Collecter Ila Thipathi : ప్రజా దీవెన, నల్లగొండ: యూరియా ను వ్యవసాయ పనులకు కాకుండా ఇతర పనులకు దారిమళ్లిస్తే సంబం ధిత ఎరువుల దుకాణం యజమా నితోపాటు , సంబంధితుల పై క్రిమి నల్ కేసులు ( Criminal Cases es) నమోదు చేస్తామని జిల్లా కలెక్ట ర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. న ల్గొండ జిల్లాలో ఎరువులకు ఎలాం టి కొరతలేదని స్పష్టం చేశారు. మం గళవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యా లయంలో ఎరువుల పై ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన “ఎరువుల ఫిర్యా దుల కేంద్రాన్ని” ,టోల్ ఫ్రీ నెంబర్ (1 8004251442 )ను ప్రారంభించా రు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ (Co llecter Ila Thipathi) మా ట్లాడు తూ ఆగస్టు మొదటి వారంలో నా గార్జునసాగర్, మిర్యాలగూడ ని యోజకవర్గాలకు సాగునీరు వస్తు న్నప్పటికీ, అలాగే జిల్లా వ్యాప్తం గా ముమ్మర వ్యవసాయ సాగు,వి త్త నాలు ,నాట్లు వేసే సమయంలో సై తం అవసరమైనన్ని ఎరువులను ( pesticides) సరఫరా చేసేందు కు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉం దని తెలిపారు.
ఎరువులకు ఎవరూ కంగారు పడా ల్సిన పని లేదని అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు ఎరువులను అం దుబాటులో ఉంచడం జరిగింద ని ,ఎవరికైనా ఎరువులకు సంబం ధించి ఇబ్బంది ఉంటే ప్రత్యేకంగా ఎరువుల పై జిల్లా కలెక్టర్ కార్యాల యంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 18004251442 కు ఫోన్ చేయాలని తెలిపారు.
ఒకేసారి 30 లేదా 40 బస్తాల ఎరు వులను తీసుకువెళ్లే వారి పై చర్య తీసుకుంటామన్నారు.ఎరువుల ప ర్యవేక్షణకై ప్రతి మండలానికి ఒక ప్ర త్యేక అధికారిని నియమించడం జరిగిందని, తహసిల్దారులు, మండ ల వ్యవసాయ అధికారులు ఎరు వుల దుకాణాలను క్రమం తప్పకుం డా తనిఖీ చేయాలని ఆదేశించారు. మిర్యాలగూడ ఎరువుల గోదాము ను ఎప్పటికప్పుడు తాము సందర్శి స్తున్నామని , ఈ నెలాఖరులోగా జి ల్లాకు 3000 మెట్రిక్ టన్నుల యూ రియా రానున్నదని స్పష్టం చేశారు.
ఎరువుల దుకాణం యజమానులు దుకాణం ముందు తప్పనిసరిగా ఎ రువుల నిల్వలపై బోర్డులను ఏర్పా టు చేయాలని ,అందరికీ తెలిసే వి ధంగా ఎరువుల వివరాలు ప్రదర్శిం చాలని, ఏరోజుకారోజు ఎరువుల స్టాక్ వివరాలను అబోర్డుపై నమో దు చేయాలని చెప్పారు.ఎవరైనా ఎరువుల విషయంలో అక్రమాలకు పాటుపడితే కఠిన చర్యలు తప్పవ ని హెచ్చరించారు.మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారా యణ అమిత్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివా స్,జిల్లా వ్యవసాయ అధికారి శ్రవ ణ్, కలెక్టర్ కార్యాలయ ఏవో మోతి లాల్, తదితరులు ఉన్నారు.