Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Communist Party Public Issues :ప్రజా సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టు పార్టీ నిరంతర కృషి చేస్తుంది: వెంకటేశ్వర్లు

Communist Party Public Issues :ప్రజా దీవెన, కోదాడ: ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ వారికి అండగా భారత కమ్యూనిస్టు పార్టీ నిరంతరం కృషి చేస్తుందని సిపిఐ సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు కోదాడ మున్సిపల్ పరిధిలోని స్థానిక తమ్మర బండ పాలెం లో గల కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి అపార్ట్మెంట్స్ లో అనంతగిరి మండల మహాసభను డేగ ఈరన్న బాణాల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జూన్ 9వ తారీకు జరిగే కమ్యూనిస్టు పార్టీ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు కమ్యూనిస్టు పార్టీ ప్రజా సమస్యలను పరిష్కారానికి పేద ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహిస్తుందని తెలిపారు గ్రామాలలో పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అలాగే రానున్న స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రభుత్వం అందిస్తున్న సమక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అధికారులు ప్రజాప్రతినిధులు అందే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు అనంతరం అనంతగిరి మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సిపిఐ మండల కార్యదర్శిగా ఎరసాని రవి ,సహాయ కార్యదర్శులుగా డేగ ఈరన్న, షేక్ లాల్ 15 మంది సభ్యులతో నూతన‌ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో బద్దం కృష్ణారెడ్డి బత్తినేని హనుమంతరావు పోతురాజు సత్యనారాయణ వీరబాబు తదితరులు పాల్గొన్నారు