Congress Lok Sabha Chief Whip : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తో కాంగ్రెస్ లోక్ సభ చీఫ్ విప్ కె.సురే ష్ భేటీ
Congress Lok Sabha Chief Whip : ప్రజా దీవెన, హైదరాబాద్: కేరళ రా ష్ట్ర మావళికర సీనియర్ ఎంపీ, లో క్ సభలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ కె. సురేష్ గురువారం రాష్ట్ర రోడ్లు భ వనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మం త్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డితో మ ర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఎర్రమంజిల్ లోనీ ఆర్ అండ్ బి కా ర్యాలయంలో ఆయనతో సమావేశ మై పలు అంశాలు చర్చించారు.
కె.సురేష్ కేరళ నుండి 8సార్లు ఎన్ని కైన సీనియర్ లోక్ సభ సభ్యుడని, తను ఎంపీగా ఉన్నపుడు ఆయన తో పార్లమెంట్ లో ఉన్న అనుబం ధాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర మంత్రిగా ఆ యనతో భేటీ సంతోషకరం అన్నా రు.
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు వంటి అంశాలపై ఇరువురు చర్చించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభు త్వానికి భారంగా మారిందని, అ యినా సంక్షేమం, అభివృద్ధి విష యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎక్కడా తగ్గకుండా పనిచేస్తున్నామని తెలిపారు.