CM Revanth Reddy : సీఎం రేవంత్ కీలక వ్యాఖ్య, రహ దారులకు భూసేకరణ విషయంలో మానవీయకోణంలో వ్యవరించాలి
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో జాతీయ రహదారుల నిర్మా ణానికి సంబంధించి భూ సేకరణ, పరిహారం చెల్లింపు ప్రక్రియను వేగ వంతం చేయాలని ముఖ్యమం త్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదే శించారు. భూసేకరణ విషయంలో మానవీయకోణంలో వ్యవరించాల ని, అదే సమయంలో రహదారుల నిర్మాణంతో కలిగే లాభాలను రైతు లకు వివరించి ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత జిల్లా ల కలెక్టర్లను ఆదేశించారు. రా ష్ట్రం లో జాతీయ రహదారుల నిర్మాణo, అనుమతుల జారీ, నూతన ప్రతిపా దనలకు ఆమోదం తదితర అంశా లపై ప్రత్యేక దృష్టి సారించిన ము ఖ్యమంత్రి జాతీయ రహదారుల ప్రా ధికార సంస్థ (NHAI), జాతీయ ర హదారుల విభాగం (NH), జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రి త్వ శాఖ (MoRTH), రహ దారు లు, భవనాల శాఖ (R&B, అ టవీ శాఖ అధికారులతో డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
జాతీయ రహదారులకు నెంబర్ల కే టాయింపు, సూత్రప్రాయ అంగీకా రం తెలుపుతున్నా, తర్వాత ప్రక్రి యలో జరుగుతున్న జాప్యంపై ము ఖ్యమంత్రి ఆరా తీశారు. చిన్న చిన్న కారణాలతో పలు రహదారుల ప నుల్లో జాప్యం జరగొద్దని, అలాంటి సమస్యలను పరిష్కరించాలని సూ చించారు. భూ సేకరణను పూర్తి చే యడమే కాకుండా పరిహారం తక్షణ మే అందేలా చూడాలని చెప్పారు.
రీజినల్ రింగు రోడ్డు (RRR) ఉత్తర భాగం నిర్మాణానికి సంబంధించి కేం ద్రం లేవనెత్తిన ప్రతి సందేహాలను ని వృత్తి చేస్తున్నప్పటికీ కొత్త సమస్య లను ఎందుకు లేవనెత్తుతున్నారని ఎన్హెచ్ఏఐ అధికారులను ముఖ్య మంత్రి ప్రశ్నించారు. సందేహాలన్నిం టిని ఒకేసారి పంపాలని కోరినప్పు డు, ఎటువంటి సందేహాలు లేవని, ఏవైనా ఉంటే వెంటనే పంపుతామ ని ఎన్హెచ్ఏఐ అధికారులు తెలి పారు.
ఆర్ఆర్ఆర్ దక్షిణ, ఉత్తర భాగాలు రెండు వేర్వురు ప్రాజెక్టులుగా చూ డొద్దు. సౌత్‌కు కూడా నార్త్‌కు ఇచ్చి న నెంబర్‌ను కొనసాగించాలి. వెం టనే అనుమతులు మంజూరు చేసి ఏకకాలంలో రెండింటి పనులు ప్రా రంభమయ్యేందుకు ఎన్హెచ్ఏఐ సహకరించాలి. ఆర్ఆర్ఆర్ సౌత్ అలైన్‌మెంట్‌కు వెంటనే ఆమోద ముద్ర వేయాలి.భారత్ ఫ్యూచర్ సిటీ – అమరావతి – మచిలీపట్నం 12 వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవేకు వెంట నే అనుమతులు ఇవ్వాలి. భారత్ ఫ్యూచర్ సిటీలో తాము డ్రైపోర్ట్, లాజిస్టిక్ పార్క్, ఇండస్ట్రియల్ పా ర్క్ ఏర్పాటు చేస్తాం.ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేతో రెండురాష్ట్రాల రాజధాను ల మధ్య అనుసంధానం ఏర్పడడం తో సరకు రవాణా, ప్రయాణికులకు ఎంతగానో సౌకర్యవంతంగా ఉం టుంది. హైదరాబాద్, విజయవాడ ల మ ధ్య 70 కి.మీ దూరం తగ్గడం తో పాటు సరుకు రవాణాతో దేశం లో మరే జాతీయ రహదారిపై లేనం త రద్దీ, ఆదాయం ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే తో ఏర్పడుతుంది. ఈ రహదారికి స మాంతరంగా తాము రైలు మార్గం అడుగుతున్నాం, బెంగళూర్ – శం షాబాద్ ఎయిర్పోర్ట్ -అమరావతి మధ్య రైలు మార్గం అవసరం. వం దేభారత్ సహా ఇతర రైళ్ల రాకపోక లకు ఇది అనువుగా ఉండటమే కా కుండా లాభసాటిగా ఉంటుంది.
