Praja Deveena
Newspaper Banner
Date of Publish : 29 April 2026, 12:21 pm Posted by : praja deveena

Collector Chandrasekhar : కలెక్టర్ చంద్రశేఖర్ కీలక ఆదేశాలు, కేంద్రాల్లో వర్షాలకు దాన్యం తడవ కుండా ముందు జాగ్రత్త చర్యలు తీ సుకోవాలి 

Collector Chandrasekhar : ప్రజా దీవెన, నల్లగొండ: వర్షానికి కొనుగోలు కేంద్రాలలో దా న్యం తడవకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలె క్ట ర్ బి. చంద్రశేఖర్ కొనుగోలు కేంద్రం నిర్వాహకులను ఆదేశించారు.వర్ష సూచనను దృష్టిలో ఉంచుకొని కొ నుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు పంపించాలని చెప్పారు. వర్షం వస్తే ధాన్యం తడవకుండా కొ నుగోలు కేంద్రాలలో టార్పాలిన్లు క ప్పి ఉంచాలని అదేవిధంగా ధా న్యం కొన్న తర్వాత మిల్లులకు తీ సుకువెళ్లే లారీలు, వాహనాలపై కూడా టార్పాలిన్లు కప్పి ఉంచాల ని చెప్పారు. బుధవారం ఆయన క లెక్టర్ కార్యాలయం నుండి రెవి న్యూ డివిజనల్ అధికారులు, త హసిల్దారులు, మండల స్థాయి అ ధికారులతో పలు అంశాలపై వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓ టరు జాబితా ప్రత్యేక సమగ్ర సవర ణలో భాగంగా ఇప్పటివరకు 50 శాతానికి మించని మండలాలు గు రువారంలోగా 50 శాతం చేరుకోవా లన్నారు. అలాగే 50 నుండి 70 శా తం మధ్య ఉన్న మండలాలు వేగం పెంచాలని చెప్పారు.

పెట్రోల్, డీజిల్ పై సమీక్షిస్తూ ఎక్క డ “నో” స్టాక్ బోర్డు పెట్టకుండా చూ డాలని , తహసిల్దార్లు వారి పరిధి లోని పెట్రోల్ బంకులను తనిఖీ చే సి అనవసరంగా ఎక్కువ మొత్తం లో ఎవరు పెట్రోల్ కొనకుండా చూ డాలని చెప్పారు.సాదా బైనామా దరఖాస్తులను సాధ్యమైనంత త్వ రగా పరిష్కరించాలని, తహసిల్దార్ స్థాయిలో ఉన్న అన్ని దరఖాస్తులు ఆర్డీవో లాగిన్ కి రావాలని, ఆర్డీవో లు ప్రతిరోజు రెండు, మూడు మం డలాలను సమీక్షించాలని,ఈ అం శంపై త్వరలోనే రాష్ట్ర రెవెన్యూ శా ఖ మంత్రి సమక్షించనున్న దృష్ట్యా దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేయాలన్నారు.

దరఖాస్తులను పూర్తిగా చదివిన త ర్వాత పరిష్కారం చేయాలని, అన వసరంగా తిరస్కరించవద్దని,రాష్ట్ర ప్రభుత్వం సాదాబైనామ దరఖాస్తు ల పరిష్కారానికి ఇదిచివరి అవకా శమని, పట్టాదారుకు మేలు జరిగే విధంగా తహసిల్దార్లు చూడాలని, సాదాబైనామ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ దరఖాస్తుల పు రోగతిపై వివరించారు.