సాధించిన చికితను ఈ సం ద ర్భంగా ముఖ్యమంత్రి అభినందిం చారు. ఒలంపిక్స్ లక్ష్యంగా సాధన చేయాలని, అందుకు ప్రభుత్వం అ న్ని రకాలుగా అండదండలు అంది స్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ టి. భాను ప్ర సాద్, ఎమ్మెల్యే విజయ రమణా రావు, తెలంగాణ క్రీడా ప్రాథికార సంస్థ చైర్మన్ శివ సేనారెడ్డి ఇతర ప్రతినిధులు ఉన్నారు.