Congress Gutha sukhendhar Reddy : కాంగ్రెస్ గూటికి గుత్తా అమిత్
--టిపిసిసి ఇన్చార్జి మున్షీ సమక్షంలో చేరిక --బిఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్
కాంగ్రెస్ గూటికి గుత్తా అమిత్
–టిపిసిసి ఇన్చార్జి మున్షీ సమక్షంలో చేరిక
–బిఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. రాష్ట్రం లోనే మరో కీలక నేత శాసన మం డలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి బిఆర్ ఎస్ పార్టీ ని వీడారు. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ( gutha sukhendhar Reddy ) తనయుడు, గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం నల్లగొండ జిల్లా రాజకీయాలు వేడెక్కాయి.
కాగా సోమవారం ఏఐసీసీ ఇంఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ ము న్షీ సమక్షంలో అమిత్ రెడ్డి హస్తం కండువా కప్పుకున్నారు. ఆ తర్వా త గుత్తా అమిత్ సీఎం రేవంత్ రెడ్డి ( CM RevanthReddy) ని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి తో పాటు మర్యాద పూర్వకంగా కలి శారు. ఈ కార్య క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి ఉన్నారు.
గత కొంతకాలంగా అమిత్ పార్టీ మారతారనే ప్రచారం జోరందుకున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఆ యన కాంగ్రెస్ తీర్థం పుచ్చు కోవ డoతో ఇక తండ్రి సుఖేందర్ రెడ్డి వంతు ఎప్పుడంటూ ఊహాగానాలు ఉవ్వెత్తున ఎగసిప డుతున్నాయి. అయితే గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీ మార తారని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
ఆయన మాత్రం అలాంటిదేంలేదని కొట్టి పారేస్తూ వస్తున్నారు. కానీ తాజాగా ఆయన కుమారుడు కాంగ్రెస్ పార్టీ పంచన చేరడంతో గుత్తా సుఖేందర్ కూడా కారు పార్టీ దిగడం ఖాయ మనే మాట వినిపిస్తోం ది. అంటే ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని స్పష్టమైన సంకే తాలు వెలువడుతున్నాయి.
*గుత్తా అభిమానుల సంబరాలు.*… గుత్తా వెంకట్ రెడ్డి మెమోరి యల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి కాం గ్రెస్ పార్టీలో చేరి,కాంగ్రెస్ కండువా కప్పుకున్న సందర్భముగా గుత్తా అభిమానులు, కార్యకర్త లు నల్ల గొండ క్యాంపు కార్యాలయం దగ్గర అధిక సంఖ్యలో పాల్గొని బాణా సంచా కాల్చి, పరస్పరం మిఠా యిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు అయితగాని స్వామి గౌడ్,యామ ద యాకర్, నాగు లవంచ వెంకటేశ్వర్ రావ్, శ్రీరామ దాసు హరి కృష్ణ, కంచరకుంట్ల గోపాల్ రెడ్డి,చిల్కరాజు శ్రీనివాస్ మైనారిటీ లీడర్ హ న్ను, దుబ్బ అశోక్ సుందర్,ఏరోళ్ల సంజీవ, పసల శౌరయ్య, బకరం వెంకన్న, చెనగాని యాదగిరి, నాంపల్లి శ్రీనివాస్,బొంత శ్రీనివాస్, రెగ ట్టే సైదులు,ఓరుగంటి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.