–ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్
BC Bandh Telangana : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: తెలం గాణ రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 18న జరిగే బిసి బంద్ కు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని డిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ కేతావ త్ శంకర్ నాయక్ తెలిపారు. గురు వారం నల్గొండలోని మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాల యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్య క్షులు గుమ్మల మోహన్ రెడ్డితో కలి సి ఆయన మాట్లాడుతూ బీసీల 42 శాతం రిజర్వేషన్ కు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శా తం రిజర్వేషన్ కోసం దృఢ సంక ల్పంతో అసెంబ్లీలో కూడా తీర్మానం చేసిందని తెలిపారు. బిజెపి, బీఆర్ ఎస్ పార్టీలు బీసీ రిజర్వేషన్ అదృ శ్య శక్తులతో కలిసి అడ్డుకున్నాయ ని విమర్శించారు.18న జరిగే బీసీ బంద్ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తం గా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా పాల్గొ ని విజయవంతం చేయాలని కోరా రు.
ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీని యర్ నాయకులు కత్తుల కోటి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అ ధ్యక్షుడు మామిడి కార్తీక్, పట్టణ అ ధ్యక్షుడు గాలి నాగరాజు, కంచర్ల ఆ నంద్ రెడ్డి, కెవిఆర్ సతీష్ తదితరు లు పాల్గొన్నారు.