Collector Ila Tripathi : నామినేషన్ల పరిశీలనలో పూర్తి పారదర్శకత
–నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి Collector Ila Tripathi : ప్రజా దీవెన,నల్లగొండ : గ్రామపంచాయతీ ఎన్నికల్లో నామి నేషన్ పత్రాల పరిశీలనను నిబంధ నలకు అనుగుణంగా, పూర్తిస్థాయి పారదర్శకంగా నిర్వహించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. బుధ వారం ఆమె నిడమనూరు, ముకుం దాపురం గ్రామపంచాయతీలలో నా మినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయి, ఎన్ని తిరస్కరించ బడ్డాయి అనే వివరాలను బాధ్యులై న అధికారులను అడిగి తెలుసుకు న్నారు....