హైదరాబాద్ – శ్రీశైలం మార్గంలో రా విర్యాల – మన్ననూర్‌కు సంబం ధిం చి ఎలివేటెడ్ కారిడార్‌కు వెంటనే అ నుమతులు ఇవ్వాలి. శ్రీశైలం దేవ స్థానం, శ్రీశైలం రిజర్వాయర్, టైగర్ ఫారెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తు లు రాకపోకలు సాగిస్తారని వివరిం చారు. హైదరాబాద్ – మన్నెగూడ ర హదారిలో మర్రి చెట్ల తొలగింపున కు సంబంధించి ఎన్జీటీలో ఉన్న కే సు పరిష్కారానికి సత్వరమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్యలు తీసుకోవాలి.హైదరాబాద్-మంచిర్యాల – నాగ్‌పూర్ నూతన రహదా రికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇ ప్పటికే సమర్పించిన ప్రతిపాదనల ను ఎన్హెచ్ఏఐ అంగీకరించాలి.
మంచిర్యాల – వరంగల్ – ఖమ్మం – విజయవాడ జాతీయ రహదారి (NH-163G), ఆర్మూర్ – జగిత్యాల – మంచిర్యాల (NH-63), జగిత్యాల – కరీంనగర్ (MH-563), మహబూ బ్‌నగర్ – మరికల్ – దియోసుగూర్ (NH-167) రహదారులకు సంబం ధించి భూ సేకరణ, పరిహారం పంపి ణీలో జాప్యంపై ఆయా జిల్లాల కలె క్టర్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
అన్ని జిల్లాల్లో ఉన్న కేసులన్నింటిపై నివేదిక రూపొందించి వారంలోపు అడ్వకేట్ జనరల్‌తో చర్చించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని ఆదేశించారు. ఈ విషయంలో ఏ మాత్రం జాప్యాన్ని సహించమని సీ ఎం కలెక్టర్లను హెచ్చరించారు. భూ సేకరణ, పరిహారం పంపిణీని అక్టో బరు నెలాఖరుకు కచ్చితంగా పూర్తి చేయాల్సిందేనని కలెక్టర్లను ఆదేశిం చారు. భూ సేకరణ, పరిహారం నిర్ణ యం, పంపిణీ విషయంలో అలస త్వం చూపే కలెక్టర్లు, ఆర్డీవోలు, త హశీల్దార్లపై వేటు వేస్తామని హెచ్చ రించారు.జాతీయ రహదారుల ని ర్మాణంలో అటవీ, పర్యావరణ శాఖ నుంచి ఎదురవుతున్న ఇబ్బం దుల పైనా సీఎం సమీక్షించారు. అవసర మైనచోట ప్రత్యామ్నాయ భూమిని అటవీ పెంపకానికి ఇస్తామని తెలి పారు. ఈ విషయంలో అవసర మై తే జాతీయ రహదారుల శాఖ మం త్రి నితిన్ గడ్కరీని, కేంద్ర అటవీ, ప ర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ లతో స్వయంగా కలిసి మాట్లాడుతానని చెప్పారు.
ఈ సమావేశంలో మంత్రి కోమటిరె డ్డి వెంకట్ రెడ్డి, ముఖ్యమంత్రి సల హాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే, కేంద్ర ప్రభు త్వ ప్రత్యేక కార్యదర్శి వినయ్ కు మార్ రజావత్, ఎన్హెచ్ఏఐ స భ్యుడు (ప్రాజెక్ట్స్) అనిల్ చౌదరి, MoRTH రీజినల్ ఆఫీసర్ కృష్ణ ప్ర సాద్, ఎన్హెచ్ఏఐ రీజినల్ ఆఫీ స ర్ శివశంకర్ పాల్గొన్నారు.