* వైయస్సార్చిరస్మరణీయుడు: లక్ష్మీనారాయణ రెడ్డి.
YSR Jayanti : ప్రజా దీవెన, కోదాడ: జనహృదయనేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని పిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు లు అన్నారు. మంగళవారం వైయస్సార్ జయంతి సందర్భంగా కోదాడ పట్టణంలోని గుడిబండ రోడ్డు లో విగ్రహాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదల కొరకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని ఈ సందర్భంగా వారు చేసిన సేవలను కొనియాడారు.
వారి ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పారా సీతయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, సిహెచ్ శ్రీనివాసరావు, కాంపాటి శ్రీను, శ్రీధర్,గంధం యాదగిరి, కట్టే బోయిన శ్రీను, సుశీల రాజు, పెండెం వెంకటేశ్వర్లు, కుడుముల లక్ష్మీనారాయణ, గుండెల సూర్యనారాయణ, పాలూరి సత్యనారాయణ, డేగ శ్రీధర్, బాగ్దాద్, భాజాన్, అలీ భాయ్, ఖాజా గౌడ్, సైదిబాబు, ఖలీల్, మునీర్, నాగేందర్ రెడ్డి, దావల్,ముస్తఫా, శోభన్, తదితరులు పాల్గొన్నారు..