— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Collector Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: వరంగల్- ఖమ్మం -నల్గొండ ఉపాధ్యాయ ఎ మ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఏలాంటి పొరపాట్లకు తావు ఇవ్వ కుండా నిర్వహించాలని జిల్లా కలెక్ట ర్, వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇలా త్రిపాఠి ఆదేశించారు.
శనివారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ఉన్న ఆర్జాలభావి వేర్ హౌసింగ్ గోదాములో ఏర్పాటుచేసిన ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు నియమించిన అధికారులు, సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఓట్ల లెక్కింపు కు నియమించిన సిబ్బంది కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుండి చివరి వరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా ఫామ్- 16 సరిపోల్చుకోవటం , బ్యాలెట్ బాక్స్ లను అభ్యర్థులు, వారి ఏజెంట్ల ఎదురుగా సీలు తీయడం, సంబంధిత ఫారాలలో సంతకం చేయడం వంటి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు . ఓట్లు చెల్లని ఓట్లు విషయంలో సందేహాలు వచ్చినట్లయితే ఏ ఆర్ ఓ లేదా రిటర్నింగ్ ఆఫీసర్ టేబుల్ దగ్గర నివృత్తి చేసుకోవాలని, అలాగే మొదటి ప్రాధాన్యత ఓటు విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
జాయింట్ కలెక్టర్ ,వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల అసిస్టెంట్ రిటర్నింగ్, ఏఆర్ఓ జె. శ్రీనివాస్ మాట్లాడుతూ కౌంటింగ్ ప్రారంభమైనది మొదలు కౌంటింగ్ పూర్తయ్యే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయా సిబ్బంది నిర్వహించాల్సిన విధులపై కులంకషంగా తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమానికి మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారా యణ అమిత్, ఇన్చార్జి డిఆర్ఓ అశోక్ రెడ్డి, ఆర్డీవోలు రమణారెడ్డి, శ్రీదేవి, స్ట్రాంగ్ రూమ్ ఇన్చార్జులు, రో ఆఫీసర్లు, అసిస్టెం ట్ రో ఆఫీస ర్లు , డ్రం ఇన్చార్జులు, పీజియన్ హోల్ ఇన్చార్జిలు, రిపోర్టింగ్ ఆఫీ సర్లు తదితరులు ఉన్నారు.