— సీఎం సిద్ధరామయ్య మెడకు ముడా కుంభకోణం
–సమగ్ర విచారణకు గవర్నర్ అను మతి
–న్యాయస్థానంలో సవాల్ చేస్తా మన్న సిఎం సిద్ధరామయ్య
–రాజ్ భవన్ రాజకీయ కేంద్రంగా మార్చారంటూ కాంగ్రెస్ ఆగ్రహం
CM Siddaramaiah: ప్రజా దీవెన, బెంగుళూరు : కర్ణాటక రాజకీయాల్లో మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) కుం భకోణం కలకలం సృష్టిస్తోంది. ము డా లేఅవుట్ స్కామ్ లో కర్నాటక సీఎం సిద్ధరామయ్యను (CM Siddaramaiah) విచారించ నున్నారు. ఈ 8 అవినీతి కేసులో సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ థావర్ చాంద్ గెహ్లాట్ ఆదే శాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముడా లేఅవుట్ లో సీఎం సిద్ద రామయ్యఆయన భార్య పార్వతికి ఖరీదైన ప్లాట్లను ఇచ్చినట్లు ఆరో పణలు ఉన్నాయి. ముడా లేఅవుట్ లో ఎలా ఆమె ఓనర్ అయ్యారని ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. విచా రణ కోసం గవర్నర్ గెహ్లాట్ అనుమ తి ఇవ్వడంతో సిద్ధరామయ్యపై కే సు నమోదయ్యే అవకాశాలు ఉ న్నాయి. సామాజిక కార్యకర్తలు ప్రదీ ప్ కుమార్, టీజే అబ్రహం, స్నేహమ యి కృష్ణ అభ్యర్థనల మేరకు గవర్న ర్ విచారణ కోసం ఆదేశాలు ఇచ్చా రు.
భారతీయ నాగరికా సురక్షా సంహి తలోని సెక్షన్ 17, సెక్షన్ 218 కింద విచారణకు గవర్నర్ (Governor) అనుమ తి ఇచ్చారు. గవర్నర్ ఆదేశాలతో సీఎం సిద్ధరామయ్యకు రాజకీయం గా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర వుతున్నాయి. ఈ కేసులో సీఎం విచారణను ఎదుర్కోనుండటం ప్రభుత్వానికి సైతం సమస్యగా మారనుంది. ఇటీవలే ముడా వివా దంపై ఏడు రోజుల్లోగా సమా ధానం ఇవ్వాలని, ఎందుకు విచారణకు ఆదేశించకూడదో తెలపాలని ఆదే శిస్తూ గవర్నర్ జూలై నెలలో సీఎం సిద్ధరామయ్యకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. దీనిపై విచారణకు అను మతించవద్దని రాష్ట్ర మంత్రి వర్గం తీర్మానం చేసింది. అలాగే ఆ నోటీ సుల్ని గవర్నర్ వెనక్కి తీసుకోవాల ని కోరింది. ఇది గవర్నర్ పదవిని దుర్వినియోగం చేయడం కిందికే వస్తుందని ప్రభుత్వం ఆరోపించింది. కేబినెట్ తీర్మానం పట్టించు కోని గవర్నర్ థావర్ చాంద్ గెహ్లాట్ విచారణకు అను మతి ఇచ్చారు.
కర్ణాటక మంత్రివర్గం అత్యవ సమావేశం. ముడా స్కామ్లో సీఎం సిద్దరామయ్య (CM Siddaramaiah) ప్రాసిక్యూషన్ కు గ వర్నర్ అనుమతి ఇవ్వడంపై కాంగ్రె స్ పార్టీ మండిపడింది. రాజభవన్ను రాజకీయ కేంద్రంగా మార్చేశారం టూ కాంగ్రెస్ ఆరోపణలు చేస్తుంది. తన ప్రభు త్వాన్ని కుప్పకూల్చడాని కి బీజేపీ ప్రయత్నిస్తుందని సిద్ధ రామయ్య (CM Siddaramaiah) ఆరోపిస్తున్నారు. గవర్న ర్ ఆదేశాలను కోర్టులో సవాల్ చేస్తా మని సీఎం సిద్దరామయ్య ప్రకటిం చారు. తాజా పరిణామాలపై చర్చిం చేందుకు శని వారం సాయంత్రం సిద్ధరామయ్య కేబినెట్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకుంది. అటు కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జు న్ ఖర్గే సైతం కర్ణాటక చేరు కున్నా రు.
ముడాపై వివాదం కథాకమీ షు ..ముడా కుంభకోణంలో సిద్ధూ సతీమణి పార్వతితో పాటు మరి కొందరి ప్రమేయం ఉందని ఆరోపి స్తూ సామాజిక కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ముడా భూసే కరణలో భాగంగా 50:50పరిహారం ప్రక టించింది. ఎకరం తీసుకుంటే అర ఎకరం అభివృద్ధి చెందిన భూ మి ఇస్తారు. లేదంటే ఆర్థిక ప్యాకేజీ ఎంచుకో వచ్చు. ముడా భూసేకరణ పరిహారంలో సిద్ధరామయ్య, ఆయ న సతీమణి, ఇతర అధికారులు అక్రమాలకు పాల్ప డ్డారని సామా జిక కార్యకర్తలు, బీజేపీ ఆరోపించిం ది. మైసూరులోని కెసరె గ్రామంలో సిద్ధరామయ్య సతీమణికి మూడు ఎకరాల భూమి ఉండగా, ఆ భూ మిని ఆమె సోదరుడు ఆమెకు కానుకగా ఇచ్చారు. అయితే అభి వృద్ధి పనుల్లో భాగంగా ‘ముడా’ దానిని స్వాదీనం చేసుకుంది. పరి హారంగా 2021లో విజయనగర ప్రాంతంలో 38,283 చదరపు అడుగుల ప్లాట్లను కేటాయించింది. కెసరెలోని భూమితో పోలిస్తే.. విజ యనగరలో భూమి మార్కెట్ (markrt) ధర చాలా ఎక్కువగా ఉంది. అదే బీజేపీ విమర్శ లకు కారణమైంది. దీనిపై గతంలో సిద్ధరామయ్య మాట్లా డుతూ తనకు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ కుట్ర పన్నిందని దుయ్యబట్టారు. తమ భూమిని ముడా అక్రమంగా తీసు కుందన్నారు. తన సతీమణి పరి హారానికి అర్హురాలని అన్నారు. 2014లో తాను ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో ఆమె పరిహారం కోసం దర ఖాస్తు చేసుకుందని గుర్తు చేశారు. అయితే తాను సీఎంగా ఉన్నంతకాలం ఆ పరిహారం ఇవ్వ డం కుదర దని చెప్పానన్నారు. దాంతో 2021లో మరో దరఖాస్తు చేసుకోగా అప్పటి బీజేపీ ప్రభుత్వం విజయనగరలో భూమి కేటాయిం చిందని వెల్లడించారు.