Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kaleshwaram project : కాళేశ్వరంపై కాంగ్రెస్,బిజెపిల కుట్ర లో భాగమే సిబిఐ విచారణ

–వారి కుట్రలను ప్రజలు, రైతులు నిశితoగా గమనిస్తున్నారు

–కుట్రలు, కుయుక్తులకు బిఆర్ఎస్ ఎంతమాత్రం అదరదు, బెదరదు

–తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు

డాక్టర్ గాదరి కిషోర్ కుమార్

Kaleshwaram project :  ప్రజా దీవెన, తుంగతుర్తి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రంలోని బిజెపితో మిలాఖతై కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరి గిందoటూ సిబిఐ విచారణ కోరడం బిజెపి, కాంగ్రెస్ కుట్రలో భాగమేనని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరికిషోర్ కుమార్ ధ్వజమెత్తారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తె లంగాణ తల్లి చౌరస్తాలో రేవంత్ రె డ్డి చేస్తున్న తప్పుడు ఆరోపణలు బిజెపితో కుమ్మక్కై చేస్తున్న కుట్రల ను నిరసిస్తూ గోదావరి జిల్లాలతో తె లంగాణ తల్లి విగ్రహానికి అభిషేకం చేసి నిరసన ధర్నా నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడా రు.

తుంగతుర్తి ప్రాంతంలో సాగునీ రు లేక వ్యవసాయ రంగంలో వెనుక బడిన ప్రాంతాలకు కాళేశ్వరం ద్వా రా సాగునీరు అందించడం జరిగిం దని రైతులు మేధావులు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కుట్రలను గమ నిస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజె క్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని దానిపై కమిటీ వేసి కమిటీ నివేదిక తెచ్చామని అసెంబ్లీలో పెట్టామని కాంగ్రెస్ వారు ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే వారికి మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ఘా టైన సమాధానం ఇచ్చారని గుర్తు చేశారు. హరీష్ రావు సరైన సమా ధానంతో కాంగ్రెస్ పార్టీ దిక్కుతోచని పరిస్థితిలో సిబిఐ విచారణకు వెళ్లిం దని విమర్శించారు.

కుట్రలు, కుతంత్రాలు చేస్తూ కేంద్రం లోని బిజెపితో కుమ్ముకై రాజకీయం చేస్తుందని ఆరోపించారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలకు తప్పుడు కు ట్ర కేసులకు బిఆర్ఎస్ పార్టీ అధినే త కెసిఆర్ ఏనాడు భయపడలేదని సుదీర్ఘకాలం పోరాడి సాధించిన తెలంగాణ నేడు అవినీతిమయంగా అభివృద్ధి నిరోధకంగా మారడంతో తెలంగాణ వాదులంతా ఆవేదన చెందుతున్నారన్నారు. తనపై ఉన్న అవినీతి ఆరోపణలు కప్పించుకోవ డానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని రా ష్ట్రంలో చోటాబాయి కేంద్రంలో బడే బాయ్ ఇద్దరు కుమ్ముక్కయ్యారని అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు పన్నినా బిఆర్ఎ స్ పార్టీ అదరదు, బెదరదని స్పష్టం చేశారు.

కాళేశ్వరం ద్వారా లబ్ధి పొందిన రై తాంగం కాంగ్రెస్ బిజెపిల కుట్రలను తిప్పి కొట్టాలని కాలేశ్వరం జలాల ద్వారా పుష్కలంగా పంటలు పండి న తీరును రైతులు గమనించాలని కాంగ్రెస్ బిజెపిలకు రానున్న కాలం లో తగిన బుద్ధి చెప్పాలని పిలుపు నిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు గుజ్జ యుగంధర్ రా వు, సంకేపల్లి రఘునందన్ రెడ్డి తుంగతుర్తి మండల పార్టీ అధ్య క్షుడు తాటికొండ సీతయ్య జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుండ గాని రాములు గౌడ్ లతోపాటు ప లువురు బిఆర్ఎస్ పార్టీ నాయకు లు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొ న్నారు.