District Collector Ila Tripathi : ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా త నిఖీ , స్టోర్ రూమ్, వంటగది పరిశీ లన
District Collector Ila Tripathi : ప్రజా దీవెన, పెద్దవూర: చదువు ద్వారానే అన్ని సాధ్యమవు తా య ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నా రు. గురువారం ఆమె నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రం లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలను ఆక స్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల స్టోర్ రూమ్ ను వంటగదిని పరిస రాలను పరిశీలించారు. అనంతరం భోజనం చేస్తున్న విద్యార్థులతో ఆమె ముఖాముఖి మాట్లాడారు.
విద్యార్థినులు బాగా చదువుకో వాల ని, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తారని, తల్లిదండ్రు ల కష్టానికి తగ్గట్టుగా విద్యార్థినిలు సైతం బాగా చదివితే భవిష్యత్తులో సమాజంలో మంచి స్థానంలో ఉంటా రని, చదువుతోనే అన్ని సాధ్యమవుతాయని అన్నా రు. ఇంగ్లీషు భాషపై పట్టు సాధించా లని, ఇంగ్లీష్ పై ప్రత్యేక దృష్టి కేంద్రీ కరించాలని, ఇంగ్లీష్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా రాణిం చవచ్చని అన్నారు. ఆరోగ్యానికి పౌష్టికాహారం తీసుకోవాలని, తప్ప నిసరిగా గుడ్లు తినాలని అన్నారు.
మినీ గురుకులానికి అప్రోచ్ రోడ్డు కావాలని కోరగా మంజూరు చేశా రు. అంతేకాక విద్యార్థులకు ఆట వస్తువులను మంజూరు చేశారు.
అంతకు ముందు జిల్లా కలెక్టర్ పెద్దవూర ఎంపీడీవో కార్యాలయం లో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద చేపట్టిన గృహ నిర్మాణం పై సమీక్ష నిర్వహించారు. శనివారం నాటికి పి ఎం ఆవాస్ యోజన కింద 30% గ్రౌండింగ్ ను పూర్తిచేయాలని ఆదేశించారు.
ఆ తర్వాత జిల్లా కలెక్టర్ చలకుర్తి జవహర్ నవోదయ విద్యాలయను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడి విద్యార్థులకు అందిస్తున్న భోజన ము, విద్య, తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. బాగా చదవడం ద్వారా ఇంటర్మీడియట్ తర్వాత నీట్ వంటి పోటీ పరీక్ష లలో మంచి ర్యాంకులు సాధించవ చ్చని, అలాగే స్పెషలైజేషన్ కోర్సుల లో మంచి మార్కులు సాధిస్తే ఆ సబ్జెక్టులో సైతం బాగా రాణించ వచ్చ ని విద్యార్థులకు సూచించా రు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లైబ్రరీ ని పరిశీలించారు .జిల్లా కలెక్టర్ వెంట గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, పెద్దవూర తహసిల్దార్ శాంతి లాల్, ఎంపీడీవో ఉమాదేవి, ఎంఈఓ రాము, ఆర్ ఐ శ్రీనివాస రెడ్డి, పాఠశాలల ప్రిన్సిపా ల్స్ , పంచాయతీ కార్యదర్శులు, తదితరులు ఉన్నారు.