
Congress party Political Affairs Committee meeting : ప్రజా దీవెన, భువనగిరి: తెలంగాణ కాంగ్రెస్‌లో 2028 ఎన్నికల మి షన్‌కు ఇప్పుడే బీజం పడిందా. భువన గిరి వేదికగా జరిగిన ఉ మ్మడి నల్లగొండ జిల్లా రాజకీయ వ్య వహారాల కమిటీ సమావేశం చూస్తే అవుననే సంకేతాలు క నిపిస్తున్నాయి. సంక్షేమ పథకాల అమలు నుంచి ఓటరు జాబితా పరిరక్షణ వరకు.. బూత్ స్థాయి కార్యకర్తల నుంచి క్షేత్రస్థాయి నా యకత్వం బలోపేతం వరకు కాం గ్రెస్ తన భవిష్యత్ రాజకీయ వ్యూహాన్ని పక్కాగా సిద్ధం చేసు కుం టున్నట్లు కనిపించింది. ఏఐ సీసీ తెలంగాణ ఇన్‌చార్జ్ మీనా క్షి నటరాజన్, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమ టిరెడ్డి వెంకట్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కు మార్ తదితరులతో కలిసి సమా వేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చిం చారు.

సంక్షేమమే కాంగ్రెస్‌కు ప్రధాన ఆయుధం
పేదవాడి కడుపు నింపే ఆహారం, సొంతింటి కలను నెరవేర్చే ఇల్లు, ఆపదలో అండగా నిలిచే వైద్యం ఇవన్నీ కేవలం సంక్షే మ పథకాలు మాత్రమే కాదని, ప్రజలతో ప్రభు త్వానికి ఉన్న అనుబంధానికి ప్ర తీకలని కాంగ్రెస్ నేతలు పేర్కొ న్నారు. ఇందిరాగాంధీ ‘గరీబీ హ ఠావో’ నుంచి సోనియాగాంధీ హ క్కుల ఆధారిత సంక్షేమ విధానం వరకు కొనసాగిన ఆలోచ నలకు అనుగుణంగా రాష్ట్రంలో సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, ఆరో గ్య శ్రీ వంటి పథకాలు అమలవుతు న్నాయని వివరించారు. రాష్ట్రం లో 1.06 కోట్లకు పైగా ఫుడ్ సె క్యూ రిటీ కార్డుల ద్వారా సు మా రు 3.42 కోట్ల మందికి ప్ర యోజ నం అందుతోందని, స్మార్ట్ రేషన్ కార్డులతో పంపిణీ వ్యవస్థ లో మ రింత పారదర్శకత తీసుకొస్తున్నామని తెలిపారు.

ఒక్క నిజమైన ఓటు కూడా పోకూడదు
ఇక స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై సమావేశం లో ప్రత్యేక దృష్టి సారించారు. ము ఖ్యంగా పేదలు, అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోకుం డా చూడాల్సిన బా ధ్యత బూత్ స్థాయి కార్యకర్తలపై ఉందని స్ప ష్టం చేశారు. BLA-2 కార్యకర్తలు అధికార యంత్రాంగంతో సమన్వ యం చేసుకుంటూ ఓటరు జాబి తాలను పరిశీలించాలని, అర్హు లైన ప్రతి ఓటరుకు సంబంధించి న వివరాలు సక్రమంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిం చారు.
ఇక బూత్ నుంచే రాజకీయయుద్ధం
కాంగ్రెస్ వ్యూహంలో అసలు కీల క అంశం ఇదే. 2028 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే పార్టీ శ్రేణుల ను పునర్వ్యవస్థీక రించాలనే సంకేతాలు సమా వే శంలో కనిపించాయి.నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం వంటి కాంగ్రెస్‌కు బలమైన ప్రాంతాలను మరింత పటిష్ఠం చేయడం తో పా టు ఇతర ప్రాంతాల్లో పార్టీని విస్త రించడంపై దృష్టి పెట్టాలని నిర్ణ యించినట్లు తెలుస్తోంది. ప్రాంతీ య రాజకీ య ప్రత్యర్థులతో పో రాటానికి మాత్రమే కాకుండా, భ విష్య త్తులో బీజేపీతో సిద్ధాం తప రమైన, ప్రత్యక్ష రాజకీయ పోరా టానికి పార్టీ శ్రేణులను సిద్ధం చే యడం కూడా వ్యూహంలో భా గంగా కనిపిస్తోంది.
కష్టకాలంలో పార్టీ కోసం నిలిచిన వారికే ప్రాధాన్యం
గత పదేళ్ల ప్రతిపక్ష కాలంలో పార్టీ జెండాను మోసిన క్షేత్రస్థా యి నా యకులు, మండల, మున్సిపల్ స్థాయి కార్యకర్తల ను విస్మరించ బోమనే స్పష్టమైన సంకేతం ఇ చ్చారు.కష్టకా లంలో పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి ప్రభు త్వ నా మినేటెడ్ పదవుల్లో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించా రు. దీంతో క్షేత్రస్థాయి కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపడం తో పా టు పార్టీకి బలమైన క్యాడర్‌ను తయారు చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది.
మొత్తంగా చూస్తే భువనగిరి స మావేశం సాధారణ రాజకీ య సమావేశంగా కాకుండా 2028 ఎ న్నికల కోసం కాంగ్రెస్ ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రారంభించిన సంకేతంగా నిలి చింది.ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మ రింత బ లంగా తీసుకెళ్లడం, ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడ టం, బూత్ స్థాయిలో పార్టీని బ లోపేతం చేయడం, కష్టకా లంలో పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడం.. ఇవే కాంగ్రెస్ కొత్త వ్యూహానికి కీలక స్తంభాలుగా కనిపిస్తున్నాయి.
ఇక ఎన్నికల సమరానికి ఇంకా సమయం ఉన్నా.. కాంగ్రెస్ మా త్రం బూత్ నుంచే 2028 పోరుకు పావులు కదుపుతు న్నట్లు రాజ కీయ వర్గాల్లో చర్చ మొదలైంది.ఓటరు నమో దు, పేర్ల పరిశీలన, అధికారిక సవరణలు లేదా ఇతర ఎన్నికల సేవల కోసం భారత ఎ న్నికల సంఘం అధికారిక Vot ers’ Service Portal లేదా సం బంధిత ఎన్నికల అధికారుల కా ర్యాలయాన్ని సంప్రదించవచ్చని నాయకులు తమ ప్రసంగాల్లో క్యాడర్ కు నిర్దేశించారు.



