Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Cmrevathreddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ హస్తిన పర్యటన క్యాన్సల్

బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ హస్తిన పర్యటన క్యాన్సల్

Cmrevathreddy:  ప్రజా దీవెన హైదరాబాద్: తెలంగాణ ము ఖ్యమంత్రి ఎనుముల రే వం త్ రెడ్డి హస్తిన పర్యటన అకస్మా త్తుగా రద్దయ్యింది. ఆయనతో స హా పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు శ‌నివారం రాత్రికే ఢిల్లీకి చే రుకోవాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల ఆ పర్యటన రద్ద యింది. ఢిల్లీలో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కె.సి. వేణుగోపాల్ అందు బాటులో లేక పోవడంతో పర్యటన రద్దు అయి నట్టు సమాచారం.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో ఇవ్వాళ ఉద‌యం కె.సి. వేణుగోపాల్ చరవ మాట్లాడ ను న్నారు. నేటి ఉదయం 11 గం టలకు ఫోన్ కాల్ లో చర్చలు జరు గనున్నాయి. ఈ నెల 10న ఎమ్మె ల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నా మినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాను న్న నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం రేపు ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల తుది జా బితా ఖ‌రారు చేసే అవ‌కాశం ఉం దని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఇప్పటికే పార్టీలో పలువురు సీని యర్ నేతల తో ఏఐసీసీ ఇంచార్జీ మీనాక్షి నట రాజన్, టీపీ సీసీ చీఫ్ మహేశ్ కుమా ర్ చర్చలు జరిపా రు.ఎవరెవరికి ఏ పదవులు కావా లో వారినే అడి గి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవులకు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే.