–కారు దిగిన దండే విఠల్, భానుప్ర సాద్, దయానంద్, ప్రభాకర్‌రావు, మల్లేశం, సారయ్యలు
–సిఎం రేవంత్ రెడ్డి నివాసంలో అర్ధరాత్రి తర్వాత పార్టీ మారిన నేతలు
–శాసన మండలిలో 12కు పెరిగిన కాంగ్రెస్ బలం
Congress: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో పదేళ్లు పరిపాలించిన బిఆర్ఎస్ పార్టీ (BRS party)ప్రస్తుతం గడ్డుపరిస్థితి ఎదు ర్కొంటుందని చెప్పాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ (Congress party)అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే లు ఒక్కొక్కరుగా జారిపోతుండగా తాజాగా ఎమ్మెల్సీల వంతైంది. ఈ పరిస్థితుల్లో బీఆ ర్‌ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా ‘కారు’ దిగి పోతున్నారు. హస్తం గూటికి చేరు తున్నారు. గురువారం అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. దండే విఠల్, భానుప్రసాద్, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్‌రావు, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్యలు (Dande Vitthal, Bhanu Prasad, Buggarapu Dayanand, Prabhakar Rao, Egge Mallesham, Baswaraju Saraiyalu)అధికార పార్టీలో చేరారు. వీరంతా గురువారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆయన ఢిల్లీ నుంచి రావాల్సిన విమానం ఆలస్యమైంది.
అర్ధరాత్రి దాటింది. అప్పటి వరకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ లు (BRS MLC) రేవంత్ (Revanth)నివాసంలోనే ఉన్నారు. ఢిల్లీ నుంచి రాగానే ఆయనతో భేటీ అయ్యారు. ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల చేరికతో శాసనమండ లిలో కాంగ్రెస్ బలం 12కు చేరింది. మండలిలో కూడా ఆధిక్యం కోసం కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోం ది. అందులో భాగంగానే బీఆర్‌ఎస్ సభ్యులను ఆకర్షిస్తోంది. గతంలో రాజకీయ పునరేకీకరణ అంటూ కేసీఆర్ చూపిన బాటలోనే ఇప్పు డు రేవంత్ కూడా పయనిస్తు న్నారు. తన ప్రభుత్వానికి ఢోకా లేకుండా ఏర్పాట్లు చేసుకుంటు న్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌కు Operation Akarsh)శ్రీకారం చుట్టారు. శాసనమండలిలో మొ త్తం సభ్యుల సంఖ్య 40 కాగా, 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్‌కు ప్రస్తుతం ఆరుగురు సభ్యులున్నా రు. గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న ఇద్దరు సభ్యులు కూడా అధికార కాంగ్రెస్ తరఫునే ఉంటారు. మొత్తం 8 మంది అవుతారు. తాజాగా ఆరు గురు చేరడంతో కాంగ్రెస్ బలం 14 కు చేరుతుంది. అవసరమైన ప్పు డు వామపక్ష టీచర్ ఎమ్మెల్సీ మద్ద తు కూడా కాంగ్రెస్‌కే ఉండే అవ కాశం ఉంది. ఇక కాంగ్రెస్‌కు మరో ఐదారు సీట్లు ఉంటే మెజారిటీ దక్కు తుంది. బీజేపీకి ఇద్దరు సభ్యులు ఉన్నారు. వీరు బీఆర్ ఎస్‌తో కలిసి పనిచేసే అవకాశం లేదు. అప్పుడు కీలక బిల్లుల విషయంలో రేవంత్(revanth) సర్కారుకు ఊరట లభించనుంది.