Collector Tripathi : ప్రజా దీవెన నల్లగొండ: నల్లగొండ జిల్లాలో మే 4న నిర్వహించనున్న నీట్ ప్రవేశ పరీక్షకు పరీక్ష కేంద్రాల ఏర్పాటు విషయమై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని పలు పాఠ శాల లను పరిశీలించారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి వద్ద ఉన్న విప స్య పాఠశాల ,అలాగే మీర్ బాగ్ కా లనీలో ఉన్న నల్గొండ పబ్లిక్ పాఠ శాలల్లో నీట్ పరీక్ష కేంద్రాల ఏర్పా టు కై మౌలిక వసతులను సం బంధిత అధికారులతో కలిసి పరి శీలించారు.
కాగా నల్గొండ జిల్లాలో 5 నీట్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనుండగా , ఈ పరీక్ష కేంద్రాల లో నీట్ అభ్యర్థులు పరీక్షలు రాసేం దుకు అవసరమైన టేబుల్లు, వెంటి లేషన్, టాయిలెట్లు, తదితర మౌలి క సదుపాయాలను జిల్లా కలెక్టర్ పరిశీలించగా, పట్టణంలోని ఎస్ పి ఆర్, నారాయణ ,అరబిందో తది తర పాఠశాలలను సైతం పరిశీ లించాలని ఆర్ డి ఓ ను ఆమె ఆదే శించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వై.అశోక్ రెడ్డి పై మూడు పాఠశాలలను తనిఖీ చేసి అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. నల్గొండ ఆర్ డి ఓ వై. అశోక్ రెడ్డి, డిఇఓ బిక్షపతి, నీట్ పరీక్షల లైజనింగ్ ఆఫీసర్ పార్థసారథి, తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.