Collector Ila Tripathi: నల్లగొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో క లెక్టర్ త్రిపాఠి ఆకస్మిక తనిఖీ, వైద్య సేవల గురించి ఆరా
Collector Ila Tripathi: ప్రజా దీవెన, నల్లగొండ: నల్గొండ ప్ర భుత్వ ప్రధానాస్పత్రి ద్వా రా ప్రజల కు మెరుగైన వైద్య సేవలు అందిం చాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. ఆదివారం ఆమె ప్ర భు త్వ ప్రధాన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.క్యాజువాలిటీ, ఐ సీ యూ, ఏ ఎం సి యు,సర్జికల్ వార్డు, మెడికల్ వార్డ్, రేడియాలజీ, త ది తర విభాగాలను తనిఖీచేసి డా క్ట ర్లు, నర్సులతో మాట్లాడి ఆసుపత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవల పై ఆరా తీశారు. ఐసీయూ, రేడియాల జీ, తదితర విభాగాలలో ఎంత మం ది పేషెంట్స్ ఉన్నారని ఐసియులో ఎన్ని బెడ్లు ఉన్నాయని అడిగి తె లుసుకున్నారు.
సీజనల్ వ్యాధులతో ప్రధాన ఆస్ప త్రికి వస్తున్న వారి వివరాలను సైతం జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నా రు. రేడియాలజీ విభాగం ద్వారా రో గులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రేడియాలజీ విభాగం దూరంగా ఉన్నందున నడవలేని పే షెంట్లకు మొబైల్ ఎక్స్ రే యూనిట్ ద్వారా ఎక్స్ రే తీయించడం జరు గుతుందని, నడవగలిగే వారిని వీ ల్ చైర్ మీద రేడియాలజీ కి తీసుకె ళ్తున్నట్లు డాక్టర్లు తెలిపారు. అన్ని విభాగాలు పరిశీలించిన తర్వాత మందులు, వైద్య సేవలు, టెస్టులు, ఇతర పరీక్షల పై జిల్లా కలెక్టర్ సం తృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడు తూ ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో అవ సరమైన అన్ని వైద్య పరికరాలు, సే వలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసు కోవాలని కోరారు .ప్రత్యేకించి నిరం తర వర్షాల వలన సీజనల్ వ్యాధు లతో ఎక్కువమంది ఆసుపత్రికి వ స్తున్నారని, వారందరికీ తగిన వైద్య చికిత్సలు అందించేలా డాక్టర్లు, సి బ్బంది, నర్సులు అందుబాటులో ఉండాలని, మందులు ఇతర ఏవై నా సమస్యలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాల్సిందిగా ఆమె ఆదేశాలు జారీ చేశారు. అలాగే ప రీక్షల నిర్వహణలో సైతం ఎలాంటి నిర్లక్ష్యం,ఇబ్బంది లేకుండా రోగుల కు అవసరమైన అన్ని పరీక్షలుని ర్వహించాలని చెప్పారు.
డిప్యూటీ సూపరింటిండెంట్ డాక్టర్ శ్రీకాంత్ వర్మ, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఈశ్వర్ ,ఆర్ ఎం ఓ కిరణ్ కు మార్, టి ఎస్ ఎం ఐడిసి రాజశేఖ ర్, జితేందర్ తదితరులు ఉన్నారు.