–పెద్ద సంఖ్యలో పాల్గొన్న పార్టీ శ్రేణులు
Jai Bapu Jai Bhim Rally : ప్రజాదీవెన, నల్గొండ టౌన్: ఎఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ పట్టణ సమీపంలోని మర్రిగూడ బైపాస్ వద్దజై బాపు,జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ,
ఈ భారీ ర్యాలీలో నల్లగొండ నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళా కాంగ్రెస్ ,యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు.అనంతరం అంబేద్కర్, జగ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